
మొబైల్ షాపు దగ్ధం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు బహుదూర్ బాషాకు చెందిన బీఆర్ మొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.15–20 లక్షలు దాకా నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి పరిశీలించారు. వివరాలు ఇలా.. తిప్పలూరు గ్రామానికి చెందిన బహుదూర్ బాషా గత కొన్నేళ్లుగా సెల్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై షాపు యజమాని బహుదూర్ బాషాకు సమాచారం అందించారు. వెంటనే అతను షాపు వద్దకు చేరుకుని షెట్టర్ తెరవగా లోపల ఉన్న సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వస్తువులు కాలి బూడిదై ఉన్నాయి. ఇటీవలే సుమారు రూ.15 లక్షలు విలువ గల వివిధ వస్తువులు కొనుగోలు చేసి షాపులో ఉంచారు. మొత్తం రూ.20 లక్షలు విలువ చేసే వస్తువులు దుకాణంలో ఉన్నాయి. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలోని వస్తువులన్నీ కాలిపోయాయి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు సహకరించారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన స్థలాన్ని సీఐ నరేష్‌బాబు పరిశీలించి బాధితుడితో మాట్లాడారు. అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకునానరు. బాధితుడికి పార్టీ తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పెన్నా రషీద్, మహ్మద్‌గౌస్, మహమ్మద్ ఆలీతో పాటు వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు జయరామక్రిష్ణారెడ్డి. కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూమారు రూ.15–20 లక్షలు నష్టం

మొబైల్ షాపు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment