
మైదుకూరు జాతరలో అపశ్రుతి
మైదుకూరు : మైదుకూరులో ఆదివారం జరిగిన జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పెద్దమ్మతల్లిని ఊరేగింపుగా గద్దె వద్దకు తీసుకు వస్తున్న సమయంలో బాణసంచా పేలి చరణ్ తేజ అనే 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాణసంచా పేలడంతో బాలుడి పొట్టపైన, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు భయంతో పరుగెత్తి డ్రైనేజీలో పడి గాయపడ్డారు. గాయపడిన బాలుడు చరణ్ తేజకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి కడపకు తరలించారు. ఆదివారం రాత్రి కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడికి శస్త్ర చికిత్స జరిగింది. జాతరలో బాణసంచా పేల్చేందుకు నిపుణులను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ సంఘటన జరిగిందని పలువురు అంటున్నారు. జాతరలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చే బాణసంచా పేల్చడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
కడప అర్బన్ : నిత్యం పని ఒత్తిడిలో ఉండే న్యాయశాఖ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే న్యాయశాఖ ఉద్యోగులకు ఇలాంటి ఆటల పోటీలు ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించేందుకు ఆస్కారం లభిస్తుందన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబాఫకృద్దీన్, అదనపు న్యాయమూర్తి రామారావు, ప్రభుత్వ న్యాయవాది శివ శంకర్ రెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎస్. జిలానిబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
బాణసంచా పేలి బాలుడికి తీవ్ర గాయాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment