
చవ్వా విజయశేఖర్‌రెడ్డి నేత్రదానం
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని చవ్వా సుభాకర్ రెడ్డి కాలనీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చవ్వా విజయ శేఖర్ రెడ్డి ఆదివారం మరణించడంతో ఆయన నేత్రాలను దానం చేశారు. భార్య సునీత, కుమారుడు దుష్యంత్ రెడ్డి, కుమార్తె మధులిక, చెల్లెలు ప్రమీలమ్మ, బావ వైఎస్ మనోహర్ రెడ్డి, వదిన సులోచనమ్మలు నేత్రదానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి, నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారమిచ్చారు. నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్‌తో కలిసి మృతుని స్వగృహానికి వెళ్లి భౌతికకాయం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు. ఈ సందర్బంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలసి పోయే నేత్రాలు దానం చేయడం ద్వారా అంధత్వంతో బాధ పడుతూ ఈ లోకాన్ని చూడలేని అంధులకు చూపు ఇచ్చినవారమవుతామన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులెవరైనా మరణిస్తే నేత్రదానం కోసం 9866727534, 7093204537 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment