నూతన వధూవరులకు ఆశీర్వాదం
● అడుగడుగునా కన్నీటిగాథలే..
సాక్షి కడప : పచ్చని ఫలం చూస్తుండగానే నేలవాలింది.. కొండంత కష్టం నేలపాలైంది. ప్రకృతి దెబ్బకు గెలలతో కళకళలాడుతున్న అరటి అల నిలువునా ఒరిగిపోయింది. రెండు,మూడు రోజుల్లో కోత కోద్దామనుకున్న రైతుల ఆశల్ని గాలివాన తుంచేసింది. వారి కాయాకష్టాన్ని నేలపాలు చేస్తూ వారి జీవితాల్లో కోత విధించింది. రెండు రోజుల క్రితం వీచిన గాలివానకు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. నిండు కాపుతో ఉన్న చెట్లన్ని నేలపాలు కావడంతో రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం మరింత బాధ కలిగిస్తోందని రైతులు వాపోయారు.
ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్ జగన్ ధ్వజం
గాలులు, వర్షాలకు లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలతోపాటు అనేక గ్రామాల రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. వారి బా ధలను ఆలకించారు. అండగా ఉంటామని ధైర్యం నింపారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిహారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రైతులలో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాద వుతోంది.. మరో మూడేళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇన్సూరెన్స్‌తోపాటు పూర్తిస్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ..గతంలో ఇచ్చిన రూ.50వేల తరహా లోనే నెల రోజుల్లోనే అందిస్తామని రైతన్నల్లో భరోసా నింపారు.
తోటలను పరిశీలించిన మాజీ సీఎం
అకాల వర్షాలకుతోడు పెనుగాలులతో లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో సూర్య నారాయణరెడ్డి, కేశవయ్య పొలాలతోపాటు దారి పొడవునా అరటి తోటలను పరిశీలించారు. తోటల పరిస్థితిని చూసి మాజీ సీఎం చలించిపోయారు.
కూటమి సర్కారుపై కన్నెర్ర
లింగాల మండల పర్యటనలో రైతులు పడుతున్న బాధలను దగ్గరగా చూసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల భీమా విధానాన్ని రద్దు చేసి కొత్తగా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం దుయ్య బట్టారు. రైతులకు సంబంధించి సున్నా వడ్డీ లేదు, కనీసం రైతు భరోసా లాంటిది అందించడంలేదని ధ్వజమెత్తారు. కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. మండు వేసవిలో ఎండలు అదరగొడుతున్నా.. మిట్ట మధ్యాహ్న సమయంలోనే రైతులతో మమేకమయ్యారు. రైతుల బాధలను పంచుకుంటూ.. పొలాల మధ్యనే రైతులతో మాట్లాడుతూ కదిలారు.
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి బయలుదేరే సమయంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మీదుగా తాతిరెడ్డిపల్లెకు వెళుతుండగా రైతులు అడుగడుగునా ఆపి తమ పొలాలను చూపించారు. సూర్యనారాయణరెడ్డి తోట వద్దకు రాగానే ఇంద్రావతి, రాగమణి, లక్ష్మిదేవి, ఎం.లక్ష్మిదేవి, రాజేశ్వరి, వాలమ్మ తదితరులు జగన్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ... ‘పంటంతా పోయింది.. రేపో మన్నాడో కోస్తామనుకునేలోపే పోయింది. ఉన్నఫలంగా గాలులు దెబ్బతీశాయి. మాకు దిక్కెవరంటూ’విలపించారు. కొందరు మహిళలు ‘మాకు ఇద్దరు ఆడబిడ్డలు అని ఒకరు, మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ఎలా చదివించాలి, ఎలా బతికి బట్టకట్టాలంటూ బోరుమన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా కోసే సమయంలో ఇలా పడిపోయిందని.. చివరకు కూలీ లు దొరకడం లేదు.. ఆలస్యం కావడంతో దళారులు రేట్లు తగ్గిస్తున్నారు.. ఈ వ్యవస్థను మార్చండి.. మమ్ములను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండని’జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారితోపాటు ఉన్న కొంతమంది తాతిరెడ్డిపల్లె రైతులు కూడా తమ బాధను మాజీ సీఎంకు వివరించారు. దళారుల రాజ్యం అధికంగా ఉందని.. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని.. ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోతే పెట్టుబడులు కూడా దక్కవని వాపోయారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించలేదు.. కనీసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఉద్యాన శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను కూడా మాజీ సీఎం గట్టిగా ప్రశ్నించారు. చిన్నకుడాల క్రాస్ నుంచి లింగాల, తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల వరకు పొలాలను పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి రైతు కంట కన్నీరు కనిపించింది.
ఈదురు గాలులకు నిలువునా
నేలవాలిన తోటలు
ప్రకృతి దెబ్బతీసినా..పట్టించుకోని ప్రభుత్వం
లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్
వేంపల్లె : వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి కుమారుడికి వివాహమైన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెడ్పీటీసీ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇటీవల శ్రీలంకలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుడైన సాయి భైరవ ప్రీతం కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహం జరిగింది. జిల్లా పర్యటనలో పులివెందులకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లింగాల మండలంలో పర్యటించి అక్కడి అరటి రైతులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల నుంచి వేంపల్లెకు విచ్చేశారు. అలాగే రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, సుఽధీర్ కుమార్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, వేంపల్లె వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునీర్‌బాషా, రవిశంకర్ గౌడ్, సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
నూతన వధూవరులకు ఆశీర్వాదం
నూతన వధూవరులకు ఆశీర్వాదం
నూతన వధూవరులకు ఆశీర్వాదం
నూతన వధూవరులకు ఆశీర్వాదం
నూతన వధూవరులకు ఆశీర్వాదం
Comments
Please login to add a commentAdd a comment