వెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం తగదు
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం చేయడం తగదని కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ తెలిపారు. ఆయన సోమవారం తమ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది ఉద్దేశ పూర్వకంగా కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతూ మూడో వ్యక్తికి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యాప్రమాణాల్లో మెరుగైన విధానాలను అవలంబిస్తున్నందుకు న్యాక్ బీ ప్లస్ గుర్తింపు వచ్చిందన్నారు. వీటి కారణంగానే ప్రభుత్వం తమ కళాశాలకు అటానమస్ హోదాను ఇచ్చిందని తెలిపారు. అడ్మిషన్లు చేసుకునే సమయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే తమ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆయన అటానమస్, న్యాక్‌తోపాటు ఇతర సర్టిఫికెట్లను చూపించారు. ఇటీవలి కాలంలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment