గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలి
కొండాపురం: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సీపీ డబ్ల్యూ స్కీం నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గండికోట జలాశయం నుంచి కొండాపురం మండలంలోని తొమ్మిది గ్రామాలకు వెళ్లే సీపీడబ్ల్యూ స్కీం ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీపీడబ్ల్యూ స్కీం పైపులైన్ డ్యామేజ్ కావడంతో ఆరు గ్రామాలకు తాగునీటి సౌకర్యం నిలిచిపోయిందని అధికారులు ఆమె దృష్టికి తీసికెళ్లారు. ప్రస్తుతం మండలంలోని కొండాపురం, గండ్లూరు, చౌటిపల్లె గ్రామాలకు ఈస్కీం నడుస్తున్నట్లు ఆమెకు వివరించారు. పునరావాస కేంద్రాలల్లో తాగునీటిసమస్య లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ నాగప్రసాద్ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మోహన్, ఏఈ ప్రసాద్, శంకర్‌రెడ్డి,పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
వైద్య సేవలు కొనసాగాయి
కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదల వైద్యానికి ఎలాంటి ఆటంకం కలగలేదని ఆ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ బాల ఆంజనేయులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్యమిత్రలు సోమవారం విధులను బహిష్కరించి తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలిపిన విషయం విదితమే.
జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ
Comments
Please login to add a commentAdd a comment