క్షయ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
రాయచోటి అర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులపై ఎవరూ వివక్ష చూపరాదని జాతీయ మానవ హక్కుల కమిషన్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వర్చువల్‌గా రైల్వేకోడూరు జ్యోతికాలనీలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా కుష్టువ్యాధి నివారణ కార్యక్రమం అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, డీఎంహెచ్‌ఓ కొండయ్య, అదనపు డీఎంహెచ్‌ఓ శైలజ, జిల్లా న్యూక్లిప్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ డాక్టర్ శివప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment