
రైతులపై పాలకులే కాదు ప్రకృతీ పగబట్టింది. చేతికొచ్చిన పం
లింగాల: లింగాల మండలంలో గురువారం బలమైన ఈదురు గాలులకు అరటి పంట నేలకూలింది. మండలంలోని ఇప్పట్ల, అక్కులగారిపల్లె, తేర్నాంపల్లె, పెద్దకుడాల, లింగాల, లోపట్నూతల గ్రామాల్లోని అరటి చెట్లు సుమారు 30ఎకరాలలో నేలకూలాయని రైతులు వాపోతున్నారు. తన అరటితోటలో సుమారు 3వేల అరటి చెట్లు నేలకూలాయని లోపట్నూతల గ్రామానికి చెందిన బాల పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కోతకు వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తున్నాయని.. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖాధికారి రాఘవేంద్రారెడ్డి స్పందిస్తూ ఆర్‌ఎస్‌కే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. సుమారు 30ఎకరాలలో అరటి పంట కూలిపోయిందని రూ.60లక్షల మేర పంట నష్టం సంభవించినట్లు ఆయన వెల్లడించారు.
అకాలవర్షం... రైతులకు నష్టం
కొండాపురం: మండల పరిధిలోని తిరుమలాయపల్లె,బుక్కపట్నం వెంకయ్య కాలువ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో అనుకోకుండా అకాలవర్షం కురవడంతో పంటలు నేలకొరిగాయి. బుక్కపట్నం, తిరుమ లాయపల్లె గ్రామాల్లో మిర్చిపంటలో ఎండు మిరపకాయలకోసం ఉంచిన పొలంలో ఈదురుగాలులు వీయడంతో పండుమిరపకాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే వెంకయ్యకాలువ లో అరటి కోత దశలో స్వల్పంగా అరటి మొక్కలు నెలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాలల్లో రైతులకు నష్టం వాటిలింది.నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షాలు,గాలులకు కూలిన అరటితోటలు
జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులు

రైతులపై పాలకులే కాదు ప్రకృతీ పగబట్టింది. చేతికొచ్చిన పం