బతుకమ్మ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకొనేందుకు రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా గురువారం మూడు వేల మంది మహిళలతో రాష్ట్ర చిహ్నమైన మహా తంగేడు పువ్వు ఆకృతి రూపొందించడం, అలాగే ఒకేసారి మూడు వేల బతుకమ్మలను పేర్చడం ద్వారా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు