తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులె వరైనా రైతులేనని, ఏ రాష్ట్రం వారైనా వారి ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీకి కావాల్సింది నీరు కానీ.. వివాదాలు కాదని పేర్కొన్నారు. నీటి కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా.. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకే తాను ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణాలో లభ్యత జలాలను సద్వినియోగం చేసుకునే ఆలోచన చేయాలే తప్ప వివాదాలు సృష్టించుకోవద్దని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసింది.