పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరగగా.. లోక్‌సభలో అరుణాచల్‌ప్రదేశ్ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ దిగువ సభనుంచి వాకౌట్ చేసింది. అటు రాజ్యసభలో.. భారీవర్షాలకు జరిగిన నష్టం-కారణాలు, ఎంపీల వేతనాలు, ముంబైలో అంబేడ్కర్ భవనం కూల్చివేత అంశాలపై చర్చ జరిగింది.