అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభాలపై లోక్సభలో మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్ష నాయకులు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.