తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదలైన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని వాళ్లు నినాదాలు చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది.