'మాతో ఫోన్లో మాట్లాడానికి కూడా తీరిక లేదా?' | dont trs have time to talk on alliance with cpi k narayana lashes out | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 24 2014 3:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

పొత్తులపై టీఆర్ఎస్ నేతలు కాలయాపన కోసమే యత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. టీఆర్ఎస్ నేతలతో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలకు తమతో ఫోన్లో మాట్లాడటానికి కూడా తీరిక లేదా అని సూటిగా ప్రశ్నించారు. పొత్తుల విషయంలో తాము 15 రోజుల క్రితమే టీఆర్ఎస్కు అభ్యర్థుల జాబితా ఇచ్చామని నారాయణ తెలిపారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా చర్చలు మొదలు పెట్టేదేమిటని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్తో పొత్తుపై నారాయణ స్పందిస్తూ తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని...ఒకవేళ ఫోన్ వస్తే అప్పుడు స్పందిస్తానని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement