తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. టీడీపీని వ్యతిరేకించి బీజేపీలో చేరిన నాగం సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి రావడం, అక్కడ పార్టీ నేతలతో కొద్ది సేపు రహస్యంగా చర్చలు జరపడం లాబీల్లో పెద్ద చర్చకు దారితీసింది.