ఆంధ్రప్రదేశ్లో కనుల విందుగా పవిత్ర గోదావరి పుష్కర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రిలో పుణ్యస్నానం చేసి మంగళవారం ఉదయం 6.26గంటలకు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గోదావరి పుష్కరాలు ప్రారంభించారు. మరోపక్క, కొవ్యూరులోని గోష్పాద క్షేత్రంలో కంచిపీఠం ఉత్తరాధికారి విజేయంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. అంతకుముందు సీఎం గోదావరి మాతకు చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుష్కర ఘాట్ వద్ద కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు కంచి మరోపీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ కూడా పాల్గొన్నారు. పుష్కర స్నానం కోసం 177, పశ్చిమగోదావరి జిల్లాలో 92 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామునుంచే పుష్కర ఘాట్లలో రద్దీ మొదలైంది.