ఆంధ్రప్రదేశ్లో కన్నుల పండువగా ప్రారంభమైన గోదావరి పుష్కరాలు కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చాయి. పన్నెండు రోజులపాటు ఆనందపరవశంతో పుష్కరస్నానమాచరించాల్సిన భక్తులు ఒక్కసారిగా ప్రాణభయంతో ఆలోచనలో పడ్డారు. పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజే అపశృతి చోటుచేసుకోవడం అక్కడే ఉన్న భక్తులను, ఆ సన్నివేశాలను తిలకిస్తున్న సామాన్య జనాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రాజమండ్రిలో పుష్కరాలు ఉదయం 6.21గంటలకు ప్రారంభంకాగా రెండు గంటల వ్యవధిలోనే తొక్కిసలాట చోటుచేసుకొని ముగ్గురు చనిపోవడంతో తీవ్ర కలవరం నెలకొంది.
Published Tue, Jul 14 2015 11:47 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
Advertisement