డీ ఘటన తరహాలోనే శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగారు. ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ క్యాంపులోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీన్ని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. గంటసేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. ఓ జవాను అమరుడవగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని ఆర్మీ వెల్లడించింది. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సమీపంలోని పార్కు నుంచి.. క్యాంపులోకి చొచ్చుకు వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.