ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ విషయంలో బ్రిక్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాద గ్రూప్‌లు, ఉగ్రవాదుల విషయంలో ఉద్దేశపూరిత సంకుచిత వైఖరి ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని, భవిష్యత్తులో ఇది భస్మాసుర హస్తం కాగలదని ఆయన చైనా సహా ఇతర బ్రిక్ దేశాలను హెచ్చరించారు.