రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగనుందా? పంజాబ్, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ దుమ్ము రేపనుందా? ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడనుందా? గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సరళిని చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది!