నగరంలోని సిద్దార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ గ్రౌండ్‌లో శనివారం ఉదయం సాక్షి మెగా ఆటో షో ప్రారంభమైంది. నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ మెగా ఆటో షోను ప్రారంభించారు. పలు వాహన కంపెనీలు వివిధ మోడళ్లతో పదిహేను స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. మోటార్ బైక్స్ ఆధునిక హంగులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.