mayer
-
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీ !
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజలస్ మేయర్‌గా పని చేస్తున్న ఎరిక్ గార్సెటీని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బైడెన్ గురువారం ఖరారు చేసినట్లు ఎరిక్ వెల్లడించారు. సెనేట్ ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తే భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం భారత్‌లో అమెరికా రాయబారిగా ట్రంప్ ప్రభుత్వం నియమించిన కెనెత్ జస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల ఎరిక్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. దాదాపు 12 ఏళ్ల పాటు లాస్ ఏంజలస్ సిటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు. అందులో ఆరేళ్ల పాటు కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2013 నుంచి లాస్ ఏంజలస్ నగర మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్ గురించి స్పందిస్తూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తన నియామకం జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో ఆయన భారత్‌లో ఏడాది పాటు ఉండి హిందీ, ఉర్దూ భాషలపై అధ్యయనం కూడా చేశారు. -
లాక్డౌన్ ఉల్లంఘన.. చావు తెలివితేటలు
లిమా: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాక అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చనిపోయినట్లు నటించాడు పెరూ పట్టణానికి చెందిన మేయర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. కరోనా నేపథ్యంలో పెరూలో లాక్డౌన్ అమల్లో ఉంది. కానీ టంటారా పట్టణ మేయర్ జైమే రొలాండో అర్బినా టొర్రెస్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చి పార్టీ చేసుకున్నారు. అయితే పోలీసులు రాగానే జైమే రొలాండో ఫేస్‌మాస్కు ధరించి, కళ్లు మూసి అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న శవపేటికలో పడుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మేయర్ జైమే రొలాండో ఇలా చేశారు. జైమే రోలాండ్ చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్నపుడు తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జైమే రొలాండో స్నేహితులను అప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Acalde de Tantará, en la región de Perú, en el marco de la pandemia #COVID_19 que azota al #país. Jaime Rolando Urbina Torres se introdujo en un ataúd, con los ojos cerrados, para evitar ser detenido por la #Policia. El lunes salió a beber este personaje #VenezuelaVictoriosa pic.twitter.com/Eh1fekLUZ5 — joel (@Joelochoa73) May 21, 2020 పెరూలో లాక్‌డౌన్‌ను జూన్ చివరి వరకు పొడిగించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.3 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3700 మంది కరోనాతో చనిపోయారు. పెరూ కఠినంగా లాక్డౌన్ రూల్స్ అమలు చేస్తుంటే టంటారా మేయర్ జైమే రొలాండో ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. -
పని చేస్తేనే పదవి ఉంటది!
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తేనే పదవి ఉంటుంది.. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా సస్పెన్షన్‌కు గురికావడం లేదా పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులను ఇకపై అధికార దర్పం, దర్జా, పలుకుబడి కోసం వాడుకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 120 మంది చైర్పర్సన్లు, 9 మంది మేయర్లు, 2,727 మంది కౌన్సిలర్లు, 385 కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ అధికార, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. ఏదైనా కారణాలతో అర్ధంతరంగా పదవి నుంచి తొలగింపునకు గురైతే .. మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కో వాల్సిందే. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు/చైర్మన్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఇవీ.. చైర్పర్సన్/మేయర్ బాధ్యతలు పట్టణం/నగరం పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ. గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 10 శాతం నిధులను మొక్కల పెంపకం కోసం కేటాయింపు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలి. సొంత వార్డులో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పార్కుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల పరిరక్షణ. ఏటా వార్షిక అకౌంట్ల ముగింపు, ఆడిటింగ్‌కు చర్య తీసుకోవాలి. పురపాలక ఆస్తుల అతిక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అవసరం ఉంటే తప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లు వాడరాదు. వర్షపు నీటి సంరక్షణతో పాటు ఈసీబీసీ ప్రమాణాలతో చల్లని పైకప్పు గల ఇంధన పొదుపు భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. మున్సిపల్ చట్టంలో నిర్దేశించిన అధికారాలు, బాధ్యతలతో పాటు ప్రభుత్వం ఆదేశించే ఇతర అధికారాలు, బాధ్యతలను సైతం నిర్వర్తించాలి. కౌన్సిల్ సమావేశం ముగిసిన 24 గంటల్లోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు(మినట్స్)పై సంతకం చేయాలి. నర్సరీ నిర్వహణ, మొక్కల పెరుగుదల బాధ్యత మేయర్/చైర్పర్సన్, కమిషనర్లది. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వార్డు సభ్యుల బాధ్యతలు.. వార్డులో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. ఇంటింటి నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ. చెరువుల పరిరక్షణ. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని(పైపులైన్ల లీకేజీతో) నియంత్రించాలి. అవసరం ఉంటేతప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లను వాడరాదు. మున్సిపల్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తమ వార్డులో మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పట్టణాభివృద్ధిపై శిక్షణ తీసుకోవాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఈ శాతానికి మొక్కలు తగ్గితే వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి విఫలమైనా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. నిర్లక్ష్యం వహిస్తే తొలగింపే.. మున్సిపల్ చట్టం నిబంధనలు, ఇతర నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరిచేందుకు నిరాకరించినా/ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బాధ్యతలు, కర్తవ్యం నిర్వహణలో విఫలమైనా మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలన సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం/ప్రభుత్వం నియమించిన ఇతర ఏ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించినా విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కలిగి ఉన్నా.. మున్సిపల్ నిధులను దుర్వినియోగపరిచినా.. పురపాలికల బాధ్యతల నిర్వహణలో తరచూ విఫలమైనా, తన బాధ్యతలను విస్మరిస్తూ అసమర్థుడిగా తయారైనా.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తుంది. తొలగించడానికి ముందు సంజాయిషీ ఇచ్చుకోవడానికి అవకాశమిస్తుంది. అనర్హత పడితే మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. దాడులు చేస్తే సస్పెన్షన్.. పురపాలికల అధికారులు, ఉద్యోగుల పట్ల స్థానిక కౌన్సిలర్లు, చైర్పర్సన్లు దురుసుగా ప్రవర్తించడం, దూషణలకు దిగడం, కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే పదవి కోల్పోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించినా, తోటి సభ్యుడు/ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆస్తి ధ్వంసం చేసినా, అసభ్య పదజాలం వాడినా, మున్సిపల్ సమావేశాన్ని ఆటంకపరిచినా, పురపాలిక ఆర్థిక సుస్థిరకు నష్టం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా సదరు చైర్పర్సన్/ వైస్‌చైర్‌పర్సన్/ వార్డు సభ్యుడిని సస్పెండ్ చేస్తూ గెజిట్ నోటీసు జారీ చేస్తుంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు తమంతట కానీ, కౌన్సిలర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గానీ జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. సస్పెన్షన్ విధిస్తే 30 రోజుల్లోగా మున్సిపల్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. -
వారమంటే....వడ్డింపే
పారిస్ : కష్టపడి పనిచేస్తే ఎవరికైనా జీతం పెరుగుతుంది లేదా ప్రమోషన్ వస్తుంది...కానీ ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి జరిమానా పడింది. అదేంటి కష్టపడి పనిచేస్తే.. జరిమానా ఎందుకు విధించారు అనుకుంటున్నారా? ఫ్రాన్స్‌లో అంతేనట. వివరాల్లోకి వెళ్తే ఫ్రాన్స్‌లో ప్రతి ఒక్కరూ వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. కచ్చితంగా ఒక రోజు సెలవు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికీ ఇదే నియమం వర్తిస్తోంది. అయితే ఈ నియమం పాటించని బేకరీ యజమాని సెడ్రిక్ వైవ్రికి అక్కడి ప్రభుత్వం 3వేల యూరోల జరిమానా విధించింది. వెవ్రి పారిస్‌కు 120 మైళ్ల దూరాన ఉన్న లూసిగ్ని సర్ బార్స్‌లో లెక్ బెకరీని నిర్వహిస్తున్నాడు. రాబోయే వేసవి రద్ధీ దృష్టా ముందుగానే పెద్ద మొత్తంలో క్రిసాంట్స్, బగెట్స్ని తయారు చేసి పెట్టుకోవాలని భావించాడు. అందుకోసం వారంలో ఏడురోజుల పాటు పనిచేయడం ప్రారంభించాడు. కానీ అక్కడి స్థానిక చట్టాల ప్రకారం చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా వారంలో ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. ఈ చట్టాన్ని రోజువారి వేతనం కోసం పనిచేసే కూలీలకు ఒక రోజు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడానికి, శ్రమ దోపిడి నుంచి కాపాడటం కోసం రూపొందించారు. సాధరణంగా బేకరిల్లో పని మొత్తం రాత్రిపూటే జరుగుతుంది. యజమానుల పని ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అందుకని యజమానులు వారంలో ఏడు రోజులు పని చేస్తానంటే అందుకు అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకే వైవ్రీకి జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై టౌన్ మేయర్ క్రిస్టియాన్ బ్రాన్లే స్పందిస్తూ... ‘వేసవిలో వచ్చే సందర్శకులే మాకు ప్రధాన ఆదాయ వనరు. ఒక్క రోజు వ్యాపారాన్ని మూసివేస్తే మాకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఇలాంటి చట్టాలన్నీ మా వ్యాపారాలకు ఆటంకంగా మారాయి’ అని అన్నారు. ఇక్కడి ప్రజలు కూడా వైవ్రీకే మద్దతు ఇస్తున్నారు. వారంలో ఏడు రోజులు పనిచేయాలనే వైవ్రీ వాదనను సమర్థిస్తూ దాదాపు 500 మంది సంతకాలు చేశారు. అయినప్పటికీ వైవ్రీ జరిమాన చెల్లించాల్సి వచ్చింది. -
పెంపుడు జంతువులతో రోడ్లపైకి వస్తే బాదుడే !
-
విజయవాడలో ఘనంగా సాక్షి మెగా ఆటో షో
-
ఐయామ్ నాట్ జీరో..
మంత్రి నారాయణపై కయ్యానికి కాలు దువ్విన అజీజ్ ఇలాగైతే పార్టీ నాశనమవుతుందని మేయర్‌పై బీద ఆగ్రహం మేయర్‌పై టీడీపీ నేతల మూకుమ్మడి ఫిర్యాదు నెల్లూరు సిటీ: ఐయామ్ నాట్ జీరో.. ఐయామ్ అజీజ్.. మంత్రి పని మంత్రి చేయాలి.. మేయర్ పని మేయర్ చేస్తారు అంటూ మేయర్ అబ్దుల్ అజీజ్ మంత్రి నారాయణపై కయ్యానికి కాలుదువ్వడంతో టీడీపీ ముఖ్యనేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి నారాయణ క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం కార్పొరేషన్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో మేయర్ తీరుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మేయర్‌పై అసహనం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ అదే స్థాయిలో మంత్రిపై ఎదురుదాడికి దిగారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ మధ్య విభేదాలు ఇప్పటి వరకు తెరవెనుకనే జరిగాయి. మేయర్ వ్యవహార తీరులో రోజురోజుకూ మార్పులు రావడం, వ్యవహారశైలి మారడంతో మంత్రి నారాయణకు ఆగ్రహం తెప్పించింది. దీంతో మేయర్‌కు పార్టీ సమావేశంలోనే మంత్రి అక్షింతలు వేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సమావేశానికి టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పార్టీ ఫ్లోర్‌లీడర్ శివప్రసాద్, ఇతర నేతలు హాజరయ్యారు. సమావేశానికి మేయర్ అజీజ్ రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. నేతలు పలుమార్లు ఫోన్ చేస్తే గానీ సమావేశానికి రాలేదని సమాచారం. శనివారం మంత్రి నారాయణ నగరంలో ఉన్నా మేయర్ అజీజ్ ఆయన్ను కలవకపోవడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, జెడ్ శివప్రసాద్, కార్పొరేటర్లతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మంత్రి నారాయణ మేయర్‌కు సూచించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. మేయర్‌ను ఉద్దేశించి 'నువ్వు చేస్తున్న పని తీరు బాగాలేదని, నువ్వు జీరోవి అంటూ మంత్రి మండిపడినట్లు తెలుస్తోంది. మేయర్ ద్వారా పార్టీ నిలబడదని, ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. నీ ఒక్కడి కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయని, దీని వల్ల రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితం మంత్రి నారాయణ వ్యాఖ్యలకు మేయర్ ఘాటుగా స్పందించారు. కార్పొరేషన్ అభివృద్ధికి రూ.కోట్ల నిధులిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని, ఆచరణలోకి వచ్చే సరికి ఒక్క రూపాయి రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితమైందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఇన్చార్జీలు, కార్పొరేటర్లే తనను సంప్రదించాలని, తాను వాళ్ల వద్దకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరికైనా పనులు కావాలంటే తనతో చెప్తేనే కదా కేటాయించేదన్నారు. ఇలాగైతే పార్టీ నాశనం మేయర్ అజీజ్ వ్యవహారంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మండిపడ్డారు. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పార్టీ నాశనమవుతుందన్నారు. మరోవైపు మేయర్ వ్యవహారంపై నగరపాలక టీడీపీ నేతలు, కార్పొరేటర్లు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు అజీజ్‌లో మార్పు వస్తుందని చూసిన నేతలు తాజాగా ఆయన మంత్రిపైనే తిరుగుబాటు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.20లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్ఖానగడ్డ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.20లక్షలు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. సోమవారం 4వ డివిజన్లోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులో రూ.2.5 లక్షలతో నిర్మించనున్న డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి శ్మశానవాటికలకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. డీపీఆర్ రూపొందిన తర్వాత స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో ప్రవేశిస్తామని, పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత, నాయకులు పెండ్యాల మహేశ్, కామారపు శ్యాం, కట్కూరి మల్లేశం, ఆనంద్, అరుణ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో సీసీరోడ్డు పనులు 5వ డివిజన్ కిసాన్‌నగర్ ముస్లింవాడలో రూ.8 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మేయర్ ప్రారంభించారు. స్థానికులు రోడ్డు సమస్యను విన్నవించగా, అప్పటికప్పుడు భూమి యజమానులతో మాట్లాడి పరిష్కరించారు. డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మేయర్ పర్యటన
-
ఓటరూ మేలుకో, నిన్ను నువ్వేలుకో!
సమకాలీనం గత చరిత్ర మాత్రం నిరాశ గొలిపేదిగానే ఉంది. 2002లో మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక జరిగినపుడు 41 శాతం పోలింగ్ జరిగితే, 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 42 శాతం పోలింగ్ నమోదైంది. మీడియా విస్తృత ప్రచారం, కార్పొరేషన్-ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి తర్వాత 2009 ఎన్నికల్లో అది 52.99 శాతానికి పెరిగింది. ఇది కూడా సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్ కన్నా చాలా తక్కువ. అందుకే, ఎక్కువ శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు చర్యలు చేపట్టారు. నాలుగు వందల ఏళ్లకు పైబడ్డ చరిత్ర గల హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిందెవరు? నేతలు పదే పదే వల్లెవేస్తున్న ఆకర్ష ణీయ నగరంగా మలిచేదెవరు? అలా చేసేలా పాలనా వ్యవస్థల్ని ఐదేళ్లు నియంత్రించేదెవరు? ఇప్పుడెన్ని మాటలు చెప్పినా... వారు అలా చేయ కుండా గాలికి వదిలేస్తే అరకొర వసతుల మధ్య బతుకు సరిపెట్టుకోవాల్సిం దెవరు? రాను రాను నరకమయ్యే నగరంలో నలిగిపోవాల్సిందెవరు?ఎన్నో సవాళ్లు-ప్రతిసవాళ్ల నడుమ కూడా... ఎన్నికల తుది ఫలితంతో నిమిత్తం లేకుండా ఎప్పట్లాగే ముందుకు సాగే రాజకీయ శక్తులేవి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించేది నాలుగు రోజుల్లో జరగనున్న మహానగర ఎన్నికల తర్వాతే! అవును, అంతటి ప్రాధాన్యం కలిగిన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని ఎన్నికల ప్రచార బరిలోకి దూకిన ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రచార వేడిని గురువారం (నిన్న) పతాక స్థాయికి తీసు కొచ్చారు. బలం, బలహీనతల సంగతెలా ఉన్నా.... అధికార పీఠం కైవసం చేసుకునేందుకు బరిలో దిగిన ప్రధాన ప్రత్యర్థి రాజకీయ వర్గాలు తమ తమ బలగాలను మోహరించాయి. శక్తులన్నింటినీ సమీకరించి అదృష్టాన్ని పరీక్షిం చుకునే కడపటి అంకానికి పరుగులెడుతున్నాయి. ఇంకా, పూర్తి స్థాయి చేతన పొందనిది ఓటరే! ప్రజాస్వామ్య ఎన్నికల రణరంగంలో కీలక భూమిక పోషించే ఓటరుకెందుకింత అచేతన? ఎందుకీ స్తబ్దత? ఓటింగ్ పట్టని జడత్వమెందుకు! అదే అర్థం కాదు. ఇంతకీ ఎన్నికలు ఓటర్ల కోసం కాదేమో! ఎన్నికయ్యే నేతల కోసమేనేమో అని అనుమానం కలిగేంత అలక్ష్యం మన నగర ఓటర్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నాగరికులైనవారు, తమకు తాము మేధావి, ప్రభావవంతమైన వర్గంగా భావించేవారిలోనే ఈ నిర్లిప్తత, నిరాసక్తత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యేంత ఓటింగ్ శాతం కూడా మహానగర ఎన్నికల్లో జరగట్లేదని గత ఎన్నికలన్నీ రుజువుపరి చాయి. ఈ మహానగరంలో కూడా మధ్య-అల్పాదాయ వర్గాలు, పేదలుండే బస్తీల్లో జరిగేపాటి పోలింగ్ శాతం కూడా సంపన్నులు, నాగరిక సమాజా లుండే ప్రాంతాల్లో నమోదు కావటం లేదు. ఓటేయడం నాగరీకులకు నామో షీయేమో! పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ప్రసార మాధ్యమాలు, ఇతర పౌర సంఘాలు చేసే ప్రయత్నం కూడా ఆశించిన స్థాయిలో ఫలితమివ్వడం లేదు. ఇది చరిత్ర! ఇప్పుడైనా మార్పుం టుందా? ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచుతారా? ఆనక, పాలనాపగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీ విధానాల్ని ఒత్తిడి పెంచి శాసిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే! పొల్గొనకుండా నిలదీసే నైతిక హక్కెక్కడిది? పాలనలో భాగస్వామ్యాన్ని, నిర్ణయాధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తున్నా... ఓటు హక్కు వినియోగించుకోని వారికి, ఎన్నికైన వారిని నిలదీసే నైతిక హక్కెక్కడుంటుంది? ఇది ప్రధాన ప్రశ్న. ‘ఎన్నికై అధికారం చేపట్టాక ఎవరైనా ప్రజలకు పనిచేసి పెట్టాల్సిందే, మేం ఓటేశామా? వేయలేదా? అన్నది వారికెలా తెలుస్తుంది?’ అన్న లాజిక్కే, ఓటేయకుండా ఉండే వారి ధీమా వెనుక కారణమై ఉండొచ్చు! స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయక పోవడానికి వారికి సవాలక్ష కారణాలుండొచ్చు! కానీ, ఓటు వేయకుండా పాలనా విధానాల్ని విమర్శించే, వ్యవస్థల్ని ప్రశ్నించే హక్కు లేనట్టే లెక్క. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇటీవల సాక్షి జర్నలిజం విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ మంచి మాట చెప్పారు. అతి తక్కువ శాతం ఓటింగ్ వల్ల నాయకులు తాము ప్రసన్నం చేసుకోవాల్సిన వారి సంఖ్య చాలా పరిమితమై పోతోంది. బహుముఖ పోటీల్లో ఎంతో కొంత శాతం ఇతరేతరులకి పోను.... తనకు పార్టీ పరంగా పడేవి, కులం-వర్గం పరంగా వచ్చేవి, స్థానిక కారణాల వల్ల అనుకూలించేవి పోను ఇక తాను శ్రమించి సాధించాల్సిన ఓట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. వివిధ గణాం కాల తర్వాత.... ఆ మాత్రం ఓట్లు ఏదో మార్గంలో సాధించొచ్చులే! అనే తేలిక భావన కలుగుతోంది. అలా ఎత్తుగడలతో గెలిచాక, ఇక ప్రజల పట్ల నిర్లక్ష్యపు భావం బలపడుతోంది. అలా కాకుండా ఎక్కువ శాతం ఓటింగ్ జరిగితే, ప్రతిసారీ ఎక్కువ మందిని ప్రసన్నం చేసుకుంటే తప్ప ఎన్నికల్లో గెలిచి, గట్టెక్కలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరిగినపుడు భయం, బాధ్యత, జవాబుదారీతనం కచ్చితంగా పెరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అందుకే, ఎక్కువ శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎమ్సీ వివిధ ప్రోత్సాహక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నగరంలో 74 లక్షల ఓటర్లుండగా ఇప్పటికే 55 శాతం మందికి పోల్ చీటీలు చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. సిబ్బంది ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం, ఇంటర్నెట్, యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్, నంబరు తదితర సమాచారం ఓటర్లు పొందినట్టు లెక్క లున్నాయి. ఇందులో ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకుం టారో చూడాలి. గత చరిత్ర మాత్రం నిరాశ గొలిపేదిగానే ఉంది. 2002లో మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక జరిగినపుడు 41 శాతం పోలింగ్ జరిగితే, 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 42 శాతం పోలింగ్ నమోదైంది. మీడియా విస్తృత ప్రచారం, కార్పొరేషన్-ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి తర్వాత 2009 ఎన్నికల్లో అది 52.99 శాతానికి పెరిగింది. ఇది కూడా సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్ శాతం కన్నా చాలా తక్కువ. పౌరులు నిర్దేశించే ఎజెండాయే లేదు! ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి దశలోనూ ఇదొక ప్రహస నంలా సాగుతోంది తప్ప ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తున్న చర్య ఒక్కటీ లేదు. రిజర్వేషన్ల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళికల వెల్లడి, ప్రచారం ఇలా... అన్ని దశల్లోనూ రాజకీయ అట్టహాసమే! ఇక ప్రధాన రాజకీయ పక్షాల నేతలు విమర్శలు-ప్రతి విమర్శలతోనే ప్రచార పర్వం సాగుతోంది. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు గానీ, నిర్దిష్టమైన విధాన ప్రకటనలు గానీ, మేధావి వర్గాన్ని మెప్పించే ప్రజా ఎజెండా వెల్లడించడం గానీ లేదు. నగర పౌరులకు ఇదేదీ పట్టడం లేదు. చాలా చోట్ల ఎన్నికల ప్రచారాన్ని ఒక రాజకీయ తమాషాగా, వినోద కార్యక్రమంగా చూస్తున్న జాడలే ఎక్కువ! నాయకులు, అభ్యర్థులు కూడా గల్లీలకు వెళ్లినపుడు... బట్టలు ఇస్త్రీ చేయడం, బజ్జీలు గోలించడం, మిషన్‌పై గుడ్డలు కుట్టడం వంటి పనులు చేస్తూ, ఆ క్షణంలో ఓటర్లను మెప్పించే చిల్లర చర్యలతో వినోదం పంచుతున్నారు. బరిలో దాదాపు డెబ్బై మంది అభ్యర్థులు నేర చరితులున్నట్టు తగు పరిశీలన తర్వాత సుపరిపాలనా వేదిక వెల్లడించింది. స్థానికులు, ప్రజాదరణ ఉన్న వాళ్లు, సేవా దృక్పథం కలిగినవాళ్లు అన్న అంశాల్ని ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు. ఇక వారి విద్యార్హతల విషయానికొస్తే.... అభ్యర్థుల్లో డెబ్బై శాతం మంది ఇంటర్ లోపు విద్యార్హతలు కలిగిన వారని ఓ అధ్యయనం చెబుతోంది. పార్టీ విధానాలు, పౌర అవసరాలు, హైదరాబాద్ మహానగర మౌలిక సమస్యలపై వారికున్న శాస్త్రీయ అవగాహన ఎంత? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. పార్టీల బడా నాయకులు చెబుతున్న పెద్ద పెద్ద హామీలు, గంభీరమైన రాజకీయ ప్రకటనల్నే కింది స్థాయి నేతలు, అభ్యర్థులు వల్లెవేస్తున్నారు. ‘అరవై ఏళ్లుగా సాధించలేనిది పద్దెనిమిది నెలల్లో సాధిం చాం’ అని ఒకరంటే, ‘అసలు హైదరాబాద్‌కు దశ, దిశ నిర్దేశించి, ప్రపంచ పటంలో స్థానం కల్పించిందే మేమ’ని మరొకరు జబ్బలు చరుస్తున్నారు. పలుమార్లు ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, ‘అభివృద్ధికి మేమే పర్యా యపదం. అభివృద్ధి అంటే మేము, మేమంటేనే అభివృద్ధి’ అని మరో పక్షం ఢంకా బజాయిస్తోంది. విశ్వనగరం చేస్తామని ఒకరు భూతల స్వర్గం చూపి స్తుంటే, ఉచితంగా తాగునీళ్లు, ఇంటింటికీ పైప్‌లైన్‌లో వంట గ్యాస్, స్వేచ్ఛగా పశుమాంసం తినే యోగం.... ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతూ గారడీ విద్యను ప్రదర్శిస్తున్నారు. ఎత్తులు-పై ఎత్తులు, ఏం చేసయినా ఎక్కువ స్థానాలు సాధించాలనే తపన తప్ప ప్రజాసమస్యలు ఎవరికీ పట్టడం లేదు. నిర్ణయించేవాడు నిమిత్తమాత్రుడా? పోలింగ్‌లో పాల్గొని ఓటు ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించడం మినహా యిస్తే... నగర పౌరుడికి పాత్రే లేదన్నట్టు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఢిల్లీలో ప్రైవేటు పాఠశాలల భరతం పడతామని, అవన్నీ పద్ధతిగా, ప్రజా ప్రయోజనాలకనుగుణంగా పనిచేసేట్టు చూస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నాణ్యతకు భరోసా లేకుండా, విచ్చలవిడి ఫీజుల వసూళ్లతోపాటు ప్రైవేటు విద్యా వ్యవస్థలు అరాచకం సృష్టిస్తున్న పరిస్థితి మన నగరంలోనూ ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలు నిర్వీర్య మవడం మరో జాడ్యంగా మారింది. మచ్చుకిదొక ఉదాహరణ మాత్రమే! నగరజీవి సమస్యలెన్నో! నగరంలో రెండు ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ ఎండిపోయి, మంజీరాలో నీళ్లు లేక సరఫరా నిలిచిపోయి, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి దుర్భరమైన పరిస్థితులున్నాయి. నగరంలో ఉన్న రైతు బజార్లలో రైతులు కాకుండా దళారులే రాజ్యమేలుతున్నా పట్టించుకున్న వారు లేరు. వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, ట్రాఫిక్ నరకయాతన, పెచ్చుమీరిన వాయు కాలుష్యం, అడ్డదిడ్డంగా మురుగునీటి వ్యవస్థ.... ఇలా నగరజీవి జీవన ప్రమాణాల్ని దిగజారుస్తున్న జటిల సమస్యలెన్నో, ఎన్నెన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే శాస్త్రీయ ప్రతిపాదనలు, వాటిపై విపులమైన చర్చ, హామీల సాధ్యాసాధ్యాలపై లోతైన పరిశీలన, నిర్దిష్ట కార్యాచరణ, పౌరులకి విశ్వాసం కలిగించడం... ఇవేవీ లేకపోవడం ప్రస్తుత మహానగర ఎన్నికల్లో ఒక పెద్ద లోపంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌర చైతన్యం పెరగాలంటున్నారు, పాలనా వ్యవస్థలపై నిరంతర నిఘా, తమకు కావాల్సింది సాధించుకునేలా పౌరులు ఒత్తిళ్లు పెంచడమే సముచిత మార్గ మంటున్నారు. అధికారం దక్కించుకొని, ప్రజాధనం పై అజమాయిషీ చేసే పాలకులు ఓటర్లకు ఇచ్చే హామీలన్నింటినీ కార్యాచరణ కిందకు మళ్లించే శక్తి, బాధ్యత ఓటర్లయిన పౌరులదే! వారు అలసత్వం ప్రదర్శిస్తే, ఫలితం శూన్యం. వచ్చే ఐదేళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పౌరులు కర్తవ్యం మరచి ‘ఒక రోజు జాతర’ అనుకుంటే ఎన్నికల ప్రక్రియ అంతా ప్రహసనమే! పౌరులూ తస్మాత్ జాగ్రత్త! అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టు..... ‘‘అట్టపర్వతం/ఎత్తి పట్టుకున్న వాడు/ ఆంజనేయుడూ కాదు/ నెత్తిలో/ నెమలీక పెట్టుకున్నోడు/క్రిష్ణ పరమాత్ముడూ కాదు/ అదంతా/ ఎన్నికల ‘అట్ట’హాసం!’’ దిలీప్ రెడ్డి, ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మేయర్ దంపతుల హత్యకేసులో 23 మంది అరెస్ట్
చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాథ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసులో 23 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. సోమవారం ఆయన ఈ కేసు వివరాలను తెలుపుతూ.. త్వరలోనే అరెస్టైన వారిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చింటు అలియాస్ చంద్రశేఖర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ హత్యలకు కుటుంబ, ఆర్థిక తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు
-
చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆదివారం చింటు అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తంబళ్లపల్లి వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కొండ్రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. అయితే ఇంట్లో ఎవరులేని సమయంలో తాళాలు పగులగొట్టి మరీ పోలీసులు సోదాలు నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యకు నిరసనగా సర్పంచ్ కొండ్రెడ్డి.. పలు ప్రజాసంఘాలతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
హైద్రాబాద్ మేయర్ రాజీనామాలో హైడ్రామా