రూ.20లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి
Published Mon, Aug 29 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్ఖానగడ్డ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.20లక్షలు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. సోమవారం 4వ డివిజన్‌లోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులో రూ.2.5 లక్షలతో నిర్మించనున్న డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి శ్మశానవాటికలకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. డీపీఆర్ రూపొందిన తర్వాత స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో ప్రవేశిస్తామని, పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత, నాయకులు పెండ్యాల మహేశ్, కామారపు శ్యాం, కట్కూరి మల్లేశం, ఆనంద్, అరుణ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
5వ డివిజన్‌లో సీసీరోడ్డు పనులు
5వ డివిజన్ కిసాన్‌నగర్ ముస్లింవాడలో రూ.8 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మేయర్ ప్రారంభించారు. స్థానికులు రోడ్డు సమస్యను విన్నవించగా, అప్పటికప్పుడు భూమి యజమానులతో మాట్లాడి పరిష్కరించారు. డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement