లలిత్ మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రహస్యంగా.. చాటుమాటుగా ఎందుకు సాయం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రశ్నించారు. లలిత్ మోదీ వివాదంపై గురువారం సభలో చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ ఆవేశంగా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. లోక్సభలో కూర్చున్నప్పుడు సుష్మా స్వరాజ్ తనవద్దకు వచ్చి 'బాబూ.. నీకు నామీద ఎందుకు కోపం అని అడిగారు. నాకు కోపం లేదు.. మీరంటే నాకు గౌరవం అని చెప్పాను' అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు