మున్సిపల్ మార్కెట్ వేలంలో పాల్గొనేం దుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం దిన, వారం కూరగాయల మార్కెట్ వేలం పాటలను నిర్వహిం చారు.