పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు శుభపరిణామమని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మాట్లాడుతూ...ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హైకోర్టు తీర్పును స్పీకర్ తక్షణమే అమలు చేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధపడాలని రేవంత్రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించిన విషయం