ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు పరచకుంటే వంచకులవుతారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీతో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని, హామీ అమలుపై తోకముడిస్తే చరిత్ర క్షమించదన్నారు. ప్రజలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.