అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శిస్తారు. ఉదయం హైదరా బాద్‌లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కొత్తమాజేరు గ్రామం వెళతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం తెలిపారు.