Toxic fevers
-
మళ్లీ ‘డెంగీ’ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో డెంగీ ప్రతాపం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి. మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్‌లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్‌గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్‌గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒకేసారి రకరకాల జ్వరాలు ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్‌గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్‌గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. -
జ్వరం.. వణుకుతున్న జనం!
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొత్మీర్ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి, సిరప్ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది. – బోయి అజయ్, (అక్షర తండ్రి) ఆందోళన వద్దు.. మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే
ఫిరోజాబాద్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో డెంగీతోపాటు విష జ్వరాలు చిన్నారుల ప్రాణాలను కబళిస్తున్నాయి. జ్వరాల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 50కి చేరిందని, మృతుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. జ్వరాల కాటుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజధాని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, జ్వర పీడితులకు వైద్య సాయం అందించాలని, మరణాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఐసోలేషన్ పడకలు కేటాయించాలన్నారు. కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను జ్వర పీడితుల వైద్యం కోసం వాడుకోవాలని చెప్పారు. ఫిరోజాబాద్‌లో జ్వరాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు చెందిన నిపుణులను ఫిరోజాబాద్‌కు పంపించింది. మథుర, ఆగ్రా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయని యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ కుమార్ ప్రేమీ చెప్పారు. ఫిరోజాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3,719 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే.. ప్రమాదకరమైన హెమరాజిక్ డెంగీ కాటు వల్లే చిన్నారులు ఎక్కువగా బలవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం తెలియజేసిందని ఫిరోజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రవిజయ్ సింగ్ అన్నారు. ఈ రకం డెంగీ వల్ల బాలల్లో ప్లేట్లెట్ల సంఖ్య హఠాత్తుగా పడిపోతుందని, రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముగ్గురు వైద్యులను ఆయన సస్పెండ్ చేశారు. -
విషజ్వరాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విస్సన్నపేట: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రబలిన విష జ్వరాలపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. మండలంలోని కొండ పర్వం గ్రామంలో కలుషిత నీరు కారణంగా ప్రబలిన విషజ్వరాలపై మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపర్వం గ్రామంలో పర్యటించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు (చదవండి: ఏలూరులో సాధారణ పరిస్థితి) అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు భయపడొద్దని, విష జర్వాల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ పనులు చేపట్టాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. కొండపర్వంలో ప్రత్యేకంగా వైద్య బృందాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. (చదవండి: వీరవాసరం ఏఎస్ఐపై హత్యాయత్నం) -
మలేరియాకు ముకుతాడు!
సాక్షి, అమరావతి: మలేరియా తగ్గుముఖం పట్టింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 2020లోనే అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ వైపు భారీగా వర్షాలు పడుతున్నా కేసుల నమోదు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది దోమ కాటు జ్వరాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది. ఓ వైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే మరోవైపు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో దోమకాటు వ్యాధులపై పర్యవేక్షణ చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 2016 తర్వాత తగ్గుముఖం ► 2016తో పోల్చుకుంటే 2019 నాటికి 87.60 శాతం మలేరియా కేసులు తగ్గాయి. రాష్ట్రంలో 11 సెంటినల్ సర్వెలెన్స్ ఆస్పత్రుల్లో కేసుల నిర్ధారణ, చికిత్స జరిగింది. ఈ ఏడాది మృతుల సంఖ్య ఒక్కటి కూడా లేదు. ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 13.33 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. 446 హైరిస్క్ గ్రామాల్లో మలేరియా స్క్రీనింగ్ కార్యక్రమం పూర్తి అయింది. ఇప్పటిదాకా 1.48 కోట్ల మందికి మలేరియాపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ► చికున్‌గున్యా, డెంగీ కేసుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దోమకాటు జ్వరాలు రాకుండా క్షేత్ర స్థాయిలో సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షించారు. డెంగీ, గున్యా జ్వరాలు సోకిన బాధితులకు తక్షణమే వైద్యమందేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్ మాసాంతం వరకు మలాథియాన్, పైరిథ్రిమ్ మందులు పిచికారి చేయాలని నిర్ణయించారు. -
పంజా విసిరిన డెంగీ
రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది. విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు కాగిపోతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని జిల్లాలు మంచానపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు.. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనధికారికంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. వేలాది మంది రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పలు ఆస్పత్రుల్లో పడకలు సరిపోక నేలపైనే రోగులను పడుకోపెట్టి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: విషజ్వరాలతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా బారినపడి 23 మందికిపైగా మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీటిని సహజ మరణాలుగానే రికార్డుల్లో నమోదు చేస్తూ.. తీవ్రతను కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 217 మంది మలేరియాతోనూ, 55 మంది డెంగీతోనూ బాధపడుతున్నారని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో అయితే విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, ఇతర విషజ్వరాలతో ఇప్పటివరకు 70 మందికిపైగా ప్రాణాలొదిలారు. ఒక్క డెంగీతోనే 30 మంది ప్రాణాలు విడిస్తే.. వైద్యాధికారులు మాత్రం ఇద్దరే చనిపోయారని చెబుతున్నారు. విజయనగరం అర్బన్, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గుర్లలో డెంగీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా కేసులు, 1,100 టైఫాయిడ్ కేసులు, 21,800 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 1,660 డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ మరణాల సంఖ్య వందకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రోజుకు ఇద్దరు, ముగ్గురు డెంగీతో మృతి చెందుతున్నట్లు సమాచారం. డెంగీ బాధితుల కోసం కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ప్రత్యేకంగా పది పడకలు ఏర్పాటు చేశారు. కానీ రోజుకు 20 మందికి పైగా రోగులు వస్తుండడంతో.. వారిని ఇతర వార్డుల్లో ఉంచి వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 22 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. గజగజలాడుతున్న గోదావరి జిల్లాలు.. డెంగీ ధాటికి గోదావరి జిల్లాలు కూడా గజగజలాడుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశముంది. కానీ డెంగీ మరణాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. శనివారం జగ్గంపేట మండల మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూక రత్నం(53) డెంగీతో కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందగా.. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. కాకినాడ రూరల్‌లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదవ్వగా.. కాకినాడ నగరంలో 65 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు డెంగీతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో గత 3 నెలల్లో అధికారికంగానే 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, రాఘవాపురం, పెనుగొండ, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, లంకలకోడేరు, పెనుమంట్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి బాధితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతమున్న వార్డు సరిపోక.. మరో వార్డును అదనంగా కేటాయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 169 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాజధానిలోనూ దయనీయమే.. కృష్ణా జిల్లాలోని నందిగామ, ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు జ్వరపీడితులున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సాధారణంగా రోజుకు దాదాపు 200 మంది రోగులు వస్తుండేవారు. కానీ విషజ్వరాల దెబ్బకు రోజుకు 350 మందికి పైగా రోగులు వస్తుండటంతో పడకలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేలపైనే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 డెంగీ, 100 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నందిగామ పట్టణానికి చెందిన మారం జయశ్రీ(18) అనే విద్యార్థిని, వెల్లంకికి ముండ్లపాటి నారాయణ(56) డెంగీతో మృతిచెందారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం గ్రామస్తులు 15 రోజులుగా విషజ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 87 డెంగీ, 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, నూతక్కి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లితో పాటు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారికంగా 17 డెంగీ, 44 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 132 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 56 డెంగీ, వందకుపైగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 24 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. డెంగీ నిర్ధారణపై ఆంక్షలు! డెంగీ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విశాఖ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరికరాలున్నప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల కేజీహెచ్‌లోని ల్యాబ్‌కు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ల్యాబ్ రోగులతో కిటకిటలాడుతోంది. తీరా వ్యాధి నిర్ధారణయ్యేసరికి చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేజీహెచ్‌లో 4,574 మందికి పరీక్షలు నిర్వహించగా 1,660 మందికి డెంగీగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి ముగ్గురు అనుమానితుల్లో ఒకరికి డెంగీ నిర్ధారణ అవుతోంది. పెళ్లయిన 13 రోజులకే ప్రాణం తీసిన విష జ్వరం మాయదారి విష జ్వరం ఓ నవ వరుడిని మింగేసింది. విజయనగరంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు(24) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 24న అతనికి పూల్‌బాగ్ కాలనీకి చెందిన మౌనికతో వివాహమైంది. జ్వరం రావడంతో ఈశ్వరరావును ఈ నెల 4న నెల్లిమర్ల మిమ్స్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు బుధవారం అతన్ని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లేసరికే ఈశ్వరావు మృతి చెందాడు. పెళ్లయిన 13 రోజులకే వరుడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం: సీఎం సాక్షి, అమరావతి: పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డెంగీ విజృంభణ నేపథ్యంలో బుధవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ.. విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దోమల బెడదను నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీమలోనూ విషజ్వరాల విజృంభణ.. రాయలసీమలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 66 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ నెల 1న నార్పల గ్రామానికి చెందిన అనుష్క(8) మృతి చెందింది. ఇప్పటివరకు 164 మలేరియా, 66 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం, ఎద్దులపల్లి, కురుకుంట ప్రాంతాల్లోని 30 గ్రామాల్లో డెంగీ తీవ్రత అధికంగా ఉంది. వైఎస్సార్ జిల్లాలోనూ 45 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఏడింటిని నిర్ధారించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఐదుగురికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం, నందికుంటకు చెందిన లీలావతి, లక్ష్మీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా, కర్నూలు గణేష్‌నగర్‌కు చెందిన లక్ష్మయ్య(21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి, పనుల నిమిత్తం కర్నూలుకు వచ్చిన కమలాకర్, ప్రకాష్(ఒడిశా) డెంగీతో బాధపడుతున్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగీ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే రోగుల సంఖ్య మరింత పెరిగి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు అంతా విషజ్వరాల బారినపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రం.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 6,210 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా బారిన పడి నలుగురు మృతి చెందారు. మరో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల విషజ్వరాల తో 11 మంది, డెంగీతో మరో ఇద్దరు మృతి చెందా రు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి పరీక్షలు చేసుకున్న వారిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 28 డెంగీ కేసు లు, 27 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోనూ డెంగీ లక్షణాలతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక రోగులను వెనక్కి పంపేస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోతే.. డెంగీ మరణాలతో జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జిల్లాల్లో వందలాది మంది రోగులు డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా మృత్యువాత పడ్డారు. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేరిట వేల రూపాయలు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ కేంద్రాల్లో వైద్యుల కొరతతో రోగులు తప్పనిసరై ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనికి వర్షం తోడు కావటంతో రోగాలు ప్రబలుతున్నాయి. అధికారికంగా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గత గణాంకాల్లోకి వెళ్తే.. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దేశ వ్యాప్తంగా 78,691 డెంగీ కేసులు నమోదు కాగా.. 122 మంది చనిపోయినట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. 2016లో 1,29,166 కేసులు నమోదైతే 245 మంది చనిపోయారు. మలేరియా కేసులు గత నెల వరకు 4,10,141 నమోదు కాగా, సాధారణ మలేరియా కేసులు 5,92,905 రికార్డయ్యాయి. 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో 99,913 డెంగీ కేసులు నమోదుకాగా.. 220 మంది మృతి చెందారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 192 మంది చనిపోయారు. 2011 కంటే 2012లో ఏకంగా 50,222 మందికి డెంగీ సోకగా 242 మంది మృత్యువాతపడ్డారు. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదుకాగా.. 110 మంది మృతి చెందారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు ఎక్కువగా సోకే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. -
పాతర్లపల్లికి జ్వరమొచ్చింది..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో నలుగురి దుర్మరణం గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆరా.. విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
డెంగీ డేంజర్ బెల్
చిత్తూరు అర్బన్/ సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. వేలాది మంది మంచం పట్టారు. ఈ ఏడాది మలేరియా కంటే డెంగీనే ఎక్కువగా భయపెడుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధరణ కిట్స్ లేకపో వడంతో జనం పెద్దాసుపత్రులకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 మంది వరకు డెంగీ బాధితులు ఉండవచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 35 మంది డెంగీతో మృతి చెందగా, ప్రభుత్వం మాత్రం సరైన లెక్కలు చెప్పడం లేదు. మంగళ, బుధవారాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆరుగురు డెంగీతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వరదయ్యపాలెం, సత్యవేడు, పాలసముద్రం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన అశోక్ (19), డానియల్ (9), జ్యోషిత (3), రమణమ్మ (75), అంకమ్మ (40), సువర్ణ (14)లు మృత్యువాత పడ్డారు. ఈ జిల్లాలో ఏకంగా 26 వేల మందికి పైగా ప్రజలు విష జ్వరాల బారిన పడినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వరదయ్యపాలెం మండలంలోని కారిపాకం, బత్తలవల్లం, తొండూరు సొసైటీ కాలనీ, తొండూరు, రాదకండ్రి, రాచర్ల గ్రామాల్లో ప్రస్తుతం 400 మందికి పైగా ప్రజలు విష జ్వరాలతో మంచానపడ్డారు. మండల పరిధిలోని చిన్నపాండూరు, వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజుకు సగటున 150 మంది జ్వర పీడితులు వస్తున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 700 మంది జ్వరాలతో వస్తుంటే, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ సంఖ్య 1200కు చేరింది. తిరుపతి డివిజన్లో 7200 మందికి విష జ్వరాలు సోకితే 110 మంది, చిత్తూరులో 6800 మందికి విష జ్వరాలు వస్తే 38 మంది, మదనపల్లెలో 12,185 విష జ్వరాల కేసుల్లో 73 మంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారం వ్యవధిలోనే జిల్లాలోని ములకలచెరువు, మదనపల్లె, పెద్దపంజాణి, చౌడేపల్లె, ముడిబాపనపల్లె, నిమ్మనపల్లె, ఎర్రావారిపాలెం, నెరబైలు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, సత్యవేడు, తిరుపతి ప్రాంతాల్లో 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. నిండ్ర, గారంపల్లె, మాదిరెడ్డిపల్లె, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, పూతలపట్టు, తొట్టంబేడు ప్రాంతాల్లో 9 మలేరియా కేసులు నమోదయ్యాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానం విష జ్వరాలు కోరలు చాస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇంకా నిద్రమత్తు వీడలేదు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇంటికొకరు చొప్పున విష జ్వరాల బారిన పడటంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు అడపాదడపా వర్షం కురుస్తుండటంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారయ్యింది. ఇదే అదనుగా డెంగీ కోరలు చాచడంతో జనం పిట్లల్లా రాలిపోతున్నారు. డెంగీ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొరియా నుంచి వేలాది దోమ తెరలు తెప్పించి పంపిణీ చేస్తామని చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధరణ పరీక్షలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు పరుగులుదీస్తున్నారు. మరోవైపు బోధనాసుపత్రుల్లో సైతం రోగులకు తగినన్ని మందులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాడేరు, శీతంపేట, రంపచోడవరం, శ్రీశైలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు మలేరియాతో మంచం పట్టారు. సుమారు 1500 మందికి పైగా జ్వరాలబారిన పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆయా తండాలకు రవాణా సదుపాయం లేనందున సత్వర రీతిలో గిరిజనులకు వైద్యం అందడం లేదు. ఫోన్లు చేసినా సకాలంలో 108 అంబులెన్స్‌లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రన్న సంచార వైద్యం (104 వాహనాలు) ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితితో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినా పడకలు ఖాళీ ఉండటం లేదు. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. మంచం పట్టిన ‘ప్రకాశం’ సాక్షి ప్రతినిధి, ఒంగోలు:‘ఒక్కో గ్రామంలో 250 మందికి జ్వరాలున్నాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా ఉంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. డాక్టర్లు సరిపడా లేరు.. సరైన మందుల్లేవ్.. రిమ్స్‌తో సహా ఎక్కడా ప్లేట్లెట్ మిషన్ లేదు’ అని ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో వైద్యాధికారుల సమీక్షలో సాక్షాత్తు మంత్రి శిద్దా రాఘవరావు అన్నారంటే జిల్లాలో జ్వరాల తీవ్రత ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వ వైద్యం అందడం లేదనేందుకు మంత్రి మాటలే అద్దం పడుతున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు జ్వరాల బారినపడి అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 95,524 మంది జ్వర పీడితులున్నారు. ఇందులో మలేరియాతో 106 మంది, డెంగీ లక్షణాలతో 268 మంది, డయేరియాతో 20,819 మంది, టైఫాయిడ్‌తో 11,015 మంది ఉన్నారు. జిల్లాలో జ్వరాల వల్ల మరణాల్లేవని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా, పది రోజుల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా వైద్యం అందకపోవడంతో ప్రజలు ఆర్థిక భారమైనా కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 ఏరియా ఆస్పత్రులు, ఒక మాతాశిశు వైద్యశాల, 8 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి ఉంది. 193 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా దాదాపు 30 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 173 మంది సాఫ్ట్ నర్సులకుగాను 30 వరకు ఖాళీలున్నాయి. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని విభాగాల్లోనూ సిబ్బంది కొరత ఉంది. మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. -
రాష్ట్రంలో డెంగీ మృతులు ఇద్దరే
- అదుపులోనే ఉంది.. ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి - అన్ని రకాల వ్యాధులు ఎదుర్కొనేందుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: డెంగీ ప్రాణాంతకం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, గోవిందాపురం, రావినూతలలో విష జ్వరాల విజృంభణ విచారకరమన్నారు. మరణాలపై ఆడిట్ చేరుుంచామని, ఆ నివేదిక ప్రకారం ఇద్దరు మాత్రమే డెంగీ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతి చెందారని వెల్లడించారు. కొందరు గుండెపోటు, కిడ్నీ ఫెరుుల్యూర్, వివిధ వ్యాధి లక్షణాలతో మృతి చెందారని, మరికొందరు డెంగీతో చనిపోరుునట్టు అను మానాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ డెంగీ కనిపిస్తున్నా అదుపులోనే ఉందని చెప్పారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, అనుభవం లేని డాక్టర్లు డెంగీ బూచీతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డెంగీతో అనేక మంది చనిపోతు న్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డెంగీ సహా అన్ని రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ వర్షాకాల సీజన్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. జ్వర లక్షణాలున్న ప్రతి ఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేరుుంచామని పేర్కొన్నారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లారు
• బోనకల్ మండలంలో మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల పర్యటన • కేవలం ఇద్దరే డెంగీతో మృతి చెందారంటూ ప్రకటన • వైద్య శిబిరాల్లోనే జ్వర పీడితులకు పరామర్శ గంటలోనే ముగిసిన పర్యటన.. • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ‘రావినూతల’ మృతుల కుటుంబాలు సాక్షి, ఖమ్మం/బోనకల్: మూడు నెలలుగా బోనకల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలు విషజ్వరాలతో మూలుగుతున్నారుు. ఇప్పటికే 350కి పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యారుు. ఇవి దేశంలోనే రికార్డు స్థారుు అని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులే ప్రకటించారు. మొత్తంగా 23 మంది జ్వరాల కారణంగా మృతి చెందారు. అరుుతే ఈ మండలంలో డెంగీతో మృతి చెందింది ఇద్దరేనని, అదీ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన వారేనని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. మంగళవారం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గోవిందాపురం, రావినూతల, బోనకల్లో పర్యటించారు. రావినూతలలో తొమ్మిదిమంది మృతి చెందినా.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందులో ఒక్కటి కూడా డెంగీ మరణం లేదా..? అని గ్రామస్తులు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన గంటలోపే ముగియడం, ఇలా వచ్చి.. అలా వెళ్లారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారుు. మధ్యాహ్నం 3.30 గంటలనుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మండలంలో మంత్రుల పర్యటన సాగింది. గోవిందాపురం (ఎల్) గ్రామపంచాయతీ కార్యాలయం, సాక్షరభారత్ కేంద్రాల్లో కొనసాగుతున్న వైద్యశిబిరాలను వారు పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి జ్వరపీడితులను అడిగి తెలుసుకున్నారు. గోవిందాపురంలో ఏసుపోగు తిరుపతమ్మకు డెంగీ జ్వరం రావడంతో ఆమెను మంత్రులు పరామర్శించారు. ఏమీ అధైర్యపడాల్సిన పనిలేదని, మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ, సాక్షరభారత్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలు సక్రమంగా లేవని, వసతులలేమి ఉందని, తక్షణమే విశాలంగా ఉన్న భవనంలోకి వైద్యశిబిరాన్ని మార్చాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావును ఆదేశించారు. అనంతరం గ్రామంలో డెంగీతో మృతిచెందిన ఏసుపోగు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను మంత్రులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. ఏసుపోగు వెంకటేశ్వర్లు భార్య కుమారిని, కుమార్తె ప్రియాంకతో మాట్లాడారు. ఎక్కడ వైద్యం చేరుుంచారు. ఎంత ఖర్చు అరుుందని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేరుుంచుకుంటే మంచిగా ఉండేదికదా అన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో భారమంతా నాపై పడిందని ఏసుపోగు వెంకటేశ్వర్లు భార్య కుమారి మంత్రుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. పాప చదువు బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. రావినూతలలో వైద్య శిబిరాల్లోనే పరామర్శ.. రావినూతల గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. సరైన వసతులు కల్పించాలని గ్రామప్రజలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాలు తగ్గేవరకు గ్రామంలో వైద్యశిబిరాలు కొనసాగిస్తామని జిల్లా, రాష్ట్ర వైద్యబృందం గ్రామంలో వైద్యసేవలు అందిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యాలయం సరిపడకపోతే అవసరమైతే పాఠశాలలకు నాలుగురోజులు సెలవులిచ్చి అరుునా పాఠశాల భవనాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, ప్రభుత్వపరంగా కావాల్సిన అన్ని సదుపాయాలు అందజేస్తామన్నారు. గ్రామాల్లో డెంగీ, ప్లేట్లెట్స్ పరీక్షలకోసం అధునాతన పరికరాలు పంపించి పేద ప్రజలందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మండలంలో రెండు మూడు గ్రామాల్లోని పరిస్థితి ఎందుకు తీవ్రంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. గ్రామ సర్పంచ్ షేక్ వజీర్, తమ గ్రామంలో డెంగీ జ్వరాలతో ప్రతిరోజూ ప్రజలు మరణిస్తున్నారని, పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి నిధులు లేవని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన వారు గ్రామపంచాయతీలకు పారిశుద్ధ్య పనులకోసం ఎన్ని డబ్బులనైనా కేటారుుంచాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామాల్లో వైద్యశిబిరాల ఏర్పాటుకు కలెక్టర్, మంత్రిని అడగాల్సిన అవసరం లేదని, వైద్యసిబ్బందే బాధ్యత తీసుకొని మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అరుుతే రావినూతలలో మంత్రుల పర్యటనకు ఐదు గంటల ముందే కొంకణాల రాములు (45) డెంగీతో మృతిచెందాడు. ఈ కుటుంబాన్ని అరుునా మంత్రులు పరామర్శిస్తారని గ్రామస్తులు భావించారు. కానీ గ్రామంలో తొమ్మిదిమంది మృతిచెందినా ఒక్క కుటుంబాన్ని పరామర్శించకపోవడం గమనార్హం. అనంతరం బోనకల్ పీహెచ్సీ చేరుకొని అక్కడ జ్వరంతో చికిత్స పొందుతున్న వారిని వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతా పోలీస్ పహారాలోనే... బాధిత కుటుంబాలు, జ్వరపీడితులు మంత్రులకు తమ గోడును విన్నవించుకునేందుకు కూడా వీలులేకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య పర్యటన సాగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరపీడితులకంటే పోలీస్ సిబ్బందే ఎక్కువగా ఉండటంతో కనీసం ప్రజలు మంత్రులతో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోరుుంది. రోప్ మధ్యలో ఉంటూ మంత్రులు వైద్య శిబిరంలో జ్వరపీడితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలు అందిస్తుంది అనేవిధంగానే మంత్రుల పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ లలిత కుమారి, అదనపు డెరైక్టర్లు శంకర్, ప్రభావతి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, స్టేట్ కన్సల్టెంట్ సంజీవరెడ్డి, డీఎంహెచ్‌వో కొండలరావు, డీఎంవో రాంబాబు, డీపీవో కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లో పారిశుధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబ లుతున్నాయని రాష్ట్ర వైద్య శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. ‘బోన‘కిల్’.. డెంగీ పంజాకు జనం విలవిల అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన రాష్ట్ర వైద్య బృందం బోనకల్ పీహెచ్‌సీని బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అడిషనల్ డెరైక్టర్ శంకర్, రాష్ట్ర మలేరియా విభాగం అడిషనల్ డెరైక్టర్ ప్రభావతి మాట్లాడారు. ఈ ప్రాంతంలో రెండున్నర నెలలుగా ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, డెంగీతో 20 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్న వారు ఎవరూ మృతి చెందలేదన్నారు. బోనకల్లో 20కి చేరిన మృతులు బోనకల్ మండలంలో బుధవారం మరో ఇద్దరు డెంగీతో మృతి చెందారు. రావినూతలవాసి పూలబోరుున (32)ని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా 4 రోజుల అనంతరండెంగీ జ్వరం విషమించి మృతి చెందింది. గార్లపాడు గ్రామానికి చెందిన కట్టా సరస్వతి (30)ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
డెంగీతో పది నెలల చిన్నారి మృతి
• 16కు పెరిగిన డెంగీ మృతుల సంఖ్య • వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు తిరుత్తణి: డెంగీ జ్వరానికి తిరుపతికి చెందిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తిరువళ్లూరు జిల్లాలో మాత్రం డెంగీ మృతుల సంఖ్య 16కు చేరింది. తిరువళ్లూరు జిల్లాలో రెండు నెలలకు పైబడిన విష జ్వరాలు వ్యాప్తి చెందిన వందలాది మంది ఆసుత్రుల్లో చేరి చికిత్స పొందారు. వీరిలో చిన్నారులకు జ్వరం అధిగమించి తిరువాలాంగాడు యూనియన్ కావేరిరాజపురం ఆది ఆంధ్రవాడకు చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో డెంగీ బెంగ పట్టుకుంది. అదే సమయంలో తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట సహా అనేక గ్రామాల్లో ప్రజలకు విష జ్వరాలు సోకడంతో తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై ప్రభుత్వాసుపత్రుల్లో విష జ్వరాల బాధితుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం విష జ్వరాలు వేగంగా వ్యాప్తి చెంది చిన్నారులు వరుస క్రమంలో ప్రాణాలు కోల్పోవడంతో మృతులకు వైరస్ జ్వరాలు మాత్రమేనని, డెంగీ కాదని ప్రభుత్వం ప్రకటించుకుంది. గ్రామాల్లో పరిశుభ్రత పనులు వేగవంతం చేశారు. అదే సమయంలో వైద్య బృందాలను, సంచార వాహనాల బృందాలను రంగంలోకి దింపి ఆరోగ్య వైద్య సేవలు విస్తృతం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేస్తుండిన నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. మళ్లీ విజృంభించిన విష జ్వరాలు పరిశుభ్రత, ఆరోగ్య సేవలను ఆలస్యం చేపట్టిన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించడంలో మాత్రం విఫలం కావడంతో కొద్ది రోజుల్లోనే తిరుత్తణి పట్టణంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలో తిరుపతి అలమేలుమంగాపురం అంబేద్కర్ కాలనీకి చెందిన తిరుమూర్తి పది నెలల కుమారుడు జోసెఫ్ విష జ్వరంతో తిరుపతిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. జ్వరం తగ్గక పోవడంతో తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేక పోవడంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం జ్వరం పెరిగి మృతి చెందాడు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 16కు పెరిగింది. వైద్యులు పూర్తి స్థాయిలో వైద్య సేవలు చేపట్టక పోవడంతోపాటు సకాలంలో వైద్యం చేయడంలో అలసత్వంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు బాధితులు వాపోయారు. -
విజృంభిస్తున్న డెంగీ
జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు ఎంజీఎంలో ఒకే రోజు 17 కేసులు నమోదు బాధితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి వార్డులు ఎంజీఎం : జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో విషజ్వరాలతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది వర్షకాలంలో జ్వరపీడితుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న చినుకులతో ఏజెన్సీతో పాటు నగరంలోని ప్రజలు జ్వరాలతో గజగజ వణుకుతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల నుంచి విషజ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా గురువారం ఒక్క రోజే 17 మంది డెంగీతో బాధపడుతున్నట్లు తేలింది. ఏజెన్సీలో విస్తరిస్తున్న మలేరియా... ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట గూడూరు, కొత్తగూడ మండలాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు 414 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత సీజన్లో 81 వేల మంది జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతుండగా 41 వేల మంది డయేరియాతో అస్వస్థతకు గురై చికిత్స పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 300 మంది చిన్నారులకు చికిత్స ఎంజీఎం పిల్లల విభాగంలోని 130 పడకల్లో 300 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నా రు. పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్కో దానిపై ఇద్దరు చిన్నారులను ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. అదనపు వార్డులను ఏర్పాటు చేయాల్సిన అధికారులు, పరిపాలన అధికారులకు అదనపు బాధ్యతలు తోడవ్వడంతో ఆస్పత్రిలో పాలన కుంటుపడుతుంది. ఇప్పటివరకు 32 కేసులు నమోదు ప్రస్తుత నెలలో ఇప్పటివరకు 32 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు చెప్పారు. వీరంతా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు.జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 105 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నగర పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఇందులో ఉన్నారని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి వ్యాధులు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లక తప్పడంలేదు. ఎంజీఎంలోని వార్డులు సైతం రోగులతో నిండిపోయి కిటకిటలాడుతుండడంతో పాటు ఒకే మంచానికి ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచుతూ చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పేద రోగులకు మెరుగైనా వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మందుల మాయ !
జిల్లాలో సీజనల్ మెడిసిన్ కరువు కమీషన్ల కోసం కాలయాపన ఇబ్బందులు పడుతున్న రోగులు సాక్షి, హన్మకొండ : జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో రెండిళ్లలో ఒకరు వంతున మంచం పట్టారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ మందులు అందుబాటులో ఉండడం లేదు. ఈ మందుల కొనుగోలుకు సంబంధించి కమీషన్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్లే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. జ్వరం గోలీలూ కరువే.. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి క్రమం తప్పకుండా అన్ని రకాల ఔషధాలు సరఫరా కావాలి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత సాధారణంగా జ్వరాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రకాల మందులను కొనుగోలు చేసి ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. జిల్లాలో రెండు నెలలుగా జ్వరాల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా జ్వరం, నొప్పులు, వాంతులు, విరేచనాలకు ఉపయోగించే ఫ్యురాజోలిడిన్, మెట్రోజిల్, డైక్లోఫెనాక్, పారాసిటమాల్ మాత్రలు కరువయ్యాయి. చివరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అరకొరగానే ఉంటున్నాయని సమాచారం. కమీషన్ల కక్కుర్తే కారణం.. ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరతకు కమిషన్ల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఫార్మసిస్టు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో అవసరమైన మందులు తెప్పించకుండా కేవలం కమీషన్ అధికంగా వచ్చే మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆ శాఖ వారే చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో సదరు ఉద్యోగి లీలలు శృతి మించుతున్నాయి. ఆఖరికి నెల రెండు నెలల్లో కాలం చెల్లిపోయే ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి మందులనే పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. అధికారులకు చెప్పలేక.. ఆన్ సీజన్ ఔషధాలను రోగులకు పంపిణీ చేయలేక క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలపరిమితి ముగిసిన ఔషధాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆçస్పత్రుల ప్రాంగణం సమీపంలో గుంత తీసి పాతిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారం కొంతకాలంగా నిరాటంకంగా సాగుతోంది. ఇదీ పరిస్థితి... పది నెలలుగా డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్లు డిమాండ్‌కు సరిపడా లేవు. రెండు నెలలుగా ప్యురాజోలిడిన్, మెట్రోజిల్ మందుల సరఫరా లేదు. ఇరవై రోజుల క్రితం నల్లబెల్లి మండలంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో ఇటీవల మందులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. మలేరియా రోగులకు అందించే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం ఆస్పత్రులలో అందుబాటులో లేవు. నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్ ఔషధాలతో పాటు థైరాయిడ్ మాత్రలు సైతం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రోజిల్ స్టాక్ లేదు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మూడు రోజులుగా మెట్రోజిల్, డైక్లోఫెనాక్ మందుల నిల్వ లేదు. ఆరు నెలలుగా ఫ్యురాజొలిడిన్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్ స్టాకు ఉన్నాయి, కానీ అవి తీసుకెళ్లడంలో పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. – వెంకటస్వామి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఫార్మసిస్టు -
వ్యాధుల ముసురు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంతోసహా జిల్లా అంతా మంచం పట్టింది. వర్షాలు కురుస్తుండటం, ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం, పారిశుధ్యలోపం, దోమల వ్యాప్తి కారణంగా వైరల్(విష) జ్వరాలు, ఇతర వ్యాధులు ఉధతమవుతున్నాయి. రోజురోజుకూ జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య అధికమవుతోంది. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరం స్వైర విహారం చేస్తోంది. ఆస్పత్రులకు వివిధ జబ్బులు, వ్యాధులతో వచ్చే వారిలో 30 శాతం రోగులు జ్వరపీడితులే ఉంటున్నారు. వీటిలో వైరల్ జ్వరాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఫీవర్ సోకిన వ్యక్తులు బాగా నీరసపడిపోయి, నిస్సత్తువకు లోనవుతున్నారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. ఆస్పత్రులకు వెళ్లినా కనీసం మూడు రోజుల వరకూ ఉపశమనం లభించడం లేదు. వైరల్ ఫీవర్లతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలూ జనాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే మన్యంలో మలేరియా, మైదానంలో డెంగ్యూ జ్వరాలతో పలువురు మత్యువాత పడుతున్నారు. నగరంలోనూ, పట్టణాల్లోనూ ఉంటున్న జ్వరపీడితులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఏజెన్సీ, జిల్లాలోని మారుమూల పల్లెల్లోనూ జ్వరాల బారిన పడ్డ వారు మాత్రం తగిన వైద్యం అందుకోలేకపోతున్నారు. కొంతమంది సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి వంటి పట్టణాల్లోని పేదలు అందుబాటులో ఉన్న ఏరియా ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆరు నెలల్లో 4 లక్షల రోగులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం 3,90,791 మంది జ్వరాల బారినపడ్డారు. అలాగే 3,770 మందికి మలేరియా, 150 మందికి డెంగ్యూ, 47 మందికి చికున్ గున్యా సోకినట్టు లెక్కకట్టారు. ఏజెన్సీ ఏరియాలో 2,687 మందికి, విశాఖ అర్బన్‌లో 744 మందికి, రూరల్‌లో 396 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారించారు. ఈ అధికారిక లెక్కలకంటే రెట్టింపు జ్వర బాధితులుంటారు. ఇప్పటికీ మన్యంలో ప్రస్తుతం ఇంటికొకరు చొప్పున వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్న వారున్నారు. వీరిలో అత్యధికులు మలేరియా జ్వరాల వారే కనిపిస్తున్నారు. అయితే గత ఏడాదికంటే మలేరియా జ్వరాల తీవ్రత తగ్గిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం శ్రద్ధ తగ్గించే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ, డయేరియాలతో అటు ఏజెన్సీలోనూ, ఇటు మైదానంలోనూ మరణాలు సంభవిస్తున్నా.. ఒక్కరూ మరణించినట్టు తమ రికార్డుల్లో నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. సరికొత్తగా చికెన్‌పాక్స్ ఒకపక్క విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగూ జ్వరాలు జనాన్ని వణికిస్తుంటే.. అవి చాలవన్నట్టు సరికొత్తగా చికెన్‌పాక్స్ కూడా విజంభిస్తోంది. కాలం కాని కాలంలో చికెన్‌పాక్స్ కేసులు నమోదు కావడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చికెన్‌పాక్స్ ప్రభావం చూపుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు జూలైలో కనిపించడం అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ జ్వరాల ఉధతి ఉన్నందున వైరస్ ద్వారా వ్యాప్తి చెందే చికెన్‌పాక్స్ కూడా ఇప్పుడు సోకడానికి కారణం కావచ్చని కేజీహెచ్ ఫిజీషియన్ డాక్టర్ పీఎస్ఎస్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ముందస్తు వర్షాల వల్లే.. ఈ ఏడాది ముందస్తుగా కురుస్తున్న వర్షాలే వైరల్ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం జ్వరాల ప్రభావం ఉండడం వాస్తవమే. జ్వరాల తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీల్లో మందులు. వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం. – జి.సరోజిని, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
ఆదిలాబాద్‌లో విషజ్వరాలు
-
తెలంగాణలో విషజ్వరాలు
-
‘గ్రేటర్’లో కలరా కలవరం
- చాపకింద నీరులా విస్తరిస్తున్న విష జ్వరాలు - బస్తీల్లో పారిశుద్ధ్యలోపం,కలుషిత నీరు సరఫరా - వ్యక్తిగత శుభ్రతతోనే వ్యాధులు దూరం అంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోలియో వైరస్ సృష్టించిన కలకలం ఇంకా మరవక ముందే తాజాగా వెలుగు చూసిన కలరా బస్తీవాసులను కలవరపెడుతోంది. కలుషిత నీరు, నిల్వ ఉన్న ఆహారంతో పాటు పారిశుద్ధ్యలోపం మలేరి యా, డెంగీ వంటి వ్యాధులకు కారణమవుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 24 కలరా, 68 మలేరియా, 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ముషీరాబాద్‌లోని బాపూజీనగర్, అడ్డగుట్ట, అబిడ్స్ పరిసరాల్లో కలరా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గులకుంటలోని ఫెర్నాండేజ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు నర్సులు మంగళవారం అబిడ్స్ సమీపంలో పండ్ల రసం తాగి తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, వీరు విబ్రియో కలరా బారిన పడినట్లు తేలింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యపరిస్థితి నిలకడ గా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నీళ్ల విరేచనాలు... 60 ఏళ్ల క్రితమే మాయమైపోయిందనుకున్న కలరా గ్రేటర్లో మళ్లీ కలకలం సృష్టిస్తోంది. కలరాలో ‘క్లాసికల్’బ్యాక్టీరియా కలరా చాలా ప్రమాదకరమైంది. ఇప్పటివరకు ఇది నగరం లో నమోదు కాలేదు కానీ,‘ఎల్టార్ విబ్రోయో ఒగావా కలరా’ అప్పుడప్పుడు వెలుగు చూ స్తూనే ఉంది. డయేరియా వస్తే రోజులో 10-15 సార్లు వాంతులు, విరేచనాలు అవుతా యి. కడుపు నొప్పి, దాహం, నోరు ఎండిపోవ డం, చర్మం ముడతలు పడటం వంటి సమస్య లు ఉంటాయి. మూత్ర విసర్జన ఆగిపోతోంది. విరేచనాలు ఆరంభమైన కొద్ది సేపట్లోనే బియ్యం కడిగిన నీళ్లలా విరేచనాలు అవుతుంటే దీన్ని కలరాగా అనుమానించాలి. మంచినీటి నల్లాలా ఆగకుండా విరేచనాలతో పాటు వాసన ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. కలరా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి ► ఒకటే వాంతులు, దుర్వాసనతో కూడిన పలుచని విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే కలరాగా అనుమానించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ► బాధితుల వాంతులు, విరేచనాల ద్వారా ఇతరులకు ఇది వ్యాపించే అవకాశం ఉంది. ► పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ► తాజాగా ఇంట్లో వండిన వేడివేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్,నిలోఫర్ ఆస్పత్రి -
ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గాంధీ ఆస్పత్రి: విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే... టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని...ప్రజారోగ్యంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శిం చింది. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు, పారిశుద్ధ్యం తీరుతెన్నులను పరిశీలించింది. సెల్లార్‌లోని లక్ష్మీ గణపతి క్యాంటీన్‌కు వెళ్లి... మోండా మార్కెట్లో మిగిలి పోయి... ఆవులకు వేసే కూరగాయలు తెచ్చి వంటలు చేస్తున్న దృశ్యాన్ని చూసి నేతలు అవాక్కయ్యారు. వంటలకు వాడుతున్న నూనె నాసిరకంగా ఉండడంతో శాంపిల్స్ తీసుకున్నారు. డిజాస్టర్, స్వెన్‌ఫ్లూ వార్డుల్లో వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు... క్షేత్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరెంటెండెంట్ వేంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, ఎన్వీఎస్ ప్రభాకర్, నాయకులు వెంకటరెడ్డి, భవర్‌లాల్‌వర్మ, శ్యామసుందర్‌గౌడ్, రవిప్రసాద్‌గౌడ్, ప్రభుగుప్తా, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. క్యాంటీన్ సీజ్... గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి క్యాంటీన్‌ను జీహెచ్ఎంసీ అధికారులు గురువా రం మధ్యాహ్నం సీజ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష బృం దం క్యాంటీన్‌ను సందర్శించిన నేపథ్యంలో ఆగమేఘాల మీద సికింద్రాబాద్ సర్కిల్ వైద్యాధికారి సుధీర్‌ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్‌లు రంగంలోకి దిగారు. -
విషజ్వరాలతో గ్రామాలు విలవిల
మంగళగిరి : విష జ్వరాలు విసృ్తతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రాజధాని గ్రామాలు మంచం పడుతున్నాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున విష జ్వరాలతో బాధ పడుతున్నారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాలతో పాటు తాడేపల్లి, ఉండవల్లి, వడ్డేశ్వరం తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, దుగ్గిరాల మండలం మంచికలపూడిలతో పాటు పలు గ్రామాలలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు. కామెర్లతో ముగ్గురు మృతి.. దుగ్గిరాల మండలం మంచికలపూడిలో వైద్యశిబిరాలు కొనసాగుతుండగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత పది రోజుల వ్యవధిలో జ్వరాలు, కామెర్లతో ముగ్గురు మృతి చెందారు. ఆయా గ్రామాల నుంచి జ్వరాలతో తాడేపల్లి మండలంలో 72 మంది, దుగ్గిరాల మండలంలో 200 మంది, మంగళగిరి మండలంలో 64 మంది, తుళ్లూరు మండలంలో 42 మంది వెరసి మొత్తం 378 మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా, మరో 300కుపైగా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఇదే అదనుగా డెంగీ అని భయపెడుతూ పరీక్షలు, చికిత్సల పేరుతో దోచుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి వెళ్లినా పరీక్షలు చేయించుకోవాలని అతనికి తెలిసిన ఆసుపత్రిలో చేరుస్తూ కమీషన్లు వసూల్ చేసుకుంటున్నారు. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా పేర్లతో ఆయా ఆసుపత్రుల్లో దోపిడీ చేస్తున్నారని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పంచాయతీలు.. పది రోజులుగా గ్రామాల్లోని ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నా ఆరోగ్య సిబ్బందిగానీ, పంచాయతీ సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. ఆయా కాలనీల్లో డ్రైనేజి కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు, మురుగునీరు ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. వర్షాల కారణంగా తాగునీరు సైతం కలుషితం అయ్యాయి. ప్రజలు బోర్ల నీటినే తాగుతున్నారు. బావుల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలతో పాటు బీసీ కాలనీల్లో వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం కారణంగా దో మలు పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. తక్షణమే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ప్రత్యే క వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలి. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లాం. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాను. - ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మంగళగిరి -
వణికిస్తున్న విషజ్వరం
సాక్షిప్రత్యేకప్రతినిధి, అనంతపురం : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్లో 749మందికి సోకినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వాస్తవ సంఖ్య వేలల్లోనే ఉందని తెలుస్తోంది. 2013లో డెంగీ దెబ్బకు దాదాపు 50మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈఏడాది 20-25మంది డెంగీతో చనిపోయారు. అయినా నివారణకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. భయపెడుతోన్న డెంగీ: ఆ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఏడాది 976 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 210మందికి డెంగీ నిర్ధారణ అయింది. వీరిలో 64మంది తిరుపతి స్విమ్స్, 12మంది కర్నూలులో చికిత్స తీసుకున్నారు. తక్కిన 147 మంది అనంతపురంలో వైద్యం పొందారు. ఇవన్నీ ప్రభుత్వ గణంకాలు. అయితే జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నారు ఈఏడాది 10 వేలమందికిపైగా ఉంటారని ఓ అంచనా. దోమల నివారణకు చర్యలేవీ? వర్షాకాలంలో పల్లెల్లో, పట్టణాల్లో ఫాగింగ్ చేయడం తప్పనిసరి. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు ‘1450 లీటర్ల మలాథియాన్’ ద్రావణం వచ్చింది. అందులోనూ ఇప్పటి వరకూ 190 లీటర్లు మాత్రమే జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అదికూడా ఇప్పటి వరకు కొన్నిచోట్లే ఫాగింగ్ చేశారు. మిగిలిన చోట్ల మూలనపడేశారు. కారణాలు అన్వేషిస్తే చాలాచోట్ల ఫాగింగ్ మిషన్లు పనిచేయడం లేదు. జిల్లా కేంద్రంలో కూడా ఫాగింగ్ పెద్దయంత్రం రిపేరుకు వచ్చింది. దీంతో చిన్నవి వినియోగిస్తున్నారు. జిల్లాకు ఏమేరకు మలాథియన్ అవసరం? తీసుకెళ్లినవారు ఫాగింగ్ చేస్తున్నారా? లేదా? తక్కినవారు ఎందుకు ద్రావణాన్ని తీసుకెళ్లలేదు? అనే అంశాలపై ఆరా తీసే అధికారే కరువయ్యారు. మురికికాలువల్లో దోమల వృద్ధిని నివారించేందుకు గాంబూషియా చేపలను కూడా వదల్లేదు. పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ?: జిల్లాలో 80 పీహెచ్‌సీలు, 586 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 42 ఉన్నాయి. వీటి పరిధిలోని ఏఎన్ఎంలు సరిగా విధులకు హాజరుకావడం లేదు. సబ్‌సెంటర్ల పరిస్థితి మరీ దారుణం. పీహెచ్సీలలో ఉదయం 9 నుంచి12 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. చాలా చోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ నర్సులు మాత్రమే ఆస్పత్రిలో ఉంటారు. ఈ సమయంలో జ్వరం వచ్చిందని రోగులు ఆస్పత్రులకు వెళితే మాత్రలు చేతిలో పెట్టడం లేదంటే ఓ ఇంజక్షన్ వేసి పంపుతున్నారు. దీంతో రోగులు ప్రై వేటు ఆస్పత్రులకు వెళ్లక తప్పడంలేదు. జ్వరంతో ఓ రోగి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే 2-5వేల రూపాయల ఖర్చవుతోంది. జ్వరాలు అని తెలియగానే.. ప్రత్యేక బృందాలు పంపుతున్నాం: పల్లెల్లో జ్వరం అని తెలియగానే ప్రత్యేక బృందాలను పంపిస్తున్నాం. లార్వాపరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతీ ఇంటికి డెంగ్యూ నివారణ కరపత్రాలు అంటిస్తున్నాం. ఫైరిథ్రిమ్ స్ప్రే చేస్తున్నాం. రోజూ నివేదికలు తెప్పించుకుని చూస్తున్నాం. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు రోజూ గ్రామాల్లో పరిస్థితి తెలుసుకుంటున్నారు. ప్రభుదాస్, జిల్లా వైద్యాధికారి. అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం: మునిసిపాలిటీల్లో దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. ఫాగింగ్, గాంబూషియా చేపల పెంపకం, మురికికాలువల్లో ఆయిల్ వేయడంతో పాటు దోమల నివారణకు అన్ని రకాలు చర్యలు తీసుకున్నాం. విజయలక్ష్మి, ఆర్డీ, మునిసిపల్ శాఖ. -
విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం
- వెయ్యి మలేరియా, 100 డెంగీ కిట్స్ సరఫరా - 80 కొత్తపడకల ఏర్పాటు, 50 పడకలకు ఆర్డర్ - అందుబాటులో 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్లు - డీఎంఈ నుంచి 250 రక్తంబాటిళ్లు సరఫరా - రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆస్పత్రికి వందల సంఖ్యలో రోగులు వరుస కడుతున్నారు. వీరిలో అధిక శాతం గిరిజన ప్రాంతాల వారే ఉంటున్నారు. రిమ్స్‌లో 650 మంది రోగులు ఉండగా.. 250 మంది జ్వర పీడితులే కావడం గమనార్హం. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరందరికీ 24 గంటలు వైద్యసేవలు అందించేందుకు, అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి వర్గాలు ముందుకు సాగుతున్నాయి. కలెక్టర్ జగన్మోహన్ రిమ్స్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో రోగులకు అందుతున్న వైద్యసేవలు, వారికి కల్పిస్తున్న సదుపాయాలపై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. విషజ్వర పీడితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశ్న : జ్వరాలతో ఎంతమంది రోగులు చికిత్స పొదుతున్నారు. జవాబు : ఆస్పత్రిలో 250 మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇందులో 10 మలేరియా, ఐదు డెంగీ, 235 వైరల్ ఫీవర్ కేసులు ఉన్నాయి. జ్వరాల కు సంబంధించి నాలుగు వార్డులు ప్రత్యేకంగా ఏర్పా టు చేశాం. మరొకటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతవాసులే 60 మంది చికిత్స పొందుతున్నారు. ప్ర : రోగులకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయా.. జ : నూతన పడకల కోసం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రూ.4 లక్షల చెక్కు అందజేశారు. వంద పడకలు కొనుగోలు చేశాం. ఇప్పటికే 80 పడకలు ఏర్పాటు చేశాం. 20 పడకలు సిద్ధమవుతున్నాయి. ఇవేకాకుండా 30 పడకలు అద్దెకు తీసుకువచ్చాం. ప్ర : మందుల కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జ : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ఎలాం టి మందుల కొరత లేకుండా చూస్తున్నాం. ట్యాబ్లెట్‌తోపాటు మలేరియాకు సంబంధించిన 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. ఇతర జ్వరాలకు సంబంధించి 400 క్వినీన్ శ్యాంపుల్స్, 50 ఈమాల్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సీడీసీ నుంచి మందులు తెచ్చుకోవడం జరుగుతుంది. ప్ర : మలేరియా కిట్స్ కొరత ఉందా.. జ : ప్రస్తుతం ఐటీడీపీఓ ద్వారా వెయ్యి మలేరియా కిట్స్ అందాయి. డెంగీకి సంబంధించి 500 ఎలిసా టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. రోగులు రిమ్స్‌కు వచ్చిన వెంటనే వారికి టెస్టు చేసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్య పరీక్షలు చేసి వార్డుకు పంపిస్తున్నాం. ప్ర : ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జ : ఇప్పుడు రెఫరల్ కేసులు పూర్తిగా తగ్గించాం. ఎలాంటి వైద్యం అవసరమున్నా ఇక్కడే చేస్తున్నాం. రక్త పరీక్షల నుంచి వైద్య చికిత్స వరకు అన్ని అందుబాటులో ఉంచాం. ప్రతి రోజు రిమ్స్ నుంచి రెఫర్ కేసుల వివరాలు కలెక్టర్‌కు నివేదిస్తున్నాం. మలేరియా, డెంగీ వంటి జ్వరాల కేసులు కాకుండా రిమ్స్‌లో అందుబాటులో లేని వైద్య పరీక్షలకు మాత్రమే రెఫర్ చేస్తున్నాం. ప్ర : వైద్యుల పర్యవేక్షణ ఎలా ఉంది. జ : సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రిమ్స్‌లో నీలోఫర్, ఉస్మానియా వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. 11 మంది సభ్యుల ఉస్మానియా బృందం రోగులకు చికిత్స అందిస్తోంది. మరో పది రోజులపాటు వీరు రిమ్స్‌లోనే ఉంటారు. 24 గంటలు రోగుల పర్యవేక్షలో వైద్యులను ఉంచుతున్నాం. ప్ర : రక్తహీనత రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జ : ప్రస్తుతం రక్తహీనతతో చాలామంది రోగులు వస్తున్నారు. వీరి కోసం ఉచితంగా రక్తాన్ని ఎక్కిస్తున్నాం. రిమ్స్‌లో వివిధ రక్తగ్రూప్లతో 145 రక్తం బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి మరో 250 రక్తం బాటిళ్లు త్వరలో రిమ్స్‌కు రానున్నాయి. ఒకవేళ కావాల్సిన గ్రూప్ రక్తం అందుబాటులో లేకుంటే రెడ్‌క్రాస్‌ను సంప్రదిస్తాం. ప్ర : రోగుల బంధువులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జ : రోగులతో ఉండే బంధువుల్లో ఒకరికి భోజన వసతి కల్పిస్తున్నాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నాం. రోగుల సహాయార్థం భోజన శాల కూడా ఏర్పాటు చేశాం. -
పారిశుధ్య లోపంపై నిరసన
- కడెంలో ప్రజల రాస్తారోకో - సందర్శించిన ఎమ్మెల్యే రేఖ కడెం : పారిశుధ్య లోపం కారణంగా కడెంలో విషజ్వరాలు, డెంగీ ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తూ స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు వంద మందికి పైగా స్థానికులు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మల్-మంచి ర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని, పందులను గ్రామానికి దూరంగా తరలించడంతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకో కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కలెక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే కడెంలో స్థానికులు రాస్తారోకో చేస్తున్నారన్న సమాచా రం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్ వ చ్చారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితు లు తెలుసుకున్న ఆమె.. ఫోన్లో కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నియామకం, పారి శుధ్య పరిస్థితిపై తెలిపారు. పారిశుధ్య ప నులు చేపట్టడంతో పాటు పందుల తరలింపు చర్యలు చేపట్టాలని తహశీల్దార్ నర్సయ్య, ఎంపీడీవో విలాస్‌ను ఆదేశిం చారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా, డ్యూటీ డాక్టర్ లేరు. ఈ మేరకు ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తక్కళ్ల సత్యనారాయ ణ, రఫీఖ్, మీనాజ్, సయ్యద్ ఆశాం, కలీం తదితరులు పాల్గొన్నారు. -
పల్లెకు జ్వరం
పల్లెలు పడకేస్తున్నాయి. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, దీంతో ఉధృతమవుతున్న దోమలు, మరోవైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం... వెరసి గ్రామాలు ‘గజగజ’ వ ణికిపోతున్నాయి. - జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న విషజ్వరాలు - మంచికలపూడిలో ఇంటింటికీ జ్వరపీడితులు - ఈపూరులో రెండురోజుల కిందట జ్వరంతో ఇద్దరు మృతి - ఆలస్యంగా వైద్యశిబిరాల ఏర్పాటు - నిర్లిప్తంగా అధికారులు సాక్షి నెట్వర్క్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పదిరోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్, ఈపూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా విషజ్వరాలకు విలవిల్లాడుతున్నారు. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో సుమారు 100మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. వీరిలో కొందరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలతో చికిత్స పొందుతుండగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. రెండ్రోరోజుల నుంచి ఇక్కడ వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆదివారం డీఎంహెచ్‌వో పద్మజరాణి ఈ శిబిరానికి వచ్చి బాధితులను పరామర్శించారు. కొల్లిపర సామాజిక ఆరోగ్యకేంద్రానికి రోజుకు 50మందికి పైగా జ్వరపీడుతులు వస్తున్నారు. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు సుమారు 20 మంది, తెనాలి మండలం సంగంజాగర్లమూడి పీహెచ్సీ పరిధిలో రోజూ 125మంది జ్వరపీడితులు చికి త్స కోసం వస్తున్నారు. కొలకలూరు పీహెచ్సీ పరిధిలో అదే పరిస్థితి నెలకొంది.ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజులు 200 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెంలో సీజనల్ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారంరోజులుగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. గ్రామంలోని రామమందిరం సమీపంలోని రెండు వీధుల్లో అధికశాతం మంది టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని సభ్యులకు జ్వరం రావడంతో ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకున్నారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ వెళ్లి అక్కడ వైద్యపరీక్షలు చేయించుకోగా తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిందని వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పెదకూరపాడు నియోజకవర్గంలో విషజ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల కిందట జిల్లా మలేరియా అధికారులు 75త్యాళ్ళూరులో పర్యటించి డెంగీవ్యాధికి కారణమయ్యే దోమల లార్వా ఇక్కడ అధికంగా ఉందని తేల్చారు. పరిశుభ్రంగా ఉండే 75త్యాళ్ళూరులోనే ఈ పరిస్థితి నెలకొంటే పునరావాస కేంద్రాలు, తండా, శివారు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్ధమవుతుంది. అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో తండా గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. ఈపూరు మండలంలోని ఊడిజర్ల కాలనీలో విషజర్వాలతో మంచానపట్టారు. పలువురు వినుకొండ, నర్సరావుపేట, గుంటూరుల్లోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొంతుతున్నారు. రెండ్రోజుల కిందట గ్రామానికి చెందిన నంబూరి మరియదాస్(35) గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కాలనీకి చెందిన కాకాని తిరుపల్(30) జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ క్రమంలో కాలనీలో వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కూలికి వెళ్లలేక.. జ్వరాలతో బాధపడుతున్న వారిలో ఎ క్కువమంది వ్యవసాయ కూలీలే ఉన్నా రు. వారంతా అనారోగ్యంతో పనులకు వెళ్లలేక, ఇల్లు గడవడం కష్టంగామారి తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రజలూ ఇవి పాటించాలి.. - ఇంటిలోపల బయట నీటి నిల్వలు లేకుండా చూడాలి. - ప్రతి శుక్రవారం వీక్లీ డ్రైడేగా పాటించాలి. ఇంటి ఆవరణలో కొబ్బరిబోండాలు, పాతటైర్లు, రోళ్లలో నీటినిల్వలు ఉండకుండా చూడాలి. - నీటి గుంతలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. పందులు జనావాసాలకు దూరంగా ఉంచాలి - దోమతెరలు వాడాలి. దోమలు కుట్టకండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధుల బారినపడితే వైద్యులను సంప్రదించాలి. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
డెంగీకి ఐదుగురు బలి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇద్దరు.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు మొత్తం ఐదుగురు డెంగీ బారిన పడి మృతి చెందారు. ఇందులో ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా వాసులుండగా, రంగారెడ్డి.. మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కరున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూ డెంలో వారం రోజులుగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 12 మంది డెంగీ జ్వరంతో అస్వస్థతకు గురైనట్లు తేలింది. శనివారం రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మూర్తి, అనంతలక్ష్మి(40) దంపతులు కొన్నేళ్లక్రితం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండల పరిధిలోని పూడూర్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అనంతలక్ష్మి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో ఆమెను శుక్రవారం రష్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ సోకిందని నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే అనంతలక్ష్మి శనివారం ఉదయం మృతి చెందింది. అలాగే, మెదక్ జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికి చెందిన మీస ఐల య్య, కనకవ్వల కుమారుడు విష్ణు(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేయగా, అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం విష్ణు పరిస్థితి విషమించడంతో క్యాన్సర్ ఉందని చెప్పారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించగా క్యాన్సర్ లేదని, డెంగీతో రక్తకణాలు పడిపోయాయని తెలిపారు. చేసేదిలేక వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే శనివారం తెల్లవారుజామున మృతి చెందాడనికు టుంబసభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పాతహీరాపూర్ గ్రామంలో కనక సంగీత(20) జ్వరంతో శనివారం చనిపోరుుంది. జైనూర్ మండలం దబోలి గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్రం చందర్షావ్(13) జ్వరంతో శనివారం మరణించాడు. కౌటాల మండలం వీర్దండి గ్రామానికి చెందిన మడపతి సుందరబాయి(50) విషజ్వరంతో శుక్రవారం రాత్రి మరణించింది. కొత్తగూడెంలో 12 మందికి డెంగీ.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే డెంగీ లక్షణాలతో ముగ్గురు మృతిచెందగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేసే పరీక్షల్లో మరికొంతమందికి డెంగీ సోకినట్లు తేలింది. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది వారం రోజులుగా నిర్వహిస్తున్న పరీక్షల్లో రామవరం పరిసర ప్రాంతాల్లో 12 మందికి డెంగీ లక్షణాలు కన్పించినట్లు నిర్ధారించారు. డెంగీతో బాధపడేవారు ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రామవరంలోని బర్మాక్యాంప్కు చెందిన ఆరుగురికి డెంగీ లక్షణాలతో జ్వరం సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 6 నెలల పాప రమణాతి లక్ష్మి, డి.భార్గవి, దొంగ మురళికృష్ణ, కేత అన్వేష్‌తోపాటు మరో ఇరువురికి, అదేవిధంగా చిట్టిరామవరంలో ముగ్గురికి, 12వ వార్డులో ఇద్దరికి, 8,9,10 వార్డుల్లో కూడా మరికొన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి హైదరాబాద్ : అన్ని జిల్లాల్లోని గిరిజనప్రాంతాల్లో విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు గిరిజన ఆవాసాల్లో తగిన జాగ్రతలు తీసుకోవాలని ఈ శాఖ కార్యదర్శి జీడీ అరుణ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, ఆదిలాబాద్ తదితర జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. శనివారం ఈ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏఎన్ఎంలు, స్టాఫ్‌నర్సులను వెంటనే ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పారు. ఇదివరకే శిక్షణ ఇచ్చిన వారికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే వారిని విధుల్లో చేరేలా చూడాలన్నారు. విషజ్వరాలు ఏ మేరకు ప్రబ లాయో, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను ఒక కమిటీ ద్వారా పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు పంపించాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలుతున్నచోట తాత్కాలికంగా ఇతర ప్రాంతాల నుంచి డాకర్లు, సిబ్బందిని తెప్పించుకుని, వైద్యసేవలను అందించాలన్నారు. జిల్లాల్లో మందులను ముందస్తుగా అందుబాటులో పెట్టుకోవాలని మంత్రి చందూలాల్ అధికారులకు సూచించారు. -
తగ్గని జ్వరం
మచిలీపట్నం : జిల్లాలో విషజ్వరాలు అదుపులోకి రావటం లేదు. సోకింది విషజ్వరమో, డెంగీ జ్వరమో తేలక ప్రజలు సతమతమవుతున్నారు. చల్లపల్లి మండలం మాజేరులో విషజ్వరాలతో 18 మంది మరణించినా, ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోని పరిస్థితి నెలకొంది. తోట్లవల్లూరులో 700 మంది జ్వరంబారిన పడ్డారు. ఈ గ్రామంలో 20 రోజుల పాటు వైద్యశిబిరం నిర్వహించారు. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరంలో వంద మందికి పైగా జ్వరంబారిన పడ్డారు. గ్రామానికి చెందిన నక్కల నిరీక్షణరావు అనే వృద్ధుడు జ్వరంతో శనివారం మృతి చెందాడని సమాచారం. దీంతో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఆర్డీవో పి.సాయిబాబు గ్రామాన్ని సందర్శిం చారు. బందరు మండలం చిన్నాపురంలో 250 మందికి పైగా విషజ్వరాల బారినపడ్డారు. ఈ గ్రామంలోనూ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబి రాల్లో నామమాత్రంగా మందులు ఇస్తుండటంతో రోగులు విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంత కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జ్వరపీడితులు 2,56,244 మంది జిల్లాలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 2,56,244 మందికి జ్వరం సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 157 మలేరియా కేసులు, 44 డెంగీ కేసులని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 8,800 మందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించగా 2,843 మందికి టైఫాయిడ్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం జ్వరం రాగానే విపరీతమైన ఒళ్లు నొప్పులు వచ్చి నాలుగైదు రోజులు తగ్గడంలేదు. కొందరికి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతోంది. తీవ్రజ్వరం బారినపడిన వారు పీహెచ్‌సీలకు వెళ్తే డెంగీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంది. గత ఏడాది మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు డెంగీ నిర్ధారణ కిట్లు ఇచ్చారు. ఈ ఏడాది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి డెంగీ నిర్ధారణకిట్లు ఇచ్చినా పెద్దగా ఇక్కడ పరీక్షలు జరపని పరిస్థితి ఉంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో రెండు నెలల్లో నాలుగు డెంగీ కేసులే నమోదయ్యాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. డెంగీ కేసులను దాచేస్తున్నారా..! జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విషజ్వరాలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో సరైన వైద్యసేవలు అందక జ్వరపీడితులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగీకేసులను నిర్ధారిస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖాధికారులు జారీ చేసిన హెచ్చరికలతో ప్రైవేటు వైద్యుల తమ వద్దకు వచ్చిన రోగులకు సివియర్ ఫీవర్ అనే కొత్త పేరు పెట్టి చికిత్సచేస్తున్నారు. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఇంజక్షన్లు చేస్తున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్‌కు రూ.2300 చొప్పున వసూలు చేస్తున్నారు. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంటే మూడు నుంచి ఐదు ఇంజక్షన్లు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా డెంగీ లక్షణాలను తగ్గించేందుకు చేస్తున్న కోర్స్ ఇంజక్షన్లకు రూ.1600 ఖర్చవుతోందని రోగులు పేర్కొంటున్నారు. డెంగీ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులు కోలుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల ఖర్చు చేయాల్సి వస్తోంది. రోగులు డిశ్చార్జి అయ్యే సమయంలో ‘ఇంతకాలం మీరు డెంగీకి చికిత్సపొందారు. అయితే అధికారికంగా ధ్రువీకరించలేం. మందులు జాగ్రత్తగా వాడండి’ అని వైద్యులు చెప్పి పంపుతున్నారు. బందరు మండలం వాడపాలేనికి చెందిన కాండ్ర వెంకటేశ్వరరావు, బొడ్డు లక్ష్మణరావు, ఇంతేటి శేషారావు డెంగీ లక్షణాలతో చికిత్స పొందారు. కాండ్ర వెంకటేశ్వరరావు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెంగీకి చికిత్స చేయించుకున్నారు. దీంతో అతనికి మాత్రమే డెంగీ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయవాడలో మూడు, మిగిలినవి జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. -
100 మందికి విషజ్వరాలు
గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో 100 మందికి పైగా విషజ్వరాలతో మంచానపడ్డారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో విషజ్వరాలు ప్రభలినట్టు సమాచారం. కాగా, శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలోని రోగుల రక్త నమూనాలను సేకరించారు. ఆరోగ్య అధికారులు స్పందించి ఇప్పటికైనా గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపును నిర్వహించి.. మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతానగరం మండలంలోని అనంతరాయుడు పేటలో విష జ్వరాలు ప్రభలాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గుర చొప్పున జ్వరాల భారిన పడ్డారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వారం రోజుల నుంచి గ్రామంలో రోగాలు విజృభించడంతో గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. (సీతానగరం) -
‘గూడెం’లో ప్రబలుతున్న విషజ్వరాలు
గంగబిషన్ బస్తీలో రెండు డెంగీ కేసులు నమోదు {పభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య మున్సిపాలిటీ పాత్రపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు కొత్తగూడెం అర్బన్ : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 40 రోజులుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెతో వార్డుల్లో పేరుకపోయిన చెత్తాచెదారం, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న సిల్టుతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. స్థానిక గంగభిషన్బస్తీలో రెండు డెంగీ కేసులు బుధవారం నమోదయ్యాయి. వీరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు పట్టణంలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా విషజ్వరాల బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓపీ విభాగంలో చికిత్స కోసం రోజుకు 150 మంది వచ్చేవారు. ప్రస్తుతం దాదాపు 300 పైన రోగులు జ్వరాలతో వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మున్సిపల్ పాత్రపై అసహనం.. మున్సిపాలిటీలోని వార్డుల్లో విషజ్వరాలు ప్రబలుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో డైలీ లేబర్స్‌తో పనులు చేయిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తుందంటున్నారు. చెత్తాచెదారంతో విపరీతంగా ఈగలు, దోమలు ఇళ్లలోకి వచ్చి కుట్టడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వార్డులో దోమల నివారణకు ఫాగింగ్, దుర్వాసన రాకుండా బ్లీచింగ్ వంటివి కూడా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి వార్డుల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి నిర్వహించాలని, దీంతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య 30 పడకల ఆస్పత్రిలో సరిపోని బెడ్లు రోగులకు తప్పని అవస్థలు వైద్య శిబిరాలు నిర్వహించాలంటున్న ప్రజలు ఆదిలాబాద్(సిర్పూర్-టి) : మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పది రోజులుగా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. మండలంలోని శివపూర్, లక్ష్మీపూర్, చీలపల్లి, భూపాలపట్నం, చింతకుంట, టోంకిని గ్రామాల్లో అధికంగా విషజ్వరాల బారిన పడ్డారు. రోజురోజుకు విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రోజుకు వందకుపైగా రోగులు వస్తున్నారు. రోగులకు సరిపడా బెడ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని కుర్చీలపైనే వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. కానరాని వైద్య శిబిరాలు ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా అధికారులు స్పందించడం లేదు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. వర్షాకాలం కావడంతో మండలంలో విషజ్వరాలతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నారుు. ఇటిక్యాలపహడ్, భూపాలపట్నం, లక్ష్మీపూర్, శివపూర్, హీరాపూర్ తదితర గ్రామాలకు అంబులెన్సులు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా గ్రామాల రోగులు ఆస్పత్రులకు రావడంలేదు. స్థానికంగానే వైద్యం చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యం అందకపోవడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. అంబులెన్సులు రాని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజేరుకు బాసట
విషజ్వరాలు ప్రాణాలను హరిస్తుంటే బెంబేలెత్తి పోతున్న చల్లపల్లి మండలం కొత్తమాజేరు వాసులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారికి బాసటగా నిలిచారు. జ్వరమరణాలకు గురైనవారి కుటుం బాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. - చల్లపల్లి మండలంలో పర్యటించిన వైఎస్ జగన్ - విషజ్వర మృతుల కుటుంబాలకు పరామర్శ - గోడు వెళ్లబోసుకున్న బాధితులు - తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగన్ మచిలీపట్నం : చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి రెండున్నర నెలల వ్యవధిలో 18 మంది మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. కొత్త మాజేరులోని తాగునీటి చెరువు పక్కన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఒక్కొక్క పేరు చదువుతూ.. మృతులు ఎన్ని రోజుల పాటు జ్వరం బారినపడ్డారు.. ఎక్కడ వైద్యం చేయించుకున్నారు.. ఎంత ఖర్చు చేశారు.. ప్రభుత్వ సాయం అందిందా.. వైద్యశాఖ మంత్రి గ్రామానికి వచ్చారా, లేదా అనే వివరాలను బంధువుల నుంచి సేకరించారు. మృతులంతా విషజ్వరం బారిన పడే చనిపోయారని, ఎంత డబ్బు ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేదని ప్రతి ఒక్కరూ చెప్పారు. ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది : జగన్ బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించిన జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వం స్పందించదు. వైద్యశిబిరంలో ఇచ్చిన మందులు పనిచేయవు. మృతుల కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదు.’ అని విమర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం వైద్యం శిబిరం ఏర్పాటుచేసిన తర్వాత కూడా మరణాలు సంభవించాయని వివరించారు. ఒకేరోజు గంటల వ్యవధిలోనే జంధ్యం జయలక్ష్మి, ఆమె భర్త శ్రీరాములు మరణించారని, దీంతో శ్రీరాములు తల్లి నాగేశ్వరమ్మ, కుమార్తె సీతమ్మ అనాథలుగా మిగిలారని గ్రామస్తులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పనిచేసే శ్రీరాములు తల్లి, కుమార్తెను పోషించేవారని, ఆయన మరణంతో ఆ ఇద్దరికీ దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘వీళ్ల ఉసురు ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది.’ అన్నారు. చెరువు పరిశీలన కొత్తమాజేరు చేరుకున్న జగన్ 18 మంది మరణించడానికి గల కారణాలు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులను తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉన్న వాస్తవాలను తెలియజేయాలని, ఎవరికీ భయపడవద్దని చెప్పారు. చెరువులోని నీరు కలుషితం కావటం వల్లే విషజ్వరాలు ప్రబలాయని, ఈ విషయంపై ముందస్తుగానే హెచ్చరించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్, తలశిల రఘురామ్, తాతినేని పద్మావతి, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ జరగలేదు చల్లపల్లి మీదుగా ఘంటసాల మండలం లంకపల్లికి చేరుకున్న జగన్మోహన్రెడ్డికి ఘంటసాల మండల అధ్యక్షుడు వేమూరి వెంకట్రావు, సర్పంచి మాడెం నాగరాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనుమూరి బుజ్జి అనే మహిళ మాట్లాడుతూ ‘బాబూ నీకు ఓటేశామనే కారణంతో బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రూ.10వేల రుణాన్ని మాఫీ చేయలేదు.’ అని వివరించారు. రైతులకూ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో అమలుకాని హామీలు ఇచ్చారని, రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని భరోసా ఇచ్చారు. -
జ్వరం.. భయం
జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువు ప్రైవేటు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్న జనం నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం జ్వరం.. జ్వరం.. .జిల్లాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ప్రతి చోటా జనం విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ సరైన వైద్యసౌకర్యం లేకపోవడంతో ప్రధాన నగ రాలకు పరుగులు తీస్తున్నారు. పసిపిల్లల మొదలుకుని పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ జ్వరాలతో వణికిపోతున్నారు. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా జిల్లా యంత్రాంగంలో చలనం లేదు. మలేరియా, టైఫాయిడ్, సాధారణ జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. మురికి నీళ్లలో నివసించే ఫ్యూరెక్స్ దోమకంటే మంచినీళ్లలో నివసించే ఎడిస్ (టైగర్) దోమతోనే అనర్థాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. వైద్యానికి ఇబ్బందులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 72 పీహెచ్‌సీలు, 448 సబ్ సెంటర్లు, 8 పట్టణ ప్రాంత ఆస్పత్రులు, ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 5 ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం కింద జ్వరాాలకు యాంటీబయాటిక్ మాత్రలు అమాక్సలిన్, జ్వరానికి ప్యారాసిటమాల్, నొప్పులకు డైక్లోఫినాట్, ఓఆర్ఎస్ తదితర మందులను వాడాలి. అయితే, అమాక్సలిన్ ట్యాబెట్లు అందుబాటులో లేవు. ప్యారాసిటమాల్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో యాంటీబయాటిక్ మందు డ్యాస్కి, డైకోఫినాట్ మందులు కూడా లేవు. గత ఏప్రిల్ నుంచి సరిగా మందులు అందడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ఫలితంగా గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రధాన పట్టణాల్లోని వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏ జ్వరం వచ్చినా డాక్టర్ రక్త పరీక్షలు చేసి నిర్ధారించాల్సిందే. దీంతో కేవలం రక్త పరీక్షలకే వందల్లో ఖర్చవుతోంది. దోమల నిర్మూలనకు ప్రభుత్వం నామమాత్రంగా బడ్జెట్‌ను కేటాయించడంతో జిల్లాలోని 26 పీహెచ్సీ కేంద్రాల పరిధిలోని 80 గ్రామాల్లో డీడీటీని స్ప్రే చేశారు. అలాగే 216 గ్రామాల్లో అబెట్ పౌడర్‌ను చల్లారు. పైరత్రం ద్రావకాన్ని కిరోసిన్‌తో కలిపి 105 గ్రామాల్లో రాత్రి పూట ఇళ్లల్లో స్ప్రే చేశామని అధికారులు అంటున్నారు. మందుల కొరత లేదని వైద్యాధికారులు అంటున్నప్పటికీ చాలా కేంద్రాల్లో వైద్యుల కొరత స్పష్టంగా కనబడుతోంది. ఫలితంగా సామాన్యులు ఎలాంటి జ్వరం వచ్చినా పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ఒకసారి వందల్లో, కొన్ని సందర్భాల్లో వేలల్లో అప్పులు చేసి వైద్యానికి వెచ్చిస్తున్నారు. స్థానిక ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు ఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదని ప్రజలు వెల్లడిస్తున్నారు. -
నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక
-
నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక
విషజ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు పరామర్శ విజయవాడ : అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శిస్తారు. ఉదయం హైదరా బాద్‌లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కొత్తమాజేరు గ్రామం వెళతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం తెలిపారు. మృతుల కుటుంబాలతో జగన్మోహన్రెడ్డి మాట్లాడతారని, గ్రామంలో జరిగిన పరిణామాలు తెలుసుకుంటారని ఆయన వివరించారు. గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలడిగి తెలుసుకుంటారని చెప్పారు. పరామర్శల అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ తెలిపారు. -
గిద్దలూరులో విషజ్వరాలు
♦ ఒక బాలుడికి డెంగీ ♦ మరో 10 మంది చిన్నారులకు జ్వరాలు ♦ ఆందోళనలో పట్టణ ప్రజలు గిద్దలూరు : పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. దీంతో ప్రజలు విషజ్వరాల బారినపడి మంచం పడుతున్నారు. ఒక బాలుడు డెంగీ సోకి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అనేక మంది చిన్నారులు, వృద్ధులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. వివరాలు..నాలుగు రోజుల క్రితం నల్లబండ బజారులోని పాములపల్లె రోడ్డులో 15 మందికి జ్వరాలు సోకిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైద్యాధికారులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ఉన్న పోస్టాఫీసు వెనుక వీధిలో 10మంది చిన్నారులు విషజ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. పోస్టాఫీసు వెనుక వీధిలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో గేదెలు కట్టేయడం, అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకోవడంతో చిన్నారులకు విషజ్వరాలు వచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. మొన్నటి వరకు పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వలన చెత్త, చెదారం కాలువల్లో పేరుకుపోయి దోమల బెడద ఎక్కువైంది. బాలుడికి డెంగీ పోస్టాఫీసు వెనుక వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు చిట్టేల రామాంజనేయులు కుమార్తె, ఆశ్రీత, కుమారుడు అరవింద్‌లు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యశాలలో చికిత్సలందించినా అరవింద్‌కు జ్వరం తగ్గకపోవడంతో రక్తపరీక్షలు చేయగా డెంగీ సోకినట్లు నిర్థారించారు. వెంటనే కర్నూలులోని ఓ వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. డెంగీ సోకినట్లు నిర్థారించిన వైద్యులు 26వ తేదీన పరీక్షించగా ప్లేట్లెట్స్ 45 వేలు, 27న 25 వేలు, మంగళవారం 18 వేలకు పడిపోయాయని చెప్పినట్లు బాలుడి తండ్రి రామాంజనేయులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వర్షిత, లిఖిత, హేమంత్‌రెడ్డి మరికొందరు చిన్నారులకు రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం... సమాచారం అందుకున్న క్రిష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీలక్షీ ఆ వీధిలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి కొందరికి టైఫాయిడ్ వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ గేదెలు, పందులు ఎక్కువగా ఉన్నాయని, పక్కనే ఉన్న పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే మల, మూత్ర విసర్జనలు చేస్తున్నారని చెప్పారు. దీంతో జ్వరాలు వస్తున్నట్లు డాక్టర్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. -
వణుకుతున్న మాజేరు
అదుపులోకి రాని విషజ్వరాలు 244 మందికి వైద్య పరీక్షలు 35 మందికి సెలైన్లతో చికిత్స మచిలీపట్నానికి ఇద్దరి తరలింపు కొత్తమాజేరు (చల్లపల్లి) : మండలంలోని కొత్తమాజేరులో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. 244 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వారిలో 45 మందికి విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారికి వైద్య శిబిరంలోనే చికిత్స చేశారు. వారిలో 35 మందికి సెలైన్లు పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరుకు గదుల్లో చికిత్స చేస్తుండటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఘంటసాల, ఘంటసాలపాలెం, పురిటిగడ్డ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యశాలల నుంచి డాక్టర్లు వచ్చి చికిత్స నిర్వహించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, ఇన్చార్జి డీపీవో ఎన్వీవీ సత్యనారాయణతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ వైద్యసేవలను పర్యవేక్షించారు. మంత్రుల సందర్శన కొత్త మాజేరు గ్రామాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సోమవారం సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ సాయంత్రానికి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు తదితరులు గ్రామంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రబలుతున్న మలేరియా
- ఐదేళ్ల తరువాత పెరుగుతున్న పాజిటివ్ కేసులు - వాతావరణంలో మార్పులతో విషజ్వరాలు - కలుషిత నీటితో అతిసార ప్రమాదం కొయ్యూరు: కారణం తెలియదు.. ఐదేళ్ల తరువాత మన్యంలో మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు అదుపులో ఉందని భావించిన అధికారులకు పెరుగుతున్న మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడో ఇచ్చిన దోమతెరలు పాడైపోవడం ఒక కారణమైతే.. ఉన్నా వాటిని వాడకపోవడం మరో కారణం. ఇక మన్యంలో మారుతున్న వాతావరణం కూడా ఇందుకు కారణమవుతోంది. వారంరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా మరణాలు లేకపోయినా విషజ్వరాల లక్షణాలతో జనం విలవిల్లాడిపోతున్నారు. మలేరియా పాజిటివ్ కేసులు కూడా దీనికి తోడవుతున్నాయి. ఒక్క రాజేంద్రపాలెం పీహెచ్‌సీలోనే ఈ నెలలో 35 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలం మొత్తంగా ఈ సంఖ్య 50 దాటింది. పీవీలు కంటే పీఎఫ్‌లు అధికంగా ఉంటున్నాయి. పీఎఫ్‌కు మూడు రోజుల చికిత్స అయితే పీవీకి 15 రోజుల వరకు మాత్రలు వేసుకోవలసి ఉంటుంది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పొంచి ఉన్న అతిసార ప్రమాదం ఎండల తీవ్రతతో తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి. కాలువల్లోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ నీటిలో పడిన ఆకులు కుళ్లిపోయి విషంగా మారే ప్రమాదం ఉంది. ఈ కారణంగా అతిసార ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు కాచి చల్లార్చిన నీటిని తాగేందుకు జనం ఇష్టపడడం లేదు.ఎలా తీసుకెళ్లిన నీటిని అలానే తాగుతున్నారు. మారుమూ ప్రాంతాల్లో ఇదే వారి పాలిటశాపంగా మారుతోంది. రోగాల బారిన పడుతున్నారు. ఇదే విషయాన్ని నర్సీపట్నం క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత వద్ద ప్రస్తావించగా అడుగంటిన కాలువ నీటిని తాగరాదన్నారు. మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగడం మేలన్నారు. ఇక మలేరియా పాజిటివ్‌లు వచ్చిన చోట మూడు రోజుల వరకు దగ్గరుండి సిబ్బంది చికిత్స చేస్తున్నారని చెప్పారు. -
ముగ్గురిని బలిగొన్న జ్వరం
జిల్లాలో విషజ్వరాలు తీవ్రస్థాయిలో ప్రబలుతున్నాయి. విషజ్వరంతో బుధవారం ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఐదో తరగతి చదివే బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరు మహిళలు. నాడు తండ్రి.. నేడు తల్లి మహబూబాబాద్ టౌన్ : విషజ్వరం.. ఇద్దరు పిల్లలను అనాథను చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులను పొట్టనబెట్టుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మానుకోటలోని పత్తిపాక ప్రాంతానికి చెందిన దండు లక్ష్మి(38)- ప్రసాద్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాలుగేళ్ల క్రితం ప్రసాద్ విషజ్వరంతో మృతిచెందాడు. నాటి నుంచి లక్ష్మి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రాజకుమారికి పెళ్లి చేసింది. ఐదు రోజులుగా లక్ష్మి విషజ్వరంతో బాధపడుతోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిలో సోమవారం వరకు చికిత్స చేరుుంచుకుంది. బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. కుమారుడు లేకపోవడ ంతో చిన్న కుమార్తె చామంతి తలకొరివిపెట్టింది. లక్ష్మి మృతదేహాన్ని కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి, ఆ సంఘం నాయకులు ఆలువాల రాజయ్య, ఆనంద్, తప్పెట్ల వెంకన్న, గొర్రె రవి, కుమార్, బెజ్జం ఐలేష్ సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతురాలి కుటుంబానికి ఆర్డీఓ మధుసూదన్‌నాయక్ రూ. 3 వే లు ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సూర్యతండాలో బాలుడు.. సూర్యతండా(రాయపర్తి): మండలంలోని సూర్యతం డా శివారు కొత్తతండాలో విషజ్వరం తో బాలుడు మృతి చెందాడు. స్థానికు ల కథనం ప్రకా రం.. తండాకు చెందిన బానోతు వీరు, బూలీల కుమారుడు రాంబాబు(12) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స చేరుుంచినా తగ్గకపోవడంతో ఎంజీఎంలో చేర్పించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. కాగా, తండాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హామ్యానాయక్ కోరారు. బైరాన్‌పల్లిలో మహిళ.. బైరాన్‌పల్లి(హసన్‌పర్తి): మండలంలోని బైరాన్‌పల్లి శివారు హరిశ్చంద్రనాయక్ తండాకు చెందిన నూనావత్ లక్ష్మి(36) విషజ్వరంతో మృతిచెందింది. పదిరోజులుగా ఈమె జ్వరంతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. 15 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన నూనావత్ రాజు డెంగీతో మృతి చెందాడు. -
జూడాలు బేషరతుగా విధుల్లో చేరాలి: మంత్రి రాజయ్య
జూడాలు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సిందే విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ జ్వరంగా చిత్రిస్తున్నాయి సాక్షి,హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టంచేశారు. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిందేనని, వారు ఇంకా జూనియర్ డాక్టర్లే అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ వ్యాధిగా చిత్రిస్తున్నాయని రాజయ్య విమర్శించారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్‌లలో రూ.7.50 కోట్ల ఖర్చుతో ప్లేట్లెట్ సెపరేషన్ మిషన్లను అందుబాటులో తెస్తామన్నారు. విషజ్వరాల వల్ల బాధ ఉంటుందే తప్ప మరణాలు ఉండవని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాల నివారణకు నిరంతరం వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. విషజ్వరాల మాట అటుంచి పాము, కుక్క కాటుకు మం దులు లేవంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని రాజయ్య అన్నారు. సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు తెలంగాణ సీఎం రోజుకు ఒక వేషం వేస్తున్నారని, జూడాల సమస్యలపై కేసీఆర్ నిర్మాణాత్మకంగా ఆలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జూడాల సమస్యలపై అఖిల పక్ష, మేధావుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజీడీఏ, ఐఎంఏలు జూడాలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ జూడాల సమస్యలు న్యాయమైనవని, కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యలపై బుర్రపెట్టి ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. సంవత్సరం పాటు జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధనలో కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ జూడాలను చ ర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా జూడాలు రూరల్ సర్వీసులు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లురవి, బీజేపీ లీగల్‌సెల్ నేత రామచందర్‌రావు, ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, టీజీడీఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, తెలంగాణ గెజిటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాల రీలే నిరాహార దీక్ష కొనసాగింది. -
విజృంభించిన విషజ్వరాలు
తిరుపతి కార్పొరేషన్: జిల్లాలో విషజ్వరాలు ప్రబలాయి. ముఖ్యంగా విష జ్వరాలతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలోని స్విమ్స్, రుయాతో పాటు నగరంలోని ప్రయివేట్ చిన్న పిల్లల ఆసుపత్రులు జ్వరం సోకిన చిన్నారులతో కిటకిలాడుతున్నాయి. తిరుపతి నగరం, రూరల్, చంద్రగిరి, పాకాల, దామలచెరువు, పీలేరు, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాల పేట మండలాల్లో 15 రోజులుగా విష జ్వరాల బారిన పడుతున్నారు. ముఖం వాపులు రావడం, ఎర్రటి గుల్లలు ఏర్పడటం, విరేచనం నల్లగా కావడం వంటి లక్షణాలతో పెద్దాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో... ఒక్క రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలోనే వందకు పైగా విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. అందులో 30కి పైగా డెంగీ లక్షణాలను గుర్తించిన వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా వందకు పైగా పిల్లలు వెద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షలకు, వ్యాధి తగ్గడానికి కనీసం వారం రోజులైనా సమయం పడుతోంది. దీంతో కొందరు మెరుగైన వైద్యం కోసమని స్విమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. దీనిపై రుయా చిన్నపిల్లల వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా చిన్న పిల్లలకు విష జ్వరాలు సోకుతున్న మాట వాస్తవమే అన్నారు. కాని గతంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగానే ఉందన్నారు. వచ్చిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రైవేటు దోపిడీ.. విషజ్వరాల బారిన పడిన పిల్లలను తీసుకుని చాలా మంది ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేట్ వైద్యులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రేలు అంటూ నానా హడావిడి చేస్తున్నారు. దీనికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నారు. ఇంత చేసినా బిడ్డకు ఫలానా జ్వరం అని చెప్పడం లేదని సావిత్రి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి జిల్లాలో పిల్లలకు సోకుతున్న విషజ్వరాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సాతేల్లిబేస్ కాలనీలో విషజ్వరాలు
నిజాంసాగర్ : మండలంలోని ముగ్దుంపూర్ గ్రామ సాతేల్లిబేస్ కాలనీలో ప్రజలు విషజ్వరాలతో విలవిలాడుతున్నారు. తీవ్రమైన జ్వరం, కాళ్లు, కీళ్లనొప్పులతో రోగులు మంచం పట్టారు. చీమన్‌పల్లి గంగవ్వ, రుక్మాబాయి, అవుసుల రామవ్వ, ఆదం నాగమణి, ఆదం గంగమణి, సాతేల్లి సత్యవ్వ, ఆదం సువ ర్ణ, అల్లదుర్గం లక్ష్మితోపాటు మరికొంత మంది విషజ్వరాలబారిన పడ్డారు. వీరంతా స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. 15 రోజులుగా విషజ్వరాలు వేధిస్తున్నా వైద్యశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా జ్వరాలు నయం కావడం లేదని వాపోతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరు బాన్సువాడలోని ప్రభుత్వ, ప్రయివేలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
విషజ్వరాలు
మంచం పడుతున్న ప్రజలు వైద్య సేవలపై దృష్టిపెట్టని ఆరోగ్య శాఖ ప్రైవేట్ చికిత్సలతో జనం జేబులు ఖాళీ గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు సాక్షి, హన్మకొండ : పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. సర్కారు వైద్యసాయం కింద అందే అరకొర గోలీలకు జ్వరాలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యాలు రకరకాల పరీక్షలు చేస్తుండటంతో రోగులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది సగటు వర్షపాత తక్కువగా ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఓ మోస్తారు వర్షాలే కురిశాయి. వరదలు వచ్చేలా భారీ వర్షాలు కురవలేదు. ఈ తేలిక పాటి వర్షాల కారణంగా నీటి ఆవాసాల్లో పాతనీరు పోయి కొత్త నీరు వచ్చింది తక్కువ. అంతేకాకుండాగతేడాదితో పోల్చితే వర్షాలు తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. గ్రామాల్లో మొక్కుబడిగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. నీటి ఆవాసాల్లో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. సమస్యాత్మక గ్రామాలు అంటూ కేవలం 108 పల్లెల్లోనే ఫాగింగ్ చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో ఈ పని చేయలేదు. దానితో దోమలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే వెంటనే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ పాకుతోంది. పరీక్షలతో జేబులు గుల్ల.. సర్కారీ వైద్యసేవలు అరకొరగా అందుతుండటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 40కి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే ప్రతీరోగికి అవసరం ఉన్నా లేకపోయినా పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారుు. దానితో వైద్య ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇప్పటికైనా దోమలు పెరగకుండా తక్షణమే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫాగింగ్ చేయూలి. నీటి ఆవాసాల్లో దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు సరఫరా చేసే నీటిపై నమ్మకం లేక చాలా మంది క్యాన్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చిన గోలీలే ఇస్తాండ్రు నాకు ఇరవైరోజుల సంది జరమొత్తాంది. గౌర్నమెంట్ డాక్టర్లు వచ్చిండ్రంటే పోయిన. జరం, కాళ్లు, కీళ్లనొప్పులు, నీరసం ఉందన్నా. నాకు రెండు రకాల గోళీలు ఇచ్చిండ్రు. ఆ మందులు వాడినా ఏం తగ్గలే. మళ్లా డాక్టర్లు వచ్చిండ్రు. మళ్ల పోతే అయే గోళీలు ఇచ్చిండ్రు. ఇదేంది మేడమ్ మళ్ల అయ్యే గోళీలు ఇచ్చిండ్రు అని అడిగితే, పై నుంచి ఇవే వత్తనాయ్ అన్నరు. చేసేది లేక మా ఊళ్లో డాక్టర్ కాడికి పోయినా. గ్లూకోజ్ బాటిల్ పెట్టి మానుకోటలోని ఆస్పత్రికి పంపిండ్రు. అక్కడ బాటిళ్లు ఎక్కించి మందులు రాసిండ్రు. పరీక్షలకు, మందులకు రూ.12 వేలు అయినయ్. అయినా జరం తక్కువైతలేదు. పైసలు లేక ఇంటికి వచ్చిన. చేతిలో ఉన్న మందులనే వాడుతున్న. - బోడ అస్లీ, కాట్రపల్లి చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన తప్పనిసరి. పిల్లలను చలిలో తిప్పడం, వర్షంలో తడనివ్వడం, ఐస్‌క్రీంలు తినిపించడం, శీతలపానీయాలు అతిగా తాగిపించడం మంచిది కాదు. జలుబు, జ్వరం ప్రారంభం కాగానే ఆవిరిపట్టడం, వెచ్చని దుస్తులు ధరించడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు జ్వరంతో పాటు న్యుమోనియా వంటి వ్యాధులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ యాంటీబయాటిక్స్ మందులను ఏడు రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకటి రెండు రోజులు వాడి వదిలిస్తే ఇబ్బందులు తప్పవు. - శేషుమాధవ్, పీడియాట్రీషన్ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి... వర్షాకాలం రాగానే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పరిసరాలలో నీరు నిల్వ ఉండ డంతో పాటు పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది జ్వరాలు సోకే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వర్షకాలంలోచల్లని పదార్థాలు సేవించకూడదు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. - వి.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎంజీఎం 40 మందికి డెంగ్యూ ప్రాణాంతక మలేరియా, డెంగ్యూలతో పాటు చికున్‌గున్యా వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు జిల్లాలలో 2,67,366 మంది నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా.. వీరిలో 76 మందికి మలేరియా సోకినట్లుగా నిర్థారణ అయింది. అదేవిధంగా 421 మంది జ్వరపీడితులకు పరీక్షలు చేయగా వీరిలో 40 మంది ప్రాణాంతక డెంగ్యూ, మరో 14 మందికి చికున్‌గున్యా సోకినట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రాణాంతక వ్యాధుల ఆనవాళ్లు కనిపిస్తున్నా అందుకు తగ్గట్లుగా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంలో జిల్లా ఆరోగ్యశాఖ తరఫున అందడం లేదని రోగులు అంటున్నారు. పైసల్లేక ఇంటికి వచ్చిన 15రోజులుగా జరమొత్తాంది. సర్కారోళ్లు మా ఊరికి వచ్చి అందరికీ పరీక్ష చేత్తాన్నరని ఎల్లిన. రెండు మార్లు పోతే నాకు, నాతోటోళ్లకి ఒకే రకం గోలీలు ఇచ్చిండ్రు. జరం తగ్గకపోవడంతో మానుకోట ఆసుపత్రికి పోయిన. అక్కడ రూ.10 వేల దాక ఖర్చయింది. ఇంకా ఉండాలని డాక్టర్లు అన్నరు. కానీ పైసల్లేక ఇంటికి వచ్చినమ్. - ఆంగోతు తుల్సమ్మ, కాట్రపల్లి జ్వరాల ‘కోట’ మహబూబాబాద్ : విషజ్వరాలతో మానుకోట డివిజన్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. సాధారణ రోజుల్లో ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య 400 నుంచి 500 మధ్య ఉంటుంది. కానీ... సీజనల్ వ్యాధుల మూలంగా ప్రతి రోజు ఓపీకి 500 నుంచి 800 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగానికి పైగా జ్వరపీడితులే కావడం గమనార్హం. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
డెంగీతో జిల్లాలో ఇప్పటికే ఆరుగురి మృతి అల్లాడుతున్న ప్రజలు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఇబ్బందులు అధికారికంగా నమోదైన విషజ్వరాలే 218 అనధికారికంగా వేలల్లోనే సాక్షి, చిత్తూరు: పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగకు చెందిన వై.మంగమ్మ(35)కు పది రోజుల క్రితం జ్వరం సోకింది. పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గలేదు. డెంగీ లక్షణాలున్నట్లు భావించిన వైద్యులు తిరుపతి స్విమ్స్‌కు సిఫారసు చేశారు. అక్కడ వైద్యులు డెంగీ అని తేల్చారు. చికిత్స చేస్తుండగా మంగమ్మ ఈ నెల 12న మృతి చెందింది. మంగమ్మతో పాటు ఆమె భర్త బాలాజీ, కుమారుడు ప్రకాష్, కుమార్తె వెన్నెలకు కూడా ఇదే సమయంలో డెంగీ సోకింది. అందరూ స్విమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. రామకుప్పం మండలం అల్లెకుప్పంలో వసుంధర(7)కు జ్వరం సోకింది. స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతి చెందింది. డెంగీతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ..వీళ్లిద్దరే కాదు...ఈ ఏడాది డెంగీ దెబ్బకు ఆరుగురు మరణించారు. అధికారులు మాత్రం ఈ ఏడాది 15 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరు మాత్రమే చనిపోయారని చెబుతున్నారు. జిల్లాలోని ప్రజలు విషజ్వరాల దెబ్బకు విలవిలాడిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోజుల తరబడి వైద్యం చేయించుకుం టున్నారు. వారిలో కొందరు మరణిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం విషజ్వరాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఓవైపు దోమల తీవ్రత, మరో వైపు వాతావరణంలోని మార్పులతోనే విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 79 మలేరియా, 67 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలను పక్కన పెడితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేవారి సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. అయినా దోమల నివారణ కోసం ఫాగింగ్, గంబూషియా చేపలను మురుగుకాలువల్లో వదలడం, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ, మునిసిపల్‌శాఖ అధికారులు మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యమా? వర్షాకాలం కావడంతో దోమలు తాకిడి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఫాగింగ్ చేయూల్సి ఉంది. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు 1210 లీటర్ల మలాథియాన్ ద్రావణం వచ్చింది. జిల్లాలో ఫాగింగ్ చేసేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఇందులోనూ అధికారులు కేవలం 50 లీటర్లు మాత్రమే ఫాగింగ్ చేశారు. జిల్లాలోని 20 క్లస్టర్లు ఉన్నాయి. వచ్చిన మలాథియన్ తీసుకెళ్లి ఫాకింగ్ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ద్రావణం తీసుకెళ్లిన వారిలో కొంతమంది మాత్రమే ఫాగింగ్ చేశారు. పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ? జిల్లావ్యాప్తంగా 76 పీహెచ్సీ(ప్రైమరీ హెల్త్ సెంట ర్)లు ఉన్నాయి. 418 దాకా సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రజలు రోగాలబారిన పడి అల్లాడుతుంటే, గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి చికి త్స చేయడంలో కూడా పీహెచ్‌సీలు నిర్లిప్తంగా ఉన్నా యి. ఉదయం 9 నుంచి 12 గంటలు, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు ఓపీ ఉండాలి. ఈ సమయం లో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. అయితే చాలాచోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే చాలామంది ఇంటిదారి పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నర్సులు మాత్రమే ఉంటున్నారు. జ్వరం వచ్చిందని రోగులు వెళితే మాత్రలు చేతిలో పెడుతున్నారు. ఇంజెక్షన్ అవసరమైతే నీడిల్, సిరంజి రోగులు తెచ్చుకోవల్సిందే!. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. అక్కడికి వెళితే రక్తపరీక్షలు, మందులకు కలిపి ఒక్కొక్కరికీ రూ.1500 నుంచి 3వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. డెంగీతో ఒకరు చనిపోయారు జిల్లాలో ఈ సీజన్లో 15 మంది డెంగీ బారినపడ్డారు. మంగమ్మ మాత్రమే చనిపోయారు. తక్కిన వారు డెంగీతో చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. ల్యాబ్‌లో సరైన రిపోర్టులు లేని కారణంగా వాటిని మేం డెంగీ డెత్కేసులుగా పరిగణించలేం. మలాథియాన్ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో ఫాగింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. -దోసారెడ్డి, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి -
విష జ్వరాలతో విద్యార్థుల విలవిల
నందిగాం: హరిదాసుపురం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని పదుల సంఖ్యలో విద్యార్థులు రెండు వారాల నుంచి విష జ్వరాలు, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం పలాస, పూండి తదితర ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఈ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి (కృష్ణరాయపురం) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలి సిందే. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వైద్యులు కనీసం స్పందించడం లేదని గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో హరిదాసుపురం, ఆనందపురం, బోరుభద్ర, ఉప్పలపుట్టి, మాదిగాపురం, కామదేనువు, కృష్ణరాయపురం, కంచివూరు, పెద్దలవునిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు గుంట యుగంధర్, దుంపల భవాణి, పినకాన ప్రేమకుమార్, గుంట ధనుంజయరావు, దుంపల భాగ్యలక్ష్మి, కంచరాన మౌళి, పినకాన హరి, బమ్మిడి హరి, హనుమంతు యామిని, కె.దివ్య, బి.అశ్విని, ఎస్.భాస్కరరావుతోపాటు సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. కొందరు పూండి, పలాస ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు వైద్యులకు తెలియజేసినా స్పందించ లేదని విమర్శిస్తున్నారు. మూలకు చేరిన వాటర్ ప్లాంట్ ఈ పాఠశాలకు స్థానిక యువ ఇంజనీర్లు సంకల్ప ట్రస్ట్ ద్వారా గత రెండేళ్ల కిందట వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. ఆరు నెలల నుంచి ఇది మూలకు చేరడంతో విద్యార్థులు బోరు, బావి నీటినే తాగుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు చెబుతున్నారు. మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండే ది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. గ్రామంలో విద్యార్థులు వ్యాధి బారిన పడడంతో సీపీఎం మండల నాయకుడు పాలిన సాంబమూర్తి గ్రామాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
మంచాన పడుతున్న పల్లెలు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పారిశుద్ద్యం అస్తవ్యస్తం ఆందోళనలో గ్రామాలు పెడన/ నందిగామ రూరల్ : జిల్లాలోని ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఇంటికొకరు జ్వరంతో అల్లాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుని పోవడంతో పాటు రోజుల తరబడి మురుగునీటి నిల్వలుండడంతో పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. గ్రామ పంచాయతీ, వైద్య సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితి ఘోరంగా ఉంది. అధిక శాతం మంది పేదవారు కావడంతో రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామం, నందిగామ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో జ్వర పీడితులు అల్లాడుతున్నారు. నందిగామలోని డీవీఆర్ కాలనీ, తక్కెళ్లపాడులో జ్వర పీడితులు అధికంగా ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఏరియా ప్రభుత్వాస్పత్రికివచ్చే వారిలో 60 శాతం వరకు జ్వర పీడితులే ఉంటున్నారని ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. మంచాన పడ్డ కప్పలదొడ్డి.... గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో సూమారు మూడు వేలమంది జనాభా ఉంటుంది. చేనేత, కలంకారీ కార్మికులతో పాటు ఇతర వ్యవసాయాధారిత కుటుంబాలు నివాసం ఉంటుంన్నాయి. నెహ్రూ నగర్‌లోని అరవై ఏళ్ల యక్కల శ్యామలరావు ఎంతకూ జ్వరం తగ్గక పోవడంతో ప్లేట్లెట్స్ తగ్గి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. కాటే నాగపైడేశ్వరమ్మ జ్వరంతో మంచాన పడిఉంది. పేరిశెట్టి మల్లేశ్వరరావు, యక్కల నాగకోటేశ్వరరావు జ్వరంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుల వద్దనే చికిత్స పొందుతున్నారు. దళిత వాడలో ఎంపీ శ్రీనుతో పాటు మరో 50 మంది జ్వరాలతో మంచాన పడి ఉన్నారు. భగత్ సింగ్ నగర్ కాలనీలో ఇంటికొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మల్లేశ్వరరావు కాలనీలో పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా ఉంది. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలుకుని మల్లేశ్వరరావు కాలనీ శివారు వరకు పేడ, చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. జెడ్పీ హైస్కూల్ రోడ్డు చుట్టూ ఉన్న స్థానికులు చెత్త చెదారం వేయడంతో దుర్గంధ పూరిత వాసన వెదజల్లి స్థానికంగా ఉండలేని దుస్థితి నెలకొంది. వైరల్ జ్వరాలకు కారణం.... వర్షాకాలంలో ఒకే ప్రాంతంలో నీరు అధికంగా నిల్వ ఉండడం వలన ఆ నీటిపై లార్వా ఏర్పడి దోమలు పెరుగుతాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు వృద్ధి చెందుతుంటాయి. ముఖ్యంగా వర్షపునీరు వినియోగించి పక్కన పడేసిన కొబ్బరి బోండాల్లో నిల్వ ఉండడం వలన, టైర్లు, పనికి రాని వస్తువుల్లో నీరు వారానికి మించి నిల్వ ఉండడం కూడా దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా వర్షాకాలంలో వైరల్ జ్వరాలు దోమకాటు వలనే వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. పట్టించుకోని పంచాయతీ, ఆరోగ్య సిబ్బంది.... గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది నెలలో ఒక్కసారి కూడా పారిశుద్ద్య పనులు నిర్వహించడం లేదని బాధితులు వాపొతున్నారు. ఆరోగ్య వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారగణం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా... ఉన్నత వైద్యాధికారులు సబ్ సెంటర్లను ఒక్క మారు కూడా సందర్శించిన దాఖలాలు లేవు. గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గూడేలు గజగజ
ఏటూరునాగారం : ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలు, గొత్తికోయగూడేల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా ఇంటికొకరు చొప్పున మంచంపట్టారు. సర్కారు వైద్యులు రోగులకు సరైన చికిత్స అందించకపోవడంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రుల్లో జ్వర పీడితులు ఏటూరునాగారానికి చెందిన దేపాక నర్సయ్య, డొంగిరి రమాదేవి, కొల్ల సరోజన, సంతగాని రజిత, కోరం మానస, కోడి దుర్గు (విద్యార్థిని), చిదరపు సరోజన జ్వరంతో వారం రోజులుగా విలవిల్లాడుతున్నారు. వీరిని పరీక్షించాల్సిన వైద్యులు తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తెలిపారు. మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామానికి చెందిన ఆక శ్రీనివాస్ (38) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డకు చెందిన పానిగంటి శ్రీనివాస్ వారం రోజులగా డెంగీతో బా ధపడుతున్నారు. ప్రస్తుతం హన్మ కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఇప్పటి వరకు వైద్యఖర్చు ల కోసం రూ.30వేలు ఖర్చుచేసినట్టు తెలిపారు. నిర్లక్ష్యపు నీడలో.. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు సరిపడా నిధులున్నా పనులు చేపట్టకుం డా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా బురదగుంతలు, చెత్తాచెదారం, కుళ్లిన వ్యర్థాలే కనిపిస్తున్నాయి. వీటిని ఆవాసంగా చేసుకుంటున్న దోమలు విజృంభిస్తున్నా యి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతోపాటు క్లోరినేషన్ చేపట్టి జ్వరాలను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మంచం పట్టిన అనంత జనం
సాక్షి, అనంతపురం : జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా తదితర జ్వరాలతో జనం విలవిలలాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. రోజుల తరబడి తగ్గకపోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థితి బాగోలేని వారు మాత్రం మంచాలపైనే మగ్గిపోతున్నారు. కొంత మందికి రక్త పరీక్షలు చేసినా ఏ జ్వరమో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో డెంగీ లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువవుతోంది. జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా డెంగీ లక్షణాలు కనిపించాయి. అయితే అధికారుల లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పది కేసులు నమోదైనట్లు అనంతపురం వైద్య కళాశాల అధికారులు చెబుతుండగా, కాదు 15 కేసులు నమోద య్యాయంటూ డీఎంెహ చ్ఓ రామసుబ్బారావు సోమవారం ప్రకటించారు. ఈ లెక్కలు ఎలాగున్నా.. డెంగీ పేరు చెప్పగానే జిల్లా ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది కూడా విష జ్వరాల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. ప్రస్తుతం రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. మలేరియా బాధితుల నుంచి రోజుకు రూ.1000 నుంచి రూ.1,500 వరకు గుంజుతున్నాయి. విష జ్వరాల బాధితులు రూ.2,500 వరకు, టైఫాయిడ్ రోగులు రూ.800 నుంచి రూ.1,100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు రక్త పరీక్షల కోసం మరో రూ.1000 వరకు అవుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. దాదాపు 18 పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది పీహెచ్‌సీలు ఉండగా, ఇందులో పెద్ద కౌకుంట్లతో పాటు వుూడు 24 గంటల పీహెచ్‌సీలకు రెగ్యులర్ వైద్యాధికారులు లేరు. పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు ఎక్కువగా పట్టణాల్లో కాపురముంటున్నారు. ప్రైవేటు ప్రాక్టీసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. కానరాని ముందస్తు చర్యలు సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రతియేటా ప్రకటిస్తూనే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాధుల వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో లక్షన్నరకు పైగా జ్వరాల కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో మలేరియా కేసులు 300 వరకు ఉన్నాయి. గోరంట్ల మండలం మిషన్‌తండా, గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పక్కదారి పడుతున్న పారిశుద్ధ్య నిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం నిధులిస్తున్నా.. వాటిని వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో ఓ ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయన మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో అందిన కాడికి దోచుకుని.. సొంత నర్సింగ్‌హోంను మరింత అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని 80 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీల (కమ్యూనిటీ హెల్త్సెంటర్లు) పరిధిలో 568 ఉప కేంద్రాలు ఉన్నాయి. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను ఎక్కడా సద్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఎక్కువ శాతం నిధులను ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి భోంచేయగా, మిగిలినవి సిబ్బంది స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ లక్షణాలుంటే వైద్యున్ని సంప్రదించాలి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విపరీతమైన జ్వరానికి లోనుకావడం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పి ఉంటే డెంగీ లక్షణాలుగా అనుమానించాలి. పారాసిటమాల్ తప్ప మరే మందులూ వినియోగించకూడదు. రెండో రోజూ జ్వరం తీవ్రత అలాగే ఉంటే.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. సర్పజన ఆస్పత్రితో పాటు ప్రైవేటు ల్యాబులలో ఈ సౌకర్యం ఉంది. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో డీ హైడ్రేషన్ (నీటిని కోల్పోవడం) వల్ల మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి సంఖ్య ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. -
గాలిలో వైద్యం
సాక్షి, కడప: జిల్లాలో ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల విరేచనాలతో పాటు జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఈ సీజన్లో 237 విషజ్వరాలు, 281 టైఫాయిడ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. వాస్తవానికి ఈసంఖ్య వేలల్లోనే ఉంది. మొత్తం బాధితుల్లో అధిక శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 72 పీహెచ్‌సీలు, 6 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. 600కుపైగా ప్రైవేటు క్లీనిక్‌లు ఉన్నాయి. ప్రైవేటు క్లీనిక్‌లలో రోగులు ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ సంఖ్యలో క్యూలో ఉంటున్నారు. ఈ ఏడాది విషజ్వరాలతో ఇద్దరు ప్రాణాలు వదిలినా వైద్య, ఆరోగ్యశాఖ స్పందించడం లేదు. వాస్తవ పరిస్థితి ఇది: జిల్లా వ్యాప్తంగా 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఉదయం 9-12, మధ్యాహ్నం 2-4 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. అయితే చాలా ఆస్పత్రుల్లో 12 గంటలకే డాక్టర్లు ఓపీ పూర్తి చేసి ఇంటిబాట పడుతున్నారు. పైగా వీరంతా పది తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారు. అంటే కేవలం 2గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ మంది చిత్తశుద్ధిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు రోగాలతో అల్లాడుతున్న పల్లెలకు వెళ్లాల్సిన ఏఎన్ఎంలు ఉదయం అలా వెళ్లడం, మధ్యాహ్నం లోపు ఇంటికి వెళుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం 4గంటల వరకూ 85 శాతం మంది ఏఎన్ఎంలు ఉండటం లేదని తెలుస్తోంది. పీహెచ్‌సీలు ఎలా ఉన్నాయంటే: ఉదయం ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యపరీక్షలు అందడం లేదు. డాక్టరు రక్తపరీక్షలు రాసిస్తే కచ్చితంగా ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. పీహెచ్సీలలో సుమారు 15 రకాల పరీక్షలు నిర్వహించాలి. అయితే రక్త, మూత్ర పరీక్ష, మలేరియా లాంటి పరీక్షలు మినహా తక్కిన వాటికి ప్రైవేటుల్యాబ్లకు వెళ్లాల్సిందే! ఇదేంటని ఆరాతీస్తే పూర్తిస్థాయిలో పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేవని ల్యాబ్‌అసిస్టెంట్లు చెబుతున్నారు. వీటిని ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో షుగర్,హెచ్ఐవీ, పచ్చకామెర్లు, వీడీఆర్ఎల్, వైడల్(టైఫాయిడ్) లాంటి పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను వెళుతున్నారు. ఆస్పత్రికి రోగులు వెళితే ర క్తపరీక్షలు చేయించుకురావాలని చెబుతున్నారు. లేదంటే మందులు ఇవ్వడం, పీహెచ్‌సీల్లో లేకుంటే రాయించి పంపడం చేస్తున్నారు. అధికశాతం పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులే వీటిని చూస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత రోగులు ఆస్పత్రికి వస్తే డాక్టర్లు ఉండని పరిస్థితి నెలకొంది. నిధులు ఉన్నా ఫలితం లేదు: పీహెచ్‌సీల నిర్వహణకు లక్ష, మందులు ఇతర వాటికి 75వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటితో పరీక్షలకు అవసరమైన కి ట్లు కొనుగోలు చేయాలి. ఈ కిట్ల ధర ఎక్కువగా ఉండటం, ఇచ్చే నిధులు తక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడం లేదు. -
జ్వరమొచ్చింది
సాక్షి, కడప: ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. పులివెందుల సమీపంలోని నల్లపురెడ్డిపల్లి, కమలాపురం, కొండాపురంలో ముగ్గురికి డెంగీ సోకినట్లు మలేరియా అధికారులు నిర్ధారించారు. రాయచోటి, చక్రాయపేట, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పెద్దముడియం ప్రాంతాలలో విషజ్వరాల తీవ్రత మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో 177 మందికి మలేరియా, 213 మందికి టైఫాయిడ్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడం, వాతావరణంలోని మార్పులు, చిత్తడి నేలలతో దోమల వృద్ధి అధికంగా ఉండటంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చర్యలు తీసుకోవడంలో ఓవైపు పంచాయతీ అధికారులు, మునిసిపల్ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తోంటే మరో వైపు ఇప్పటి వరకూ మలేరియా నియంత్రణకు ఎలాంటి మందును పిచికారీ చేయకుండా మలేరియా నియంత్రణశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మునిసిపల్ అధికారులు కూడా ఇప్పటి వరకూ ఎక్కడా ఫాగింగ్ చేయలేదు. గంబూషియా చేపలను మురికి కాల్వల్లోకి వదల్లేదు. తీరా జ్వరాలు సోకిన తర్వాత వైద్యసాయం చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధంగా లేవు. మందుల కొరతతో గ్రామాల్లోకి ఏఎన్ఎంలు వెళ్లాలంటేనే వెళ్లలేని పరిస్థితి. కనీసం గ్రామాల్లో వైద్యశిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ప్రజలు కూడా సర్కారు చికిత్సపై నమ్మకం లేక జ్వరం వస్తే చాలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎప్పుడు కళ్లు తెరుస్తారో..: అధికారుల నిర్లక్ష్యంతో గతేడాది డెంగీ దెబ్బకు 23మంది బలయ్యారు. ఇందులో 11మంది చిన్నారులు ఉన్నారు. కేవలం డెంగీ సోకిందని గుర్తించడంలో ఆలస్యం, ఆ తర్వాత చికిత్స చేయడంలో నిర్లక్ష్యంతోనే వారంతా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే అధికారులేమో ఒక్కరు మాత్రమే డెంగీ దెబ్బకు బలయ్యారని వాదించారు. ప్రస్తుతం జ్వరాల విజృంభణ మొదలుకావడంతో ఎవరికైనా డెంగీసోకితే యాథావిధిగా తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, వేలూరులకు తరలించాల్సిందే! ఎందుకంటే రిమ్స్‌లో డెంగీ నివారణ కోసం 1.50కోట్ల రూపాయలతో ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్‌ను తెప్పించారు. అయితే డెంగీ సోకిన వ్యక్తి రిమ్స్‌కు వెళితే చికిత్స మాత్రం చేయలేని స్థితి. దీనికి కారణం ఓ వ్యక్తి రక్తంలోని ప్లేట్లె ట్లను రోగి శరీరంలోకి ఎక్కించేందుకు ‘ఎన్-బ్లాక్’ అనే ప్రత్యేక యూనిట్ అవసరం. దీని విలువ 7,500 రూపాయలు మాత్రమే. అయితే ఇది రిమ్స్లోగాని, జిల్లాలోగాని అందుబాటులో లేదు. దీన్ని డెంగీ సోకిన రోగి తెచ్చుకోవాలి. అత్యవసరంగా ఇది కావాలంటే హైదరాబాద్, చెన్నై నుంచి తెప్పించాలి. దీనికి రవాణా ఖర్చులు మరో 20వేల రూపాయలవుతాయి. ఇంత ఖర్చయినా అక్కడి నుంచి మన జిల్లాకు వచ్చే లోపు రోగి బతికి ఉంటాడా? చనిపోతాడా? అనేది దేవుడే నిర్ణయించాలి. ఇదొక్కటి చాలు సర్కారు వైద్యం ఎంత డొల్లగా ఉందో తెలుసుకోవడానికి. డెంగీ సోకితే దానికి అందుబాటులో లేని ‘ఎన్-బ్లాక్’ను రోగి తెచ్చుకుంటేనే చికిత్స చేస్తామని వైద్యాధికారులు అంటున్నారంటే...ఇక ‘రిమ్స్’ ఎందుకు? వైద్య, ఆరోగ్యశాఖ ఎందుకు అనే భావన జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. యూనిట్ రోగి తెచ్చుకోవాల్సిందే: సిద్ధప్ప గౌరవ్, డెరైక్టర్, రిమ్స్. డెంగీని నయం చేసేందుకు అవసరమైన సామగ్రి మన వద్ద ఉంది. అయితే ఎన్-బ్లాక్‌ను రోగి తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ దొరకదు. హైదరాబాద్, చెన్నైలో దొరుకుతుంది. గతేడాది రెండు తెప్పించాం. ఇద్దరికి చికిత్స చే శాం. ప్రస్తుతం రిమ్స్‌లో లేవు. డెంగీ సోకిన వ్యక్తి ఆ యూనిట్లను తెచ్చుకుంటే ఇక్కడే మంచి చికిత్స అందిస్తాం. చర్యలు కట్టుదిట్టం చేస్తున్నాం: త్యాగరాజు, మలేరియా నియంత్రణ అధికారి. గత ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతోనే ఈ ఏడాది ఇప్పటికే 40మంది సీరాన్ని పరీక్షలకు పంపించాం. మలేరియా నియంత్రణకు ఫాగింగ్ చేయాలి. కానీ ఇప్పటి వరకూ మనకు ఫాగింగ్ మందు పంపిణీ కాలేదు. త్వరలోనే ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకుంటాం: మురళీ కృష్ణ గౌడ్, ఆర్డీ, మునిసిపల్ కార్పొరేషన్, వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఫాగింగ్‌తో పాటు గంబూషియా చేపలను కాలువల్లో వదిలేలా కమిషనర్లను ఆదేశిస్తాం. నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం. -
బెజవాడ శివార్లలో వేగంగా విస్తరిస్తున్న విష జ్వరాలు
-
రోగాల ముసురు
విశాఖపట్నం- మెడికల్/నక్కపల్లి, న్యూస్‌లైన్: రోగాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, కలుషిత తాగునీరు, కొరవడిన పారిశుద్ధ్యంతో వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. గతేడాది నమోదయిన కేసులను తలదన్నేలా డెంగీ,విషజ్వరాలు,మలేరియా, అతి సార జడలు విరబోసుకుంటున్నాయి. వం దలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. జ్వరపీడితుల తో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం, కొన్ని సందర్భాల్లో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారే ఎక్కువ. విష జ్వరాలు మొడటి స్థానాన్ని ఆక్రమిస్తుండగా, మలేరియా, డెంగీ కేసు లు ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన సిరిపురపు భారతి(36) డెంగీ లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. 20 రోజులు క్రితం జ్వరం సోకడంతో తగరపువలసలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎంతకూ నయం కాక పోవడంతో విశాఖలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి డెంగీగా నిర్ధారించారు. జిల్లాలోని మాకవరపాలెం మండలం చౌడువాడ, ఆనందపురం మండలం గొట్టిపల్లి, పెందుర్తి మండలం కరకవాని పాలెం, మధురవాడ సమీపంలలోని వాడపాలెం, పి.ఎం.పాలెం, గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో విషజ్వరాలు, అతిసార రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఎస్‌రాయవరం మండలం ఉప్పరాపల్లి నుంచి విషజ్వరాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో నక్కపల్లి ఆసుపత్రికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రజారోగ్య సిబ్బంది సమైక్యాంద్ర సమ్మెలో ఉన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా కొరవడింది. ఇటీవల అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. దీంతో అంతటా పేరుకుపోయిన చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెలువడుతోంది. తాగునీటి బావులు, చెరువులు, బోర్లలోకి కొత్తనీరు చేరింది. దాదాపు ఆరుమాసాలుగా బావుల్లో క్లోరినేషన్ లేదు. గ్రామాల్లోని మురుగునీటి కాలువలు దోమల పెంపకం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఏమీ చేయలేని దుస్థితి. దీంతో గ్రామాల్లో ప్రజారోగ్యం పడకేసింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఇదే సమయానికి అన్ని రకాల వ్యాధులకు సంబంధించి 5.77లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,500 మందికి పైగా మలేరియా, 163 మందికి డెంగీ సోకినట్టు అప్పట్లో నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 4లక్షలమంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. వీరిలో 4,500మందికి మలేరియా, 43మందికి డెంగీగా వైద్యాధికారులు నిర్ధారించారు. ఏజెన్సీ 11మండలాల్లో ఇంతవరకు 2.2లక్షల మందికి జ్వరాలు సోకాయి. వీరిలో సుమారు 2వేల మందికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. డెంగీ పీడితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కాని ఈ ఏడాది అన్ని రకాల జ్వరాల బాధితుల్లోనూ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంద ని ఫిజీషియన్ డాక్టర్ పి.ఎస్.ఎస్. శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. తీవ్రమైన కేసులకు సంబంధించి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లా మలేరియా అధికారి, ఇతర వైద్యాధికారుల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నాం. ఏజెన్సీలో ముందస్తుగా దోమతెరల పంపిణీ, మలేరియా నివారణ మందు పిచికారీతో ఈసారి మలేరియా కేసుల సంఖ్య తగ్గింది. మొదటి విడత మలాథియాన్ స్ప్రేయింగ్ పూర్తి చేశాం. రెండో విడతగా 167గ్రామాల్లో చేపడుతున్నాం. ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య తగ్గింది. - డాక్టర్ ఆర్.శ్యామల, డీఎంహెచ్‌వో -
వ్యాధుల పంజా
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విషజ్వరాలు, మలేరియా, అతిసార, చికున్‌గున్యా, డెంగీ, కంఠసర్పి, మెదడువాపు.. ఇలా ఒకదాన్ని మించింది మరొకటి ఈ సీజన్లో అన్ని రకాల వ్యాధులు ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే కంఠసర్పి రెండు ప్రాణాలను బలిగొంది. డెంగీ అనుమానిత మరణం చోటు చేసుకొంది. తాజాగా ఒంగోలుకు సమీపంలోని గుడిమెళ్లపాడులో ఆయేషా అనే మూడేళ్ల బాలిక మెదడువాపు బారిన పడింది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం గుంటూరు తరలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ లెక్కలకు, క్షేత్ర స్థాయిలో వాటి బారిన పడుతున్న వారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు. డెంగీ..నో ప్లేట్లెట్స్ కొన్నేళ్ల నుంచి జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీని బారినపడి మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా కీలకమైన ప్లేట్లెట్స్ మిషన్ ఏర్పాటు చేయడంలో జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవువనా ఎక్కడో ఒకచోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ బారిన పడినవారికి ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. సకాలంలో ప్లేట్లెట్స్ ఎక్కిస్తేనే ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడతాయి. డెంగీ లక్షణాలు కనిపించడంతో అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వైద్యులు డెంగీ కేసులను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన అప్పటి వైద్య ఆరోగ్యశాఖామంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో ప్లేట్లెట్స్ మిషన్ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి మానుగుంట మహీధరరెడ్డి కూడా ప్లేట్లెట్స్ మిషన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. కంఠసర్పి... రిపోర్టు లేట్ నెలరోజుల నుంచి కంఠసర్పి కేసులు అటు ప్రజలను, ఇటు వైద్య ఆరోగ్యశాఖను కలవరపెడుతున్నాయి. పుల్లలచెరువు మండలంలో అనుమానాస్పద కంఠసర్పితో మొదలైన కేసులు ఒకటొకటిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు పిల్లలను కంఠసర్పి బలిగొంది. మరికొన్ని అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. వాటిని సకాలంలో గుర్తించకపోవడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. కంఠసర్పి లక్షణాలు కూడా సాధారణ జ్వరంతో కూడిన లక్షణాలు కావడంతో వాటిని సకాలంలో గుర్తించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా కంఠసర్పి లక్షణాలు కనిపించిన వెంటనే శ్వాబ్(లాలాజలం) శాంపిల్స్ తీసి మైక్రోబయాలజీ విభాగానికి పంపించాల్సి ఉంటుంది. అయితే శ్వాబ్కు సంబంధించిన రిపోర్టులు కూడా సకాలంలో రాకపోవడంతో కేసులను వెంటనే గుర్తించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చికున్ గునియా బారినపడేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి వస్తుండటంతో అనేక మంది మంచాలకే పరిమిత మయ్యారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. దోమకాటువల్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. చీమకుర్తి వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మలేరియా ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో విజృంభిస్తోంది. ప్రజారోగ్యంపై ‘సమ్మె’ట పోటు: ప్రజారోగ్యంపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన సిబ్బంది మొత్తం సమ్మె బాట పట్టారు. గతంలో క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా ఇద్దరు లేదా ముగ్గురికి జ్వరాలు వచ్చినా వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ రెగ్యులర్ ఏఎన్ఎంలు హెల్త్ సూపర్వైజర్లు, హెచ్‌ఈఓలు సమ్మెలో ఉండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో వ్యాధులు వచ్చినప్పుడు కాలనీలు, గ్రామాలు మొత్తం వైద్య సిబ్బంది జల్లెడ పట్టేవారు. ప్రస్తుతం కాంట్రాక్టు సిబ్బంది మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.