బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లో పారిశుధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబ లుతున్నాయని రాష్ట్ర వైద్య శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. ‘బోన‘కిల్’.. డెంగీ పంజాకు జనం విలవిల అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన రాష్ట్ర వైద్య బృందం బోనకల్ పీహెచ్‌సీని బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అడిషనల్ డెరైక్టర్ శంకర్, రాష్ట్ర మలేరియా విభాగం అడిషనల్ డెరైక్టర్ ప్రభావతి మాట్లాడారు. ఈ ప్రాంతంలో రెండున్నర నెలలుగా ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, డెంగీతో 20 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్న వారు ఎవరూ మృతి చెందలేదన్నారు.
బోనకల్‌లో 20కి చేరిన మృతులు
బోనకల్ మండలంలో బుధవారం మరో ఇద్దరు డెంగీతో మృతి చెందారు. రావినూతలవాసి పూలబోరుున (32)ని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా 4 రోజుల అనంతరండెంగీ జ్వరం విషమించి మృతి చెందింది. గార్లపాడు గ్రామానికి చెందిన కట్టా సరస్వతి (30)ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
Published Thu, Oct 27 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement