జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.