జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వింత రాజకీయాలు అనుసరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలపై పవన్‌కు క్లారిటీ ఉందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.