టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి, డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్కు మధ్య ఎన్నో విభేదాలున్నాయని గతంలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే వీటికి తాజా వీడియో సమాధానం చెబుతుందని ఆశించవచ్చు. మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా-ఏ జట్టుపై ఇంగ్లండ్ నెగ్గిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత యువీ,ధోనీ భుజంపై చెయ్యి వేసి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరికొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. యువీ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వెల్ డన్ ధోనీ.. నీ కెప్టెన్సీలో మూడు మేజర్ టోర్నీలు నెగ్గగా, అందులో రెండు వరల్డ్ కప్ లున్నాయని ధోనిని ప్రశంసించాడు.అతడి కెప్టెన్సీలో ఆడటం చాలా గొప్పవిషమని వ్యాఖ్యానించాడు.
Published Wed, Jan 11 2017 2:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement