బిగ్‌బాస్ సీజన్ 3.. చూస్తుండగానే 50 రోజులు పూర్తయ్యాయి. ఇక అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కో రోజు గడుస్తూ ఉందంటే బిగ్‌బాస్ బిగ్‌ఫైట్‌కు తెర తీస్తున్నట్టే. ఇప్పటికే ఆరుగురు ఇంటిని వీడగా మరో 11 మంది బిగ్‌బాస్ టైటిల్ కొట్టేయడానికి హోరాహోరీగా తలపడనున్నారు. ఎనిమిదోవారం ఇంటిని వీడడానికి అయిదుగురు నామినేట్ కాగా అందులో నలుగురు మహిళలే ఉండటం గమనార్హం. బిగ్‌బాస్ హాఫ్ జర్నీ సాఫీగా సాగినా మున్ముందు అంత సులువుగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మొదలవుతున్న అసలైన రేసును కష్టతరం చేయడానికి బిగ్‌బాస్ మరింత కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో రకాల ఆటలు ఆడించిన బిగ్‌బాస్ ఇప్పుడు సరికొత్తగా హారర్ గేమ్ ఆడించనున్నాడు.