ఈ రోజు ఉదయం శివరాంపురం సమీపంలో కంది రైతులు కలిశారు. ‘అన్నా.. ఇంతకు మునుపు సాగర్ నీళ్లొచ్చేవి.. వరి వేసుకునేవాళ్లం. గత నాలుగేళ్లుగా ఆ నీళ్లు రాకపోవడంతో విధిలేక కంది వేసుకుంటున్నాం. ఒకప్పుడు క్వింటాకు రూ.10 వేలు పలికిన ధర.. ఇప్పుడు రూ.5,450కి పడిపోయింది. పోనీ, ఆ ధరకైనా అమ్ముకుందామంటే.. మార్కెట్ యార్డులో రెండు క్వింటాళ్లకు మించి కొనడంలేదు.