బీదాబిక్కీ, పేదాసాదా అనే తేడా లేకుండా రాక్షస కాండకు పాల్పడుతున్న పచ్చ రాబందులకు దయాదాక్షిణ్యాలు ఏ మాత్రం లేవనేందుకు ఉదాహరణ ఈ రోజు పాదయాత్రలో ఎదురైన సంఘటన. రచ్చ గెలిచి ఇంట ఓడిపోయిన ఓ సైనిక కుటుంబం ఆవేదన చూసి కడుపు తరుక్కుపోయింది. మేడికొండూరు దగ్గర షబీరున్నీసా అనే పెద్దామె నన్ను కలిసింది.