padayatra dairy
-
252వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
249వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
247వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
246వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
241వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
240వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
239వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
237వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
235వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
234వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
232వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
231వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
230వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
215వ రోజు పాదయాత్ర డైరీ
-
213వ రోజు పాదయాత్ర డైరీ
-
210వ రోజు పాదయాత్ర డైరీ
-
209వ రోజు పాదయాత్ర డైరీ
-
205వ రోజు పాదయాత్ర డైరీ
-
198వ రోజు పాదయాత్ర డైరీ
-
197వ రోజు పాదయాత్ర డైరీ
-
196వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర డైరీ
-
193వ రోజు పాదయాత్ర డైరీ
-
192వ రోజు పాదయాత్ర డైరీ
-
191వ రోజు పాదయాత్ర డైరీ
-
190వ రోజు పాదయాత్ర డైరీ
-
186వ రోజు పాదయాత్ర డైరీ
-
185వ రోజు పాదయాత్ర డైరీ
-
182వ రోజు పాదయాత్ర డైరీ
-
176వ రోజు పాదయాత్ర డైరీ
-
175వ రోజు పాదయాత్ర డైరీ
-
173వ రోజు పాదయాత్ర డైరీ
-
172వ రోజు పాదయాత్ర డైరీ
-
169వ రోజు పాదయాత్ర డైరీ
-
168వ రోజు పాదయాత్ర డైరీ
-
163వ రోజు పాదయాత్ర డైరీ
-
160వ రోజు పాదయాత్ర డైరీ
-
159వ రోజు పాదయాత్ర డైరీ
-
155వ రోజు పాదయాత్ర డైరీ
-
154వ రోజు పాదయాత్ర డైరీ
-
150వ రోజు పాదయాత్ర డైరీ
-
148వ రోజు పాదయాత్ర డైరీ
-
147వ రోజు పాదయాత్ర డైరీ
-
145వ రోజు పాదయాత్ర డైరీ
-
143వ రోజు పాదయాత్ర డైరీ
-
142వ రోజు పాదయాత్ర డైరీ
-
139వ రోజు పాదయాత్ర డైరీ
-
136వ రోజు పాదయాత్ర డైరీ
-
131వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
126వ రోజు పాదయాత్ర డైరీ
-
125వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
124వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
123వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
122వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
118వ రోజు పాదయాత్ర డైరీ
-
117వ రోజు పాదయాత్ర డైరీ
-
113వ రోజు పాదయాత్ర డైరీ
-
112వ రోజు పాదయాత్ర డైరీ
-
111వ రోజు పాదయాత్ర డైరీ
-
110వ రోజు పాదయాత్ర డైరీ
-
108వ రోజు పాదయాత్ర డైరీ
-
106వ రోజు పాదయాత్ర డైరీ
-
105వ రోజు పాదయాత్ర డైరీ
-
103వ రోజు పాదయాత్ర డైరీ
-
102వ రోజు పాదయాత్ర డైరీ
-
101వ రోజు పాదయాత్ర డైరీ
-
100వ రోజు పాదయాత్ర డైరీ
-
99వ రోజు పాదయాత్ర డైరీ
-
97వ రోజు పాదయాత్ర డైరీ
-
96వ రోజు పాదయాత్ర డైరీ
24–02–2018, శనివారం టకారిపాలెం, ప్రకాశం జిల్లా స్థిరంగా నిలబడి.. తలెత్తి చూడలేని దైన్యం వారిది ఈ రోజు పాదయాత్ర అంతా సాగు నీరందని రైతన్నల వ్యథలు, ఫ్లోరైడ్ పీడిత ప్రజల కన్నీటి కథల ప్రతిధ్వనుల మధ్యనే సాగింది. సరిగ్గా చెప్పాలంటే.. కనిగిరి నియోజకవర్గమంతా సాగునీటికి, తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రాంతం. సాగునీటి సమస్యతో చేలన్నీ బీళ్లవుతున్న దృశ్యాలొక వైపు, తాగునీరే విషమవుతున్న విషాదఛాయలు మరోవైపు.. మనసును తీవ్రంగా కలచివేశాయి. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లా ప్రకాశం. ఈ జిల్లాలోనే అతి ఎక్కువ పీడిత ప్రాంతం కనిగిరి. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్లోరైడ్ సమస్యతో కిడ్నీ పేషెంట్లయిన వాస్తవాలు కనిపిస్తాయి. వంకరపోయిన కాళ్లూచేతులు, దంతాలపై గార, వెన్ను, మెడ నొప్పులు, కిడ్నీ సమస్య, పెళుసుబారిన ఎముకలు.. ఫ్లోరైడ్ సమస్యతో ప్రజల్లో ఈ కష్టాలన్నీ తలెత్తుతున్నాయి. ఈ రోగగ్రస్తులు ఆకాశం కేసి చూడాలన్నా, ఎగిరెళ్లే విమానాన్ని చూడాలన్నా పడుకుని చూడాల్సిన పరిస్థితిని అక్కడ ఒకాయన చెబితే.. దేవుడా! అనిపించింది. అవును మరి.. స్థిరంగా నిలబడి తలెత్తి చూడలేని దైన్యం వారిది. చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు కమ్ముకుంటుంటే.. పాలకుల నిర్లక్ష్యం వారికెంత శాపమైందనిపించింది. ఇక్కడ వీరి కష్టాలు చూసి చలించిపోయిన నాన్నగారు.. ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు, తాగునీరు అందించాలని తపించారు. రామతీర్థ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రారంభించి, ఆయన హయాంలోనే పూర్తిచేశారు. కనిగిరి సమగ్ర రక్షిత మంచి నీటి పథకం ఆయన చలవతో రెండు దశలు పూర్తిచేసుకుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, ఈ నాలుగేళ్లలో ఒక్కపనీ మొదలుపెట్టలేదు. ఒక్క రూపాయీ శాంక్షన్ చేయలేదు.. ఎంత బాధాకరమో! కిడ్నీ బాధితుల సమస్యలకు చలించి నేను కూడా ఈ ప్రాంతానికొచ్చి ధర్నా చేశాను. అప్పుడు కదలిక వచ్చిన ప్రభుత్వం.. ఐదుచోట్ల మొక్కుబడిగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంది. వాటి నిర్వహణను గాలికొదిలేసింది. ఈ ప్రభుత్వానికి పేదలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేనితనం. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే ఇక్కడి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబుగారు.. ఇప్పుడు ఆ మాటే మరిచారని ఇక్కడి ప్రజలు బాధపడ్డారు. ‘నాన్నగారు ఉంటే వెలుగొండతో సహా మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. మా బాధలు తీరేవి’అని చెప్పారు. ‘మీ వల్ల కనీసం డయాలసిస్ కేంద్రాలొచ్చాయి.. అందుకు కృతజ్ఞతలు సార్’అని నాతో అక్కడివారంటుంటే.. వీళ్లకు ఫ్లోరైడ్ నుంచి శాశ్వతంగా విముక్తి కల్గించాలి.. ఫ్లోరైడ్ రహిత ప్రకాశం జిల్లానే నా ధ్యేయం.. అని మనసులో గట్టిగా తీర్మానించుకున్నాను. ఈ రోజు ఉదయం బత్తాయి, నిమ్మ పండ్ల రైతులు కలిశారు. ‘ఇంతకు ముందు పండ్ల తోటలు లాభదాయకంగా ఉండేవి. కానీ, గత నాలుగేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా తోడైంది. జీవితకాలం ఆధారంగా ఉంటాయన్న నమ్మకంతో పండ్ల తోటలు వేసుకున్నాం. వర్షాల్లేక, బోర్లలో నీళ్లు సరిపోక చెట్లు చచ్చిపోతున్నాయి. తోటలకు తోటలే నాశనమైపోతున్నాయి’అని ఆ రైతన్నలు బాధపడిపోతుంటే.. అసలు రైతులకే ఇన్ని కష్టనష్టాలెందుకు? అనిపించింది. ‘ఇంత ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు’అని వారు చెబుతుంటే.. ప్రజా సమస్యలకన్నా ముఖ్యమైన విషయాలు ఈ పాలకులకేం ఉంటాయో.. అని ఆశ్చర్యం అనిపించింది. ఇలా సాగు, తాగు నీరు లేక, బతుకో జీవన్మరణ సమస్యగా తయారవుతుంటే, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తిచేయాల్సింది పోయి.. వాటిని గాలికొదిలేసిందీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికి, పట్టణానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం, సముద్ర జలాలను శుభ్రపరిచి మంచి నీటిగా మార్చగల డిశాలినేషన్ ప్లాంట్లను మంజూరు చేస్తామంటూ మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు కదా.. అవేమైనా గుర్తున్నాయా? వాటిలో ఏ ఒక్కటన్నా నెరవేర్చి ఉంటే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇంత దీనావస్థలో ఉండేదా? - వైఎస్ జగన్ -
95వ రోజు పాదయాత్ర డైరీ
-
94వ రోజు పాదయాత్ర డైరీ
-
93వ రోజు పాదయాత్ర డైరీ
-
92వ రోజు పాదయాత్ర డైరీ
-
92వ రోజు పాదయాత్ర డైరీ
19–02–2018, సోమవారం విప్పగుంట, ప్రకాశం జిల్లా హెరిటేజ్ కోసం పలు సహకారరంగ డెయిరీలను బలిపెట్టారు ఈరోజు ఉదయం ఇద్దరు అక్కాచెల్లెళ్లు నాతో చెప్పిన మాటలు నా మనసును కలచివేశాయి. వెంకటాద్రిపాలేనికి చెందిన గురజాల రాణి, రిబ్కా అక్కాచెల్లెళ్లు. వాళ్ల నాన్న జబ్బుచేసి చనిపోయాడట. అండగా ఉంటాడనుకున్న అన్న యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఆ చావుల బాధను, పిల్లల కష్టాలను భరించలేక అమ్మ మనోవేదనతో కుంగి కృశించిపోయి గుండెపోటుతో మరణించిందట. ఇద్దరు ఆడబిడ్డలూ అనాథలయ్యారు. ఇన్ని కష్టాలలోనూ అక్క 85శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిందట. పైచదువులు చదవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక రాజీపడిపోయిందట. టీటీసీ చదువుకుంటున్న చెల్లెలి చదువు కొనసాగాలంటే తను కూలో, నాలో చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తానన్న ఉద్యోగం గానీ, నిరుద్యోగ భృతిగానీ రాలేదేంటన్నా..? అంటూ అమాయకంగా అడిగింది. ఆ బిడ్డలిద్దరు తమ బాధలు చెబుతున్నప్పుడు గుండె బరువెక్కింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెమ్మల్లానే రాష్ట్రంలోని కోట్లాది మంది యువత బాబుగారిచే వంచించబడ్డారు. కొద్దిదూరం ముందుకెళ్లగానే.. ఉపాధి హామీ పథకంలో పనుల కోసం వెళ్లి, పని ప్రదేశంలోనే గాయపడి, ఒక కాలును పోగొట్టుకున్న ఎడ్లూరుపాడుకు చెందిన యలమందయ్య కలిశాడు. ఏడాది కిందట ఆయన ఉపాధి పనులకెళ్లినప్పుడు గాయపడ్డాడట. పని ప్రదేశంలో అనారోగ్యానికి లోనైనా, ప్రమాదానికి గురైనా.. వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని పార్లమెంటు ఆమోదించిన చట్టమే చెబుతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అతడి వైద్యం గురించి పట్టించుకోలేదట. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో పాపం ఆ పెద్దాయన చేసేదిలేక లక్షా ఇరవై వేల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకున్నాడట. సమయానికి డబ్బు సమకూరక, వైద్యం ఆలస్యం కావడం వల్ల గాయం సెప్టిక్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చిందట. ఇది చాలదన్నట్లు 80శాతం అంగవైకల్యం ఏర్పడిన ఆ వ్యక్తికి కనీసం పింఛన్ ఇచ్చిన పాపానపోలేదట. యలమందయ్య విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదలంటే లెక్కలేని తనం.. ఆ కుటుంబాన్ని అప్పులపాల్జేసి వీధిన పడేసింది. విప్పగుంట వద్ద పాడి రైతులు కలిశారు. నిత్యం కరువుకాటకాలతో సతమతమవుతూ వర్షాల్లేక పాడిపైనే ఆధారపడి బతుకుతున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో, రైతుల శ్రమతో ఏర్పడ్డ ఒంగోలు డెయిరీపై ఆధారపడి సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామన్నారు. 2014 వరకు ఆ డెయిరీ లాభాలబాటలో పయనించేదని, సకాలంలో చెల్లింపులుండేవని, బోనస్‌లు కూడా ఇచ్చేవారని అన్నారు. ఆ డెయిరీ సహకారంతో గేదెల కొనుగోలుకు బ్యాంకు రుణాలు కూడా పొందామని చెప్పారు. కానీ, 2014లో బాబుగారి పాలన వచ్చాక ఒక్కసారిగా డెయిరీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, నెలల తరబడి చెల్లింపులే లేవని అన్నారు. జిల్లాలో పాడిరైతులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.11 కోట్లు ఉన్నాయట. ఇదే అదునుగా ప్రయివేటు డెయిరీలు కుమ్మక్కై రైతులకిచ్చే ధరను తగ్గించేసి దారుణంగా దెబ్బతీశాయన్నారు. అటు వ్యవసాయం చేసుకోలేక, ఇటు పాడిపై ఆధారపడి బతకలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని, వలసలే శరణ్యమని వాపోయారు. బాబుగారు ఇప్పటికే చిత్తూరు సహా పలు సహకార రంగ డెయిరీలను తన సొంత డెయిరీ హెరిటేజ్ కోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఒంగోలు డెయిరీ వంతు రావడం నిజంగా బాధేస్తోంది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. లాభాల బాటలో సాగుతున్న ఒంగోలు డెయిరీ.. మీరు అధికారం చేపట్టగానే ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి ఎలా వెళ్లింది? మీ అనుకూల పాలకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఒంగోలు డెయిరీని నష్టాల ఊబిలోకి నెట్టి పాడి రైతుల పొట్టగొట్టడం న్యాయమేనా? మీరు పాలన చేపట్టగానే ఒంగోలు డెయిరీతో సహా రాష్ట్రంలోని అన్ని సహకార డెయిరీలు అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లడం, హెరిటేజ్ డెయిరీ మాత్రం అంతకంతకూ లాభాల బాట పట్టడం వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
91వ రోజు పాదయాత్ర డైరీ
-
91వ రోజు పాదయాత్ర డైరీ
18–02–2018, ఆదివారం కందుకూరు, ప్రకాశం జిల్లా భావితరాల బంగారు భవితవ్యం కోసం.. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం బడేవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బొమ్మల చిన్నయ్య రావడం రావడమే బాబుగారిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘సార్.. ఈ గవర్నమెంటును నమ్మేదానికే లేకుండా పోతోంది. నాకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకుని కుటుంబాన్ని సాక్కుంటున్నాను. వర్షాల్లేక పంటలు ఎండి పోతుంటే బోరు వేసుకుందామనుకున్నాను. ఎస్సీ కార్పొరేషన్‌కు పోతే బోరు మంజూరు చేశారు. ఇది జరిగి రెండేళ్ల పొద్దయింది. ఇప్పటికీ నా పొలంలో బోరుపడ్డ పాపానపోలేదు. ఇదేమి సామీ అనుకుంటూ అధికారులకు, ఆఖరుకు కలెక్టర్‌కు కూడా పలుమార్లు విన్నవించుకున్నాను. పట్టించుకున్న నాథుడే లేడు. రెండేళ్లుగా తిరుగుతూ ఉంటే విసుగొస్తోంది.. కోపమొస్తోంది. ఆ కోపం ఎవరిమీద చూపించాలో తెలియడం లేదు.’ అంటూ 65 ఏళ్ల వృద్ధుడు ఆవేశపడిపోతుంటే ధర్మాగ్రహమే కదా.. అనిపించింది. పాపం ఇప్పుడు కూడా మిర్చి పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందట. పంట ఎండిపోతే రైతు బతుకులో జీవకళ పోయినట్టే కదా. అందుకే రైతులందరికీ ఉచిత బోరు పథకమనేది వర్తించేలా చేయాలన్న నా సంకల్పం దృఢపడింది. జలదంకి మండలానికి చెందిన దర్గాబాబుకూ ఇదేరకం చేదు అనుభవం ఎదురైంది. మినీ డెయిరీ పెట్టుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్‌ను ఆశ్రయించాడట. గతేడాది ఇంటర్వ్యూ చేసి సెలక్ట్ అయ్యావన్నారట. మొదట రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారట. సెలక్షన్లు అయిపోయాక లోన్‌ను రూ.3 లక్షలకే కుదించారట. కలెక్టర్ శాంక్షన్ లెటర్ అయితే ఇచ్చారు గానీ, ఆయనకు మాత్రం ఏడాది గడిచిపోతున్నా నిరీక్షణ తప్పలేదట. ఆయనతో పాటు ఆ లోన్లకు ఎంపికయిన మరో 32 మంది ఎస్సీ సోదరులదీ అదే పరిస్థితి. ఇంతవరకూ ఏ ఒక్కరికి కూడా లోన్ ఇవ్వకపోగా.. ఈ సంవత్సరా నికి సంబంధించి మళ్లీ ఇంటర్వ్యూలు జరుపుతున్నారట. ఇది ఎవర్ని మోసం చేయడానికి? కులానికో కార్పొరేషన్ పెట్టి.. వాటిని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి.. ఇలా ఎంతకాలం మోసం చేస్తూ పోతారు? ఇలా చేయడం ధర్మమేనా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనసున్న నేత అధికారంలో ఉంటే.. ఏం జరుగుతుందనే దానికి నిదర్శనం కందుకూరు తాగునీటి సమస్య పరిష్కా రం. మెట్ట ప్రాంతం, ఆపై ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన కందుకూరు ఒకప్పుడు తాగునీటికి కటకటలాడిన పట్టణం. ఇక్కడ అక్కచెల్లెమ్మలు మైళ్ల దూరం వెళితేగానీ.. బిందెడు మంచినీరు దొరకని పరిస్థితి. ఆ ఇక్కట్లను గుర్తెరిగిన నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేసి నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాలను కందుకూరుకు రప్పించి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చారు. ఆ మేలును ఎన్నటికీ మరువలేమంటూ ఈ ప్రజలు పదే పదే గుర్తుచేస్తుంటే.. మనసంతా సంతోషంతో నిండిపోయింది. జనంతో పోటెత్తిన కందుకూరు సభలో హోదా కోసం ఎందాకైనా పోరాడాల న్న నా సంకల్పాన్ని, దృఢచిత్తాన్ని మరోసారి ప్రజల ముందుంచి.. హోదా సాధన కోసం రాష్ట్రమంతా ఏకమై చిత్తశుద్ధితో పోరాడదామని పిలుపుని చ్చాను. రాష్ట్రానికి పరిశ్రమల కోసం.. పిల్లల ఉద్యోగాల కోసం.. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. భావి తరాల బంగారు భవితవ్యం కోసం.. ఎవరితో నైనా కలుస్తాం. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ఎన్ని పోరాటాలకైనా సన్నద్ధం. అవిశ్వాసానికైనా.. రాజీనామాలకైనా. మన ఆశ, మన శ్వాస హోదాయే. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. హోదాను తాకట్టుపెట్టారు.. ప్రత్యేక ప్యాకే జీ అన్నారు.. హోదాలో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు.. అందుకే అంగీకరించామన్నారు. మీరు, బీజేపీ వారు ఇవే మాటలు మాట్లాడారు. రాజ్యసభలో వెంకయ్యగారు మాట్లాడిన మాటలు, తిరుపతిలో ప్రధాని సమక్షంలో మీరు పలికిన పలుకులు ఒక్కసారి గుర్తుచేసుకోండి.. అబద్ధాలు చెబుతూ మీ మనస్సాక్షిని ఎలా అమ్ముకోగలుగుతున్నారు? ఇది అధర్మం కాదా? అన్యాయం అనిపించలేదా? -వైఎస్ జగన్ -
90వ రోజు పాదయాత్ర డైరీ
-
90వ రోజు పాదయాత్ర డైరీ
17–02–2018, శనివారం పోకూరు, ప్రకాశం జిల్లా నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే కోటేశ్వరమ్మ అనే అక్క ‘అన్నా.. మేము పాస్ పుస్తకాలు పెట్టి బంగారం లోను కింద రూ.87,000 తీసుకున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే ఆశపడ్డాం. ఇప్పటిదాకా ఒక్క పైసా మాఫీ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగాం, కలెక్టర్‌ను కలిశాం. అమరావతి దాకా వెళ్లి అక్కడా పెద్దోళ్లకు విన్నవించాం. అటూ ఇటూ తిరగడానికే ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఆఖరుకు బంగారం వేలం వేస్తారని తెలిసి, బయట అప్పు తీసుకుని వడ్డీతో సహా బ్యాంకులో కట్టాం. మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్లయింది మా పరిస్థితి.. అంటూ ఆ అక్క చెబుతుంటే.. అయ్యో పాపం అనిపించింది. సంపత్ అనే సోదరుడిదీ కోటేశ్వరమ్మ కథే. బ్యాంకులో బంగారం పెట్టి రూ.లక్షన్నర లోను తీసుకున్నాడట. రుణమాఫీ కింద మొదటి విడత రూ.25 వేలు ఇచ్చినట్లు రుణ ఉపశమన పత్రం కూడా అందుకున్నాడు. అది పట్టుకుని బ్యాంకుకు పోతే.. ఇంకా రాలేదంటారట. అధికారుల దగ్గరకు పోతే మేం డబ్బులు వేశాం.. బ్యాంకులకు వెళ్లమంటారట. తిరిగీ తిరిగీ విసిగిపోయాడట. ఈ రుణమాఫీ అంతా మోసం సార్.. ఆయనగారి హామీ నమ్మిన పాపానికి నా లక్షన్నర లోను కాస్తా.. వడ్డీలతో కలిపి రూ.మూడు లక్షలు దాటిందంటూ ఆ సోదరుడు చెబుతుంటే.. ఎన్ని బతుకుల్లో బండలు పడ్డాయిరా దేవుడా అనిపించింది. వీవీపాలెం దగ్గర పొగాకు రైతులు కలిశారు. పొగాకు సేద్యం చేసినందుకు ఏటా నష్టాలేనట. మా లైసెన్స్‌లు తిరిగిచ్చేస్తాం పరిహారమివ్వండి.. పొగాకు సేద్యం ఎత్తేస్తాం.. అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నాన్నగారి హయాంలో పొగాకు సరాసరి ధర రూ.127 ఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత, సాగు ఖర్చులన్నీ రెట్టింపయ్యాక కూడా ఇప్పుడు సరాసరి ధర రూ.116 అంటే.. రైతుకెంత నష్టమో ఆలోచించండి సార్.. అంటూ వారు లెక్కలేసి మరీ చెప్పారు. ‘బతకలేక, వలసలు పోలేక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం చెప్పిందని గతేడాది శనగ పంట వేస్తే.. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం, వ్యాపారులు కుమ్మక్కై మమ్మల్ని నిలువునా ముంచేశారు. గతేడాది రూ.10,000 దాకా పలికిన శనగల బస్తా, ఇప్పుడు రూ.4,000 లోపే పలుకుతోంది. మా దగ్గరేమో రూ.3,800కు కొంటున్నారు. దళారుల చేతుల్లో పడ్డాక ధర రూ.10,000 దాటుతోంది. ఇదెక్కడి న్యాయం?’ అంటూ ఆ రైతన్నలు బాధపడ్డారు. వ్యవసాయాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తుంటే.. రాష్ట్రానికి ఎంత అరిష్టమో ఈ పాలకులు ఏమైనా ఆలోచిస్తున్నారా.. అనిపించింది. కందుకూరువాసి 21 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ కథ కలచివేసింది. నడుం వంగిపోయి, కళ్లు ఉబ్బిపోయిన ప్రవీణ్ నన్ను చూడగానే కంటతడి పెట్టుకున్నాడు. ‘అన్నా.. మా కష్టాలు పగవాడికీ రాకూడదు. నాకు తలసీమియా. మా అక్కా ఈ జబ్బుతోనే చనిపోయింది. బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్న నాన్నకు నా వైద్యం ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. వారానికోసారి రక్తం ఎక్కించుకోవాలి. రోజూ మందులు వాడాలి. మందుల ఖర్చే ఏడాదికి రూ.లక్షవుతోంది. నా కోసం మా నాన్న పడుతున్న యాతన చూసి.. ఎందుకు పుట్టించావురా దేవుడా.. అనిపిస్తోంది. గతంలో నాకు అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు లక్షలాది రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేయించిన మీ నాన్నగారు మా పాలిట దేవుడు. మాలాంటోళ్లకు ఎంతో మేలు చేసేలా నెలకు రూ.10,000 పింఛన్ ఇస్తామని చెప్పారు మీరు. చాలా సంతోషం అనిపిస్తోంది’ అంటూ చేయి పట్టుకున్నాడు. నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి. ఇలాంటి వారి కన్నీళ్లు తుడిచి తీరాలనుకుంటూ ముందుకు అడుగులేశాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ వేయండి.. అంటూ రైతులకు భరోసాగా చెప్పారు. తీరా పంటచేతికొచ్చాక ధరలు పతనమైపోతే.. ఆ రైతులు ఇప్పుడు ఎవరిని నిలదీయాలి? ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే వ్యాపారులతో కుమ్మక్కై ధరల పతనానికి కారణమైతే.. ఆ రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తుంటే కాపాడేదెవరు? -వైఎస్ జగన్ -
89వ రోజు పాదయాత్ర డైరీ
-
89వ రోజు పాదయాత్ర డైరీ
16–02–2018, శుక్రవారం బంగారక్కపాళెం క్రాస్ రోడ్డు, ప్రకాశం జిల్లా యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజు నెల్లూరు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టాను. ఏచోటికెళ్లినా ఎండమావులే. ఏ ఎదను కదిపినా వేడి నిట్టూర్పులే. ఏ ప్రాంతం అయితే ఏంటి.. పేదోడి ఇంట కష్టాలూ, కన్నీళ్లే. పెదపవని గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆవేదన చూశాక గుండె బరువెక్కింది. కూలి చేసే ఆమె భర్త మంచానపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లయిన ఏడాదికే కిడ్నీలు చెడిపోయి చావుతో పోరాడుతున్నాడు. కడుపుతీపి చంపుకోలేక తన కిడ్నీ ఇవ్వాలనుకుందా తల్లి. కానీ ఆమెకూ గర్భసంచి క్యాన్సరట. పోనీ, అవయవదానం ద్వారా కిడ్నీ మార్పిద్దామనుకుంటే.. ఆరోగ్యశ్రీ వర్తించదట. రూ.6 లక్షలు ఖర్చవుతుందట. ఏం చేయాలా తల్లి? ఎవరికి చెప్పుకోవాలి ఆమె ఘోష? సింగరపాలేనికి చెందిన 83 ఏళ్ల అవ్వ లచ్చమ్మ తన కష్టాలు చెప్పింది. పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదట. రేషన్ కూడా ఇవ్వడం లేదట. ఎందుకని అడిగితే.. ఫ్యాను గుర్తుకు ఓటేశావుగా.. అంటున్నారట. మానసిక వికలాంగుడైన మనవడితో బతుకు పోరు చేస్తున్న ఆ అవ్వను ఇలా మాటలతో చంపడం న్యాయమేనా? కొడుకు చనిపోయినా చంద్రన్న బీమా ఒక్క పైసా రాలేదయ్యా.. అంటూ ఆదిలక్ష్మి అనే అమ్మ ఆక్రోశించింది. చేపలు పట్టుకుని జీవించే చేటూరి భవానీది మరో కన్నీటి గాథ. నాన్నగారి హయాంలో పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్ చేయించుకుందట. ఇప్పుడు మళ్లీ జబ్బుచేసిందామెకు. ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ చెల్లదన్నారట. భర్తలేని ఆ తల్లి.. ఇద్దరు కూతుళ్లను సాకుతోంది. దారి చూపాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వీళ్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా? వీరి పట్ల కూడా పార్టీల వివక్ష చూపుతున్న ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? కొత్తపేట నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు మీదుగా వెళుతుంటే.. ఆ ప్రాజెక్టు కమిటీ మాజీ ప్రెసిడెంటు నరసింహరావన్న ‘సార్.. నాలుగేళ్లుగా ఇక్కడ వ్యవసాయం తెల్లారిపోతోంది. వర్షాల్లేవు, ప్రాజెక్టుల్లోకి నీళ్లూ రావు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పనుల్లేక, బతుకుదెరువు కనిపించక వలసలు పోతున్నారు. ఇలాంటి పరిస్థితులొస్తాయని మీ నాన్నగారు సోమశిల నుంచి ఉత్తర కాలువ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీటిని తరలించాలన్న బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. మా దురదృష్టం.. ఆయన తదనంతరం మా కష్టాలు తీర్చాలన్న తపన ఉన్న నాయకుడే రాలేదు. అందుకే ఈ పథకం అసంపూర్తిగానే ఉండిపోయింది’అని చెబుతుంటే.. ఆ ప్రాజెక్టును అలా చూస్తుండిపోయాను. ఈ పథకం పూర్తయితే వలసలు ఆగడంతో పాటు తాగునీరు అంది.. ఫ్లోరైడ్ బాధ తప్పేది కదా. ఈ రోజు పత్రికల్లో ముఖ్యమంత్రిగారి ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాడట. నాలుగేళ్లుగా మన పిల్లలు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతుంటే.. నిద్రపోతున్నారా? మన రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వారు ఎగరేసుకుపోయిన విషయం కనిపించలేదా? వాచ్మేన్లు, స్వీపర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను మాత్రం మనవారికి ఇస్తూ ఉంటే.. ఇంతకాలం మీరేం చేస్తున్నారు? ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్న తరుణంలో ప్రజలను మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారా? మీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్న యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని, పరిశ్రమలు కట్టడానికే మూడు నాలుగేళ్లు పడుతుంది కాబట్టి.. ప్రత్యేక హోదా పదేళ్లని.. పదిహేనేళ్లని వెంకయ్యనాయుడుగారు రాజ్యసభలోనూ, మీరు మోదీగారి సమక్షంలోనూ అనలేదా? ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు మన రాష్ట్రానికి ఒక్కటైనా వచ్చిందా? అవి రానప్పుడు హోదాను పక్కన పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఎందుకు రాజీపడ్డారు? ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? పరిశ్రమల్లో ఉద్యోగాల విషయంలో స్థానిక యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పదే పదే ప్రస్తావించిన తర్వాత.. నాలుగేళ్లపాటు పట్టించుకోని మీరు ఈ రోజు ఎన్నికలు దగ్గరపడుతున్న తరు ణంలో స్థానికులకు అత్యధిక శాతం ఉద్యోగాలను ప్రకటించడం మరోసారి వంచించడం కాదా? -వైఎస్ జగన్