నాన్నగారే ఉంటే అద్దంకి ఇలా దయనీయంగా ఉండేదా? ఈ నియోజకవర్గంలో ఈ రోజు సాగిన పాదయాత్రలో చాలామంది అన్న మాట ఇది. నిజమే.. గుండ్లకమ్మ ప్రాజెక్టు, భవనాశి రిజర్వాయర్, యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోతల.. ఆయన పథకాలే. రూ.592 కోట్ల అంచనా విలువున్న గుండ్లకమ్మకు నాలుగేళ్లలోనే దాదాపు రూ.579 కోట్లు వెచ్చించి ఆయన హయాంలోనే పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు.