ఈ రోజు ఉదయం మానుకొండువారిపాలెంలో ఆ గ్రామ సర్పంచ్ దయమ్మ, ఉప సర్పంచ్ శీనన్న ఘన స్వాగతం పలికారు. మండుటెండలో సైతం జనాభిమానం ఉప్పొంగింది. దయమ్మక్క నాతో మాట్లాడుతూ ‘అన్నా.. వేలిముద్రలు పడటం లేదంటూ, అదంటూ.. ఇదంటూ.. ఏదో ఒక సాకు పెట్టి రేషన్ బియ్యం ఎగ్గొడుతున్నారు. బియ్యం కూడా ఇవ్వకపోతే పేదలు బతికేదెట్టా’ అంది.