కొండచిలువలు జనావాసాల్లోకి చోచ్చుకొస్తున్నాయి. రోడ్లపైకే కాకుండా ఇండ్లలోకి, వాహనాల్లోకి చోరబడుతున్నాయి. తాజాగా థాయ్‌లాండ్‌లోని టీ నట్వజిట్ అనే షాప్ ఓనర్‌కు కారులోకి 12 అడుగుల కొండ చిలువ దూరింది. కారు కింది భాగంలో తోక వేలాడుతుందని కొందరు చెప్పడంతో.. నట్వజిట్ ఆందోళనకు చెందాడు. తన వాహనం ఇంజన్ తెరచి చూసి షాక్ తిన్నాడు. అందులోని కొండచిలువను చూసి ఏం చేయాలో దోచక వెంటనే ఇంజన్ డోర్‌ను మూసివేశాడు. ఈ సమాచారాన్ని వెంటనే జంతువులను పట్టే వారికి(రెస్క్యూ టీమ్) తెలియజేశాడు.