ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధునిక నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్‌ను ఏపీ ప్రభుత్వం అణచివేసేందుకు యత్నించడంపై భూమన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి హోదాను రాకుండా అడ్డుకుంటున్న విలన్ చంద్రబాబే అన్న సంగతి మరోసారి తేలిపోయిందని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి పోరాటం చేసింది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు.