ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. మంగళవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేశారు. హోదా ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు వినిపించేలా గట్టిగా నినదించారు. హోదా సాధనలో సీఎం చంద్రబాబు చేసిన మోసం, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని హోదాపై ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. షాపులు మూతబడ్డాయి. స్కూళ్లు తెరుచుకోలేదు.