ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం అవిశ్వాసం నుంచి రాజీనామాలు.. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష వరకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఓ కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని క్లైమాక్స్‌కు చేర్చిన తరుణంలో.. పార్లమెంటు మరో మూడు రోజుల్లో ముగిసిపోతున్న దశలో.. హస్తిన చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తన నాటకాలను తానే బయటపెట్టుకున్నారు