అవినీతికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబు | Chandrababu is the Care of address for Corruption Says Vijaya Sai Reddy | Sakshi
Sakshi News home page

అవినీతికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబు

Published Mon, Apr 30 2018 9:41 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’  సభాప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు. దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్‌డ్‌ డీలర్స్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2014 ఏప్రిల్‌ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అదొక అధర్మ సభ అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు ఈ సభను చిత్తశుద్ధితోనే నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కడుతూ.. కొండ కింద కుస్తీ పడుతోందన్నారు. ఇది ధర్మమా? న్యాయమా? అని మీరే ప్రశ్నించుకోండి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement