భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 72 గంటల నిషేధాజ్ఞలను జవదాటి ప్రచారం నిర్వహించినందుకు ప్రజ్ఞాసింగ్‌ని ఈసీ వివరణ కోరింది. బాబ్రీ మసీదుకు సంబంధించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు... 72గంటలపాటు ప్రచారం చేయకుండా సాధ్విపై ఈసీ నిషేధం విధించింది.