ఉమ్మడి హైకోర్టు విభజన అడ్డగోలుగా చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైకోర్టును ఏపీకి తీసుకెళ్లవద్దని, ఇక్కడే ఇంకో భవనం చూసుకోమని తాము చెబితే, డిసెంబర్‌లోగా వెళ్లిపోతామని సుప్రీంకోర్టుకు అఫిడివిట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప‍్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేసీఆర్.. చంద్రబాబు మాట్లాడుతున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు.