అయిదుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు పేర్కొన్నారు. హత్యా రాజకీయాల్లో పాలుపంచుకునే మంత్రి ఆది నారాయణ రెడ్డి పక్కన కూర్చుని మంత్రి సోమిరెడ్డి రౌడీయిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సోమిరెడ్డిని ఓడించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని వ్యాఖ్యానించారు