గల్లీ నాయకులకే ఈ రోజుల్లో కోట్లు విలువ చేసే భవంతుల్లో ఉంటుంటే.. ఒక రాష్ట్రానికి 20 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన మాణిక్ సర్కార్ మాత్రం పార్టీ ఆఫీసునే తన ఇంటిగా మార్చుకున్నారు. త్రిపురను రెండు దశాబ్దాలుగా ఏలి, అసాధారణ సీఎంగా పేరు తెచ్చుకున్న మాణిక్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం తన స్వగృహాన్ని పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నారు.