విభజన హామీల అమలును కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎంపీలు నినదించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఎలాంటి సమస్యలు రాలేదని, వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రభుత్వం రాజనీతిజ్ఞతతో వ్యవహరించిందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు