సిరియాలో బాల్యం రక్తమోడుతోంది. గత కొన్ని సంవత్సరాలు అంతర్యుద్ధంలో చిక్కుకొని.. నిత్యం బాంబు దాడులు, తుపాకుల మోతతో రక్తసిక్తమవుతున్న సిరియాలో బాల్యం చితికిపోతోంది. తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలిస్తున్నాయి. యుద్ధక్షేత్రం మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.